TS ECET Counselling 2024 : జూన్ 8 నుంచి తెలంగాణ ఈసెట్ కౌన్సెలింగ్ ప్రారంభం - పూర్తి షెడ్యూల్ ఇదే
TS ECET Counselling 2024 Updates : తెలంగాణ ఈసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ ఖరారైంది. జూన్ 8వ తేదీ నుంచి ప్రక్రియ ప్రారంభం కానుంది.

TS ECET Counselling 2024 Dates : తెలంగాణ ఈసెట్ - 2024 కౌన్సెలింగ్ షెడ్యూల్ వచ్చేసింది. ఇందుకు సంబంధించిన వివరాలను శుక్రవారం ఉన్నత విద్యాశాఖ ప్రకటించింది. కౌన్సెలింగ్ ప్రక్రియ జూన్ 8వ తేదీ నుంచి ప్రారంభం కానుంది.
ఈ ఏడాది ప్రవేశాల కోసం మొత్తం రెండు దశల్లో కౌన్సెలింగ్ ప్రక్రియను చేపట్టనున్నారు. ఫస్ట్ ఫేజ్ ప్రక్రియ జూన్ 8వ తేదీ నుంచి ప్రారంభం అవుతుంది. 11 వ తేదీ వరకు అభ్యర్థులు స్లాట్ బుకింగ్ చేసుకునే అవకాశం ఉంటుంది.
తొలి విడతలో స్లాట్ బుక్ చేసుకున్న విద్యార్థులకు జూన్ 10వ తేదీ నుంచి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. జూన్ 12వ తేదీతో ఈ ప్రక్రియ ముగుస్తుంది. జూన్ 10వ తేదీ నుంచి 14వ తేదీ వరకు వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశం ఉంటుంది. జూన్ 18వ తేదీన ఫస్ట్ ఫేజ్ సీట్ల కేటాయింపు ఉంటుంది.
జూలై 15 నుంచి తుది విడత కౌన్సెలింగ్….
జూలై 15వ తేదీ నుంచి ఫైనల్ ఫేజ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ ప్రక్రియ షురూ అవుతుంది. జూలై 17వ తేదీ వరకు స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. జులై 17వ తేదీన సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహిస్తారు.
జూలై 17వ తేదీ నుంచి 18 వరకు విద్యార్థులు వెబ్ ఆప్షన్లు ఎంచుకోవచ్చు. జూలై 21వ తేదీన తుది విడత సీట్లను కేటాయిస్తారు. జూలై 21 నుంచి 23 మధ్యన విద్యార్థులు రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. జూలై 24వ తేదీ నుంచి 30వ తేదీ వరకు స్పాట్ ఆడ్మిషన్ల ప్రక్రియ ఉంటుంది.
తెలంగాణ ఈసెట్ - 2024 ఫలితాలు ఇటీవలే విడుదలయ్యాయి. బీటెక్ కోర్సుల్లో లేటరల్ ఎంట్రీ ప్రవేశాల కోసం తెలంగాణ ఈసెట్ - 2024 ప్రవేశ పరీక్షను నిర్వహించారు. మే 6న రాష్ట్రవ్యాప్తంగా ఈసెట్ ఎగ్జామ్స్ జరిగాయి. ఈ పరీక్ష ఫలితాల్లో వచ్చిన ర్యాంకుల ఆధారంగా పాలిటెక్నిక్ డిప్లొమా, బీఎస్సీ (మ్యాథ్స్) విద్యార్థులకు బీటెక్, బీఫార్మసీ లేటరల్ ఎంట్రీ రెండో ఏడాదిలో ప్రవేశాలు కల్పిస్తారు. ఈ ఏడాది ఈసెట్ పరీక్షను ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహించింది.
95.86 శాతం ఉత్తీర్ణత
ఈ ఏడాది మొత్తం 23,330 మంది ఈసెట్ రాయగా, వీరిలో 22,365 మంది అర్హత సాధించారు. ఈ ఏడాది ఈసెట్ లో 95.86 శాతం ఉత్తీర్ణత నమోదైంది. బీఎస్సీ మాథ్స్ లో పెద్దపల్లికి చెందిన యాదగిరి ఈసెట్ ఫస్ట్ ర్యాంక్ సాధించాడు. మీర్ ఐజాజ్ అలీ రెండో ర్యాంక్ సాధించగా, కెమికల్ ఇంజినీరింగ్ లో ఏపీలోని విశాఖకు చెందిన బంక మనోహర్ ఫస్ట్ ర్యాంక్ సాధించాడు.
టీఎస్ ఈసెట్ ఫలితాలను ఇలా చెక్ చేసుకోవచ్చు
- Step 1 : తెలంగాణ ఈసెట్-2024 ఫలితాల కోసం విద్యార్థులు అధికారిక వెబ్ సైట్ https://ecet.tsche.ac.in/ పై క్లిక్ చేయాలి.
- Step 2 : హోమ్ పేజీలో కనిపించే ' Download Rank Card' పై క్లిక్ చేయాలి.
- Step 3 : హాల్ టికెట్, రిజిస్ట్రేషన్ నెం, పుట్టిన తేదీ వివరాలు చేసి 'View Rank Card' మీద క్లిక్ చేయాలి.
- Step 4 : టీఎస్ ఈసెట్ 2024 ఫలితాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి
- Step 5 : విద్యార్థులు ప్రింట్ ఆప్షన్ పై నొక్కి మీ ర్యాంక్ కార్డును పొందవచ్చు.