TS EdCET 2024: తెలంగాణ ఎడ్‌ సెట్‌ 2024 దరఖాస్తు గడువు పొడిగింపు, లేట్‌ ఫీ లేకుండా మే 10వరకు ఛాన్స్‌-telangana ed cet 2024 application deadline extension chance till may 10 without late fee ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ts Edcet 2024: తెలంగాణ ఎడ్‌ సెట్‌ 2024 దరఖాస్తు గడువు పొడిగింపు, లేట్‌ ఫీ లేకుండా మే 10వరకు ఛాన్స్‌

TS EdCET 2024: తెలంగాణ ఎడ్‌ సెట్‌ 2024 దరఖాస్తు గడువు పొడిగింపు, లేట్‌ ఫీ లేకుండా మే 10వరకు ఛాన్స్‌

Sarath chandra.B HT Telugu
May 08, 2024 07:56 AM IST

TS EdCET 2024: తెలంగాణ ఎడ్‌ సెట్‌ 2024 దరఖాస్తుల స్వీకరణ గడువును పొడిగించారు. మే 6వ తేదీతో దరఖాస్తుల గడువు ముగియగా మే 10వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించారు.

తెలంగాణ ఎడ్‌ సెట్‌ 2024 దరఖాస్తుల గడువు పొడిగింపు
తెలంగాణ ఎడ్‌ సెట్‌ 2024 దరఖాస్తుల గడువు పొడిగింపు

TS EdCET 2024: తెలంగాణ ఎడ్‌సెట్‌ 2024 దరఖాస్తుల స్వీకరణ గడువును పొడిగించారు. టిఎస్‌ ఎడ్‌సెట్‌ 2024 ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తు చేసుకోడానికి మే 10వ తేదీ వరకు గడువు పొడిగించినట్టు సెట్ కన్వీనర్‌ ప్రకటించారు.

yearly horoscope entry point

అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. https://edcet.tsche.ac.in వెబ్‌ సైట్‌ ద్వారా బిఇడి ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవచ్చని కన్వీనర్ తెలిపారు. రూ.250 ఆలస్య రుసుముతో మే 13వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

తెలంగాణ ఎడ్ సెట్ - 2024 దరఖాస్తుల ప్రక్రియ గత మార్చి నెలలో ప్రారంభమైంది. అర్హులైన అభ్యర్థులు https://edcet.tsche.ac.in/ లింక్ తో ప్రాసెస్ పూర్తి చేసుకోవచ్చు.

బీఈడీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి తెలంగాణ ఉన్నత విద్యా మండలి ప్రతి ఏడాది నిర్వహించే ఎడ్ సెట్ ప్రవేశ పరీక్షకు కీలక అప్డేట్ ఇచ్చారు. దరఖాస్తుల గడువు ఇప్పటికే ముగియగా విద్యార్ధుల సౌకర్యార్ధం మే 10వరకు పొడిగించారు.

ఇప్పటి వరకు బిఇడి కోర్సులో ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకోని వారు ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. మే 10వ తేదీ వరకు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది.

ఆలస్య రుసుముతో మే 13వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. మే 23వ తేదీన బిఇడి ప్రవేశ పరీక్ష ఉంటుంది. రెండు షిఫ్టులలో పరీక్ష నిర్వహిస్తుండగా…తొలి సెషన్ ఉదయం 10 నుంచి 12 గంటల మధ్య ఉంటుంది. రెండో సెషన్ పరీక్ష మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు నిర్వహిస్తారు.

TS EdCET 2024: ఎలా దరఖాస్తు చేసుకోవాలి

అర్హులైన అభ్యర్థులు మొదటగా తెలంగాణ ఎడ్ సెట్ అధికారిక పోర్టల్ https://edcet.tsche.ac.in/ లోకి వెళ్లాలి.

Application Fee Payment పై నొక్కి దరఖాస్తు ఫీజును చెల్లించాలి.

ఆ తర్వాత Fill Application Form అనే ఆప్షన్ పై క్లిక్ చేసి మీ వివరాలను ఎంట్రీ చేయాలి. ఇందులో Payment Reference ID , Qualifying Examination Hall Ticket No , Mobile Numberతో పాటు పుట్టిన తేదీ వివరాలను ఇవ్వాలి. ఆ తర్వాత proceed to fill application పై క్లిక్ చేసి దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయవచ్చు.

Print Your Filled in Application Form అనే ఆప్షన్ పై నొక్కి మీ రిజిస్ట్రేషన్ ఫారమ్ ను డౌన్లోడ్ లేదా ప్రింట్ తీసుకోవచ్చు.

అప్లికేషన్ నెంబర్ ను జాగ్రత్తగా ఉంచుకోవాలి. హాల్ టికెట్ల జారీతో పాటు ప్రవేశాల సమయంలో ఉపయోగపడుతుంది.

బిఇడి కోర్సుల ప్రవేశ పరీక్షకు దరఖాస్తుల రుసుముగా ఓబీసీ అభ్యర్థులు రూ.750 చెల్లించాలి. ఎస్సీ, ఎస్సీ, దివ్యాంగ అభ్యర్థులు రూ. 550 చెల్లించాల్సి ఉంటుంది.

ఎడ్ సెట్ కు దరఖాస్తు చేసుకునే అభ్యర్థికి తప్పనిసరిగా జులై 1, 2024 నాటికి 19 సంవత్సరాల వయస్సు ఉండాలి.అభ్యర్థికి గరిష్ట వయో పరిమితి లేదు.

ముఖ్యమైన తేదీలు ఇవే…

ఎడ్ సెట్ దరఖాస్తుల స్వీకరణ - మార్చి 6,2024.

దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ - మే 10,2024.

లేట్ ఫీజుతో దరఖాస్తుల స్వీకరణ - మే 13,2024.

ఎడ్ సెట్ ప్రవేశ పరీక్ష - మే 23, 2024.

అధికారిక వెబ్ సైట్ - https://edcet.tsche.ac.in/

ప్రవేశపరీక్షలో మొత్తం 150 ప్రశ్నలు ఇస్తారు. ఆఫ్‌లైన్‌లో పరీక్ష నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మళ్లీ మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 వరకు పేపర్‌ను నిర్వహిస్తారు.

మూడు విభాగాలుగా ప్రశ్నలు ఉంటాయి. పార్ట్ ఎలో ఇంగ్లిష్, పార్ట్ బిలో టీచింగ్ ఆప్టిట్యూడ్, పార్ట్ సిలో మెథడాలజీపై ప్రశ్నలు అడుగుతారు. అభ్యర్థులు పార్ట్ సి కోసం ఒక సబ్జెక్టును ఎంచుకోవాల్సి ఉంటుంది. ప్రవేశ పరీక్ష ద్వారా… రెండేళ్ల బీఈడీ, స్పెషల్ ఎడ్యుకేషన్‌ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ప్రవేశ పరీక్షను కంప్యూటర్ బేస్డ్‌ టెస్ట్ ద్వారా నిర్వహిస్తారు.

Whats_app_banner