TS EAMCET Results 2023 : ఇంకాస్త ముందుగానే టీఎస్ ఎంసెట్ ఫలితాలు, ఉదయం 9.30 గంటలకే విడుదల-telangana eamcet results 2023 released may 25th thursday onwards results available ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Telangana Eamcet Results 2023 Released May 25th Thursday Onwards Results Available

TS EAMCET Results 2023 : ఇంకాస్త ముందుగానే టీఎస్ ఎంసెట్ ఫలితాలు, ఉదయం 9.30 గంటలకే విడుదల

Bandaru Satyaprasad HT Telugu
May 24, 2023 04:56 PM IST

TS EAMCET Results 2023 : తెలంగాణ ఎంసెట్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్, మెడిసన్ ఫలితాలను రేపు ఉదయం 9.30 గంటలకే విడుదల చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు.

తెలంగాణ ఎంసెట్ ఫలితాలు
తెలంగాణ ఎంసెట్ ఫలితాలు (Unsplash)

TS EAMCET Results 2023 : తెలంగాణ ఎంసెట్ ఫలితాలు ఇంకాస్త ముందుగానే రానున్నాయి. రేపు(మే 25) ఉదయం 9.30 గంటలకు తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల కానున్నాయి. సీఎం కేసీఆర్ కలెక్టర్ల కాన్ఫరెన్స్ కారణంగా ఫలితాల సమయంలో మార్పు చేసినట్లు ఎంసెట్ కన్వీనర్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ముందుగా రేపు 11 గంటలకు ఎంసెట్ ఫలితాలు విడుదల చేయాలని నిర్ణయించినా, సీఎం కాన్ఫరెన్స్ కారణంగా గురువారం ఉదయం 9.30 గంటలకే మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఎంసెట్ ఫలితాలు విడుదల చేయనున్నారు.

ట్రెండింగ్ వార్తలు

రేపు ఉదయం 9.30 గంటలకే

ఈ నెల 25న తెలంగాణ ఎంసెట్‌ ఫలితాలు విడుదల కానున్నాయి. 25న ఉదయం 9.30 గంటలకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ప్రభుత్వ కార్యదర్శి (ఉన్నత విద్య) వి.కరుణ, కళాశాల, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ నవీన్‌ మిత్తల్‌, తెలంగాణ ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ఆచార్య ఆర్‌.లింబాద్రి, జేఎన్‌టీయూ హైదరాబాద్‌ వీసీ ప్రొఫెసర్‌ కట్టా నరసింహారెడ్డి తదితరులు ఈ ఫలితాలను విడుదల చేయనున్నారు. జేఎన్‌టీయూ హైదరాబాద్‌లోని గోల్డెన్‌ జూబ్లీ హాలులో ఈ ఫలితాలను విడుదల చేయనున్నారు.

ఈ లింక్స్ నేరుగా మీ ఫలితాలు తెలుసుకోవచ్చు.

https://telugu.hindustantimes.com/telangana/results

https://eamcet.tsche.ac.in/

తెలంగాణ ఎంసెట్ ఫలితాలను ఇలా చెక్ చేసుకోండి

Step 1 : ముందుగా అభ్యర్థులు //https://eamcet.tsche.ac.in/ వెబ్ సైట్ ను ఓపెన్ చేయండి

Step 2 : హోం పేజీలో టీఎస్ ఈసెట్ రిజల్ట్స్ 2022 సంబంధించిన లింక్ ఉంటుంది. ఆ లింక్ పై క్లిక్ చేయాలి.

Step 3 : అప్పుడు కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. ఆ పేజీలో అభ్యర్థులు హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీ వివరాలు నమోదు చేసి సబ్మిట్ పై క్లిక్ చేయండి

Step 4 : మీ రిజల్ట్ స్క్రీన్ పై డిస్ ప్లే అవుతుంది. ఫలితాల కాపీని డౌన్లోడ్ చేసి ప్రింట్ తీసుకోని భవిష్యత్ అవసరాల కోసం భద్రపరుచుకోండి.

ఈ ఏడాది తెలంగాణ ఎంసెట్(EAMCET) పరీక్షలకు మొత్తం 94.11 శాతం విద్యార్థులు హాజరయ్యారు. మొత్తం 3,20,683 దరఖాస్తులు రాగా, వీటిలో 3,01,789 మంది విద్యార్థలు పరీక్షలు రాశారు. వీరిలో తెలంగాణ నుంచి 2,48,279 మంది దరఖాస్తు చేసుకోగా 2,35,918 మంది మాత్రమే పరీక్షకు హాజరయ్యారు. ఏపీ నుంచి 72,204 మంది దరఖాస్తు చేసుకోగా... వీరిలో 65,871 మంది మాత్రమే పరీక్షలు రాశారు. ఇంజినీరింగ్, అగ్రికల్చర్, మెడికల్ స్ట్రీమ్ అభ్యర్థుల రెస్పాన్స్ షీట్లు ఇప్పటికే వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచారు.

WhatsApp channel