TG EAPCET 2025 : తెలంగాణ ఈఏపీసెట్-2025 షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 20న నోటిఫికేషన్ విడుదల కానుంది. ఫిబ్రవరి 22 నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. మే 2 నుంచి 5వ తేదీ వరకు ఇంజినీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్, ఏప్రిల్ 29, 30 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మా పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ ఏడాది ఈఏపీసెట్ ను జేఎన్టీయూహెచ్ నిర్వహిస్తుంది.
ఈసారి గతానికి భిన్నంగా ఈఏపీసెట్ అగ్రికల్చర్‌తో ఉన్నత విద్యా ప్రవేశ పరీక్షలు నిర్వహించనున్నారు. ఏప్రిల్ 29, 30 తేదీల్లో ఎప్‌సెట్ అగ్రికల్చర్, ఫార్మా పరీక్షలు, మే 2 నుంచి 5వ తేదీ వరకు నాలుగు రోజులపాటు ఇంజినీరింగ్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఇటీవల ఉన్నత విద్యామండలి రాష్ట్రంలో నిర్వహించే మొత్తం ఏడు ప్రవేశ పరీక్షల తేదీలను ప్రకటించింది.
మొత్తం ఏడు ప్రవేశ పరీక్షల్లో ఐదు జూన్ నెలలో నిర్వహించనున్నారు. జూన్ 19వ తేదీతో ఎంట్రన్స్ పరీక్షలు ముగియనున్నాయి. ఇంటర్ పరీక్షలు ముగిసిన తర్వాత ఈఏపీసెట్ అగ్రికల్చర్ విద్యార్థులకు 39 రోజులు, ఇంజినీరింగ్ విద్యార్థులకు 42 రోజుల వ్యవధి ఉంటుంది.
తెలంగాణ పీజీఈసెట్-2025 షెడ్యూల్ ను ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. మార్చి 12న నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు ప్రకటించింది. మార్చి 17 నుంచి 19 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. జూన్ 16 నుంచి 19 వరకు పీజీఈసెట్ పరీక్షలు నిర్వహించనున్నారు.
ప్రవేశ పరీక్షల హాల్ టికెట్లను పరీక్షలకు వారం రోజు ముందు విడుదల చేయనున్నారు. త్వరలోనే ఎంట్రన్స్ పరీక్షల వెబ్ సైట్ లు అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఉన్నత విద్యామండలి తెలిపింది.