Stipend Hike: గుడ్ న్యూస్.. వైద్య విద్యార్థులకు స్టైఫండ్‌ పెంపు-telangana enhances stipend by 15 per cent to medical students ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Telangana Enhances Stipend By 15 Per Cent To Medical Students

Stipend Hike: గుడ్ న్యూస్.. వైద్య విద్యార్థులకు స్టైఫండ్‌ పెంపు

Mahendra Maheshwaram HT Telugu
May 28, 2023 02:35 PM IST

Telangana Medicos Stipend Increase: వైద్య విద్యార్థులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. 15 శాతం స్టైఫండ్‌ పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది.

వైద్య విద్యార్థులకు 15 శాతం స్టైఫండ్‌ పెంపు
వైద్య విద్యార్థులకు 15 శాతం స్టైఫండ్‌ పెంపు

Medicos Stipend Increase in Telangana: తెలంగాణలోని వైద్య కళాశాల్లో చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఎంబీబీఎస్, బీడీఎస్ హౌస్ సర్జన్లకు, పీజీ డిగ్రీ, పీజీ డిప్లోమా, ఎండీఎస్, సూపర్ స్పెషాలిటీ కోర్పులు చదువుతున్న విద్యార్థులకు స్టైపెండ్ పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే సీనియర్ రెసిడెంట్లకు హానరోరియం కూడా పెంచింది. ఈ మేరకు ఆదేశాలు వచ్చాయి.2023 జనవరి ఒకటో తేదీ నుంచి పెరిగిన స్టైఫండ్ వర్తిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొంది.

ట్రెండింగ్ వార్తలు

మెడికల్, డెంటల్ హౌస్ సర్జన్లకు ప్రస్తుతం 22,527 ఉండగా… దీన్ని 25,906కు స్టైపండ్ పెంచారు. పీజీ ఫస్టియర్‌ విద్యార్థులకు 50,385 నుంచి 58,289 పెరగగా.. సెకండియర్‌ విద్యార్థులకు 53,503 నుంచి 61,528, థర్డ్‌ ఇయర్‌ విద్యార్థులకు 56,319 నుంచి 64,767కి స్టైపెండ్‌ పెరగనుంది.

ప్రస్తుత , పెరిగే స్టైఫండ్ వివరాలు

హౌస్ సర్జన్ మెడికల్ - 22, 527 - 25, 906

పీజీ డిగ్రీ -1st year - 50,686 - 58,289

పీజీ డిగ్రీ – 2nd year - 53,503 - 61,528

పీజీ డిగ్రీ – 3rd year- 56,319 - 64,767

PG డిప్లోమా – 1st year- 50686 - 58,289

PG డిప్లోమా – 2nd year: 53,503 - 61,528

సూపర్ స్పెషాలిటీ – 1st year: 80,500 - 92,575

సూపర్ స్పెషాలిటీ– 2nd year: 84,525 - 97,204

సూపర్ స్పెషాలిటీ- 3rd year: - 88,547 - 1,01,829

ఎండీఎస్- 1st year: - 50,686 - 58,289

ఎండీఎస్ – 2nd year: - 53,503 - 61,528

ఎండీఎస్ – 3rd year: - 56,319 - 64,767

సీనియర్ రెసిడెంట్స్: - 80,500 - 92,575

వైద్య విద్యార్థులకు స్టైపెండ్ పెంచుతామని గతంలోనే నిర్ణయం తీసుకున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఈ మేరకు ఆర్థిక శాఖ అనుమతితో వైద్యారోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులను మంత్రి హరీశ్ రావు తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై వైద్య విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి హరీశ్‌రావుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.

IPL_Entry_Point