TG ePASS Scholarship Updates : తెలంగాణ విద్యార్థులకు అలర్ట్ - స్కాలర్​షిప్ దరఖాస్తు గడువు మరోసారి పొడిగింపు, వివరాలివే-telangana epass scholarship registration has been extended till 31st may 2025 ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tg Epass Scholarship Updates : తెలంగాణ విద్యార్థులకు అలర్ట్ - స్కాలర్​షిప్ దరఖాస్తు గడువు మరోసారి పొడిగింపు, వివరాలివే

TG ePASS Scholarship Updates : తెలంగాణ విద్యార్థులకు అలర్ట్ - స్కాలర్​షిప్ దరఖాస్తు గడువు మరోసారి పొడిగింపు, వివరాలివే

Telangana ePASS Scholarship Updates : తెలంగాణలో ఉపకార వేతనాలు, బోధన రుసుములపై ప్రభుత్వం మరో అలర్ట్ ఇచ్చింది. దరఖాస్తు చేసుకునేందుకు వీలుగా గడువును పెంచింది. అర్హులైన విద్యార్థులు మే 31, 2025వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తాజా ప్రకటనలో పేర్కొంది.

స్కాలర్​షిప్ ల దరఖాస్తు గడువు పొడిగింపు

ఉపకార వేతనాలు, బోధన రుసుములపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2024- 2025 విద్యా సంవత్సరానికి గానూ స్కాలర్ షిప్స్ రిజిస్ట్రేషన్లు, రెన్యూవల్ తేదీల గడువును మరోసారి పొడిగించింది. ఈ మేరకు తాజాగా ఉత్తర్వులను జారీ చేసింది.

రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈబీసీ విద్యార్థులు బోధన ఫీజులు, స్కాలర్ షిప్ కోసం మే 31వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునే వీలు కల్పించింది. గత విద్యా సంవత్సరానికి సంబంధించి 11 లక్షలకు పైగా విద్యార్థులు ఉండగా… 10 లక్షలకు పైగా విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. కొన్ని కోర్సుల్లో ప్రవేశాల ప్రక్రియ జాప్యం కావటంతో… కొంతమంది విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకోలేకపోయారు. దీంతో ప్రభుత్వం… గడువును పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

నిజానికి ఈ గడువు గతేడాది డిసెంబర్ 31వ తేదీతోనే పూర్తి అయింది. కానీ విద్యార్థుల నుంచి వచ్చిన విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం…. మార్చి 31, 2025వ తేదీ వరకు పొడిగించిన సంగతి తెలిసిందే. ఈ తేదీలోపు కూడా మరికొంత మంది అప్లికేషన్ చేసుకోకపోవటంతో… తాజాగా మే 31 వరకు అవకాశం కల్పించింది.

ఇలా రిజిస్ట్రేషన్ చేసుకోండి…

అర్హత కలిగిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ విద్యార్థులు https://telanganaepass.cgg.gov.in/ . వెబ్ సైట్ లోకి వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక రెన్యూవల్ చేసుకోలేని విద్యార్థులు కూడా ఈ గడువులోపు చేసుకునే అవకాశం ఉంది.

కొత్త విద్యార్థులు అయితే.. 'ఫ్రెష్ రిజిస్ట్రేషన్' అనే ఆప్షన్​ పై నొక్కాలి. అప్పుడు బ్రౌజర్​లో మీ స్కాలర్ షిప్ సంబంధిత అప్లికేషన్ ఫారమ్ ఓపెన్ అవుతుంది.మీ వివరాలను ఎంటర్ చేసి.. అవసరమైన పత్రాలను అప్​లోడ్ చేయాలి. ఇక చివరగా.. అప్లికేషన్​లో మీరు నమోదు చేసిన వివరాలను సమీక్షించుకుని "సబ్మిట్" చేయాలి. ఆ తర్వాత అప్లికేషన్ ప్రింట్ అవుట్ తీసుకొని.. భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్​ రిఫరెన్స్ నంబర్​ను నోట్ చేసుకోవాలి.

స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి….

తెలంగాణ ఈ-పాస్ వెబ్ సైట్(https://telanganaepass.cgg.gov.in/ ) లోకి వెళ్లి అప్లికేషన్ స్టేటస్ కూడా చెక్ చేసుకునే వీలు ఉంటుంది. దరఖాస్తు ఏ స్థితిలో ఉందో తెలసుకోవచ్చు. ఇక రెన్యూవల్ విద్యార్థులు కూడా ఇదే వెబ్ సైట్ లోకి వెళ్లి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చేసుకోవాలి. అయితే వారు Renewal Registration అనే ఆప్షన్​పై నొక్కి….రెన్యూవల్ ప్రక్రియను పూర్తి చేయవచ్చు. రెన్యూవల్ విద్యార్థులు స్కాలర్ షిప్ స్టేటస్ చెక్ చేసుకునే వీలుంటుంది.

Maheshwaram Mahendra Chary

TwittereMail
మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం