TS EAMCET Results: తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల - సత్తా చాటిన ఏపీ విద్యార్థులు-telangana eamcet results 2023 released candidates can check their results follow links ,తెలంగాణ న్యూస్
Telugu News  /  Telangana  /  Telangana Eamcet Results 2023 Released Candidates Can Check Their Results Follow Links

TS EAMCET Results: తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల - సత్తా చాటిన ఏపీ విద్యార్థులు

తెలంగాణ ఎంసెట్ ఫలితాలు - 2023
తెలంగాణ ఎంసెట్ ఫలితాలు - 2023

TS EAMCET Results 2023 Latest Updates: తెలంగాణ ఎంసెట్- 2023 ఫలితాలు వచ్చేశాయ్. ఇవాళ ఉదయం 9.50 గంటలకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి రిజల్ట్స్ ను ప్రకటించారు. https://telugu.hindustantimes.com/telangana/results వెబ్ సైట్ లో రిజల్ట్స్ ను చెక్ చేసుకోవచ్చు.

Telangana EAMCET Results 2023: లక్షలాది మంది విద్యార్థుల ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. గురువారం ఉదయం 9.50 గంటలకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి రిజల్ట్స్ ను ప్రకటించారు. ఈసారి ఇంజినీరింగ్ విభాగంలో మొత్తం 80 శాతం, అగ్రికల్చర్ విభాగంలో 86 శాతం మంది విద్యార్థులు అర్హత సాధించినట్లు మంత్రి వెల్లడించారు. ఇంజినీరింగ్ విభాగంలో బాలికలు - 82 శాతం మంది, బాలురు - 79 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఇక అగ్రికల్చర్ విభాగంలో చూస్తే బాలికలు - 87 శాతం, బాలురు - 84 శాతం మంది పాస్ అయ్యారని వెల్లడించారు. జూన్ లో కౌన్సెలింగ్ నిర్వహిస్తామని పేర్కొన్నారు. స్థానికత కలిగిన అభ్యర్థులకు 85 శాతం సీట్లను కేటాయించనున్నట్లు తెలిపారు. ఈ రిజల్ట్స్ ను హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ద్వారా సింపుల్ గా తెలుసుకోవచ్చు.

ట్రెండింగ్ వార్తలు

HT తెలుగులో ఇలా చెక్ చేసుకోండి..

  • విద్యార్థులు ముందుగా హిందుస్తాన్ టైమ్స్ తెలుగు వెబ్‌సైట్ https://telugu.hindustantimes.com/telangana/results లోకి వెళ్లాలి.
  • హాల్ టికెట్ నంబర్ నమోదు చేసి సబ్మిట్ పై క్లిక్ చేయాలి.
  • సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయగానే.. మీ ర్యాంక్ డిస్ ప్లే అవుతుంది.
  • ప్రింట్ లేదా డ్లౌనోడ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి రిజల్ట్స్ కాపీని పొందవచ్చు.
  • అడ్మిషన్ ప్రక్రియలో ర్యాంక్ కార్డు చాలా కీలకం.

ఎంసెట్ వెబ్ సైట్ లో ఇలా…

Step 1 : ముందుగా అభ్యర్థులు //https://eamcet.tsche.ac.in వెబ్ సైట్ ను ఓపెన్ చేయండి.

Step 2 : హోం పేజీలో ఎంసెట్ రిజల్ట్స్ 2023 సంబంధించిన లింక్ ఉంటుంది. ఆ లింక్ పై క్లిక్ చేయాలి.

Step 3 : అప్పుడు కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. ఆ పేజీలో అభ్యర్థులు హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీ వివరాలు నమోదు చేసి సబ్మిట్ పై క్లిక్ చేయండి.

Step 4 : మీ రిజల్ట్ స్క్రీన్ పై డిస్ ప్లే అవుతుంది. ఫలితాల కాపీని డౌన్లోడ్ చేసి ప్రింట్ తీసుకోని భవిష్యత్ అవసరాల కోసం భద్రపరుచుకోండి.

సత్తా చాటిన ఏపీ స్టూడెంట్స్.. టాప్ ప్లేస్ వారిదే

తెలంగాణ ఎంసెట్ - 2023 ఫలితాల్లో ఆంధ్రప్రదేశ్ కు చెందిన విద్యార్థులు సత్తా చాటారు. ఇంజినీరింగ్‌ విభాగంలో చూస్తే విశాఖపట్నానికి చెందిన అనిరుధ్‌కు మొదటి ర్యాంకు.. గుంటూరుకు చెందిన వెంకట మణిందర్‌రెడ్డికి రెండో ర్యాంకు దక్కింది. కృష్ణా జిల్లాకు చెందిన ఉమేశ్ కు మూడో ర్యాంక్ వచ్చింది. ఫలితంగా తొలి మూడు ర్యాంకులు ఏపీ విద్యార్థులకే వచ్చినట్లు అయింది. ఇక హైదరాబాద్ కు చెందిన అభినిత్ కి -4, అనంతపురానికి చెందిన ప్రమోద్ కుమార్ రెడ్డి - 5, విశాఖపట్నానికి చెందిన ధీరజ్ కుమార్ -6, నల్గొండ జిల్లాకు చెందిన శన్వితా రెడ్డి -7, శ్రీకాకుళం జిల్లాకు చెందిన సంజనకు 8వ ర్యాంక్ దక్కింది.

ఇక అగ్రికల్చర్ విభాగంలో చూస్తే…. ఆంధ్రప్రదేశ్ లోని తూర్పుగోదావరికి చెందిన జశ్వంత్ కు మొదటి ర్యాంక్, ప్రకాశం జిల్లాకు చెందిన వెంకటతేజకి రెండో ర్యాంక్, రంగారెడ్డి జిల్లాకు చెందిన లక్ష్మి పసుపులాటికి మూడో ర్యాంక్ రాగా.. గుంటూరుకు చెందిన కార్తికేయ రెడ్డికి నాల్గొ ర్యాంక్ దక్కింది. ఐదో ర్యాంక్ సాధించిన వరుణ చక్రవర్తి శ్రీకాకుళం జిల్లాకు చెందగా.. రంగారెడ్డి జిల్లాకు చెందిన శశిధర్ రెడ్డి ఆరో ర్యాంక్ సాధించారు.

ఇంజినీరింగ్‌ టాపర్లు ..

1. అనిరుధ్‌ (విశాఖపట్నం)

2. వెంకట మణిందర్‌ రెడ్డి (గుంటూరు జిల్లా)

3. ఉమేశ్‌ వరుణ్‌ (కృష్ణా)

4. అభినీత్‌ (హైదరాబాద్)

5. ప్రమోద్‌కుమార్‌రెడ్డి (అనంతపురం జిల్లా)

అగ్రికల్చర్‌ టాపర్లు..

1. సత్యరాజ జశ్వంత్‌ (తూర్పుగోదావరి జిల్లా)

2. నశిక వెంకటతేజ (ప్రకాశం జిల్లా)

3. సఫల్ లక్ష్మి (రంగారెడ్డి)

4. కార్తికేయరెడ్డి (గుంటూరు జిల్లా)

5. వరుణ్‌ చక్రవర్తి (శ్రీకాకుళం జిల్లా)

ఇక ఈ ఏడాది నిర్వహించిన తెలంగాణ ఎంసెట్(Telangana EAMCET) పరీక్షలకు మొత్తం 94.11 శాతం విద్యార్థులు హాజరయ్యారు. మొత్తం 3,20,683 దరఖాస్తులు రాగా, వీటిలో 3,01,789 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. వీరిలో తెలంగాణ నుంచి 2,48,279 మంది దరఖాస్తు చేసుకోగా 2,35,918 మంది మాత్రమే పరీక్షకు హాజరయ్యారు.

ఏపీ నుంచి 72,204 మంది దరఖాస్తు చేసుకోగా... వీరిలో 65,871 మంది మాత్రమే పరీక్షలు రాశారు. ఎంసెట్ ఫలితాల ఆధారంగా ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఇక బైపీసీ విద్యార్థులకు అగ్రికల్చర్, ఫార్మసీలో ప్రవేశాలు ఇస్తారు. కౌన్సెలింగ్ కు సంబంధించి త్వరలోనే తేదీలను విడుదల చేయనున్నారు. ఇక ఈసారి ఇంటర్ వేయిటేజీని రద్దు చేసిన సంగతి తెలిసిందే.

సంబంధిత కథనం