TG DSC Schedule : తెలంగాణ డీఎస్సీ పరీక్షల షెడ్యూల్ విడుదల, జులై 18 నుంచి ఆగస్టు 5 వరకు ఎగ్జామ్స్-telangana dsc exam schedule released july 18 to august 5 exam conducted in shifts ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tg Dsc Schedule : తెలంగాణ డీఎస్సీ పరీక్షల షెడ్యూల్ విడుదల, జులై 18 నుంచి ఆగస్టు 5 వరకు ఎగ్జామ్స్

TG DSC Schedule : తెలంగాణ డీఎస్సీ పరీక్షల షెడ్యూల్ విడుదల, జులై 18 నుంచి ఆగస్టు 5 వరకు ఎగ్జామ్స్

Bandaru Satyaprasad HT Telugu
Updated Jun 28, 2024 11:06 PM IST

TG DSC Schedule : తెలంగాణ డీఎస్సీ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. జులై 18 నుంచి ఆగస్టు 5 వరకు రోజుకు రెండు షిప్టుల్లో డీఎస్సీ పరీక్షలు నిర్వహించనున్నారు.

తెలంగాణ డీఎస్సీ పరీక్షల షెడ్యూల్ విడుదల, జులై 18 నుంచి ఆగస్టు 5 వరకు ఎగ్జామ్స్
తెలంగాణ డీఎస్సీ పరీక్షల షెడ్యూల్ విడుదల, జులై 18 నుంచి ఆగస్టు 5 వరకు ఎగ్జామ్స్

TG DSC Schedule : తెలంగాణ డీఎస్సీ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. జులై 18 నుంచి ఆగస్టు 5 వరకు డీఎస్సీ పరీక్షలు నిర్వహించనున్నారు. రోజుకు రెండు షిఫ్టు్ల్లో సీబీఆర్టీ విధానంలో పరీక్షలు నిర్వహించనున్నారు. మొత్తం 11,062 పోస్టులకు డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల కాగా 2,79,966 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.

డీఎస్సీ షెడ్యూల్ ఇదే

తెలంగాణలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నిర్వహించనున్న డీఎస్సీ (TG DSC 2024) పరీక్షకు అధికారులు పూర్తి షెడ్యూల్‌ విడుదల చేశారు. జులై 18 నుంచి ఆగస్టు 5వరకు డీఎస్సీ పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. జులై 18న మొదటి షిఫ్ట్‌ లో స్కూల్‌ అసిస్టెంట్‌ ఫిజికల్‌ సైన్స్‌, సెకండ్‌ షిఫ్ట్‌లో ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్‌ పరీక్షను నిర్వహిస్తారు. జులై 19 నుంచి 22వ తేదీ వరకు వివిధ మాధ్యమాల ఎస్జీటీ పరీక్షలు నిర్వహిస్తారు. జులై 20న ఎస్‌జీటీ, సెకండరీ గ్రేడ్ ఫిజికల్‌, స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ పరీక్షలు జరుగుతాయి. జులై 22న స్కూల్‌ అసిస్టెంట్‌ మ్యాథ్స్‌, జులై 24న స్కూల్‌ అసిస్టెంట్‌ బయలాజికల్‌ సైన్స్‌, జులై 26న తెలుగు భాషా పండిట్‌, సెకండరీ గ్రేడ్‌టీచర్‌ పరీక్ష నిర్వహిస్తారు. జులై 30న స్కూల్‌ అసిస్టెంట్‌ సోషల్‌ స్టడీస్‌ ఎగ్జామ్ నిర్వహిస్తారు.

భారీగా అప్లికేషన్లు

తెలంగాణ డీఎస్సీ 2024 అప్లికేషన్ల ప్రక్రియ పూర్తైంది. అభ్యర్థుల నుంచి భారీగా దరఖాస్తులు వచ్చాయి. ఈసారి మొత్తం 2,79,956 దరఖాస్తులు వచ్చాయి. జులై 18వ తేదీ నుంచి డీఎస్సీ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. గతంతో పోల్చితే దరఖాస్తులకు అదనంగా మరో లక్షమంది కొత్త అప్లికేషన్లు వచ్చాయి. మొత్తం 11,062 ఉద్యోగాల్లో….2,629 స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులు ఉన్నాయి. భాషా పండితులు 727, పీఈటీలు 182, ఎస్జీటీలు 6,508, ప్రత్యేక కేటగిరీలో స్కూల్‌ అసిస్టెంట్లు 220, ఎస్జీటీ (స్పెషల్‌ ఎడ్యుకేషన్‌) 796 ఉద్యోగాలు ఉన్నాయి.

పరీక్ష విధానం

డీఎస్సీ 2024(TS DSC Exam 2024) ఉద్యోగాల భర్తీని కంప్యూటర్ ఆధారిత రిక్రూట్‌మెంట్ టెస్ట్ (CBRT) కింది ఆన్‌లైన్లో నిర్వహిస్తారు. మొత్తం 80 మార్కులకు పరీక్ష ఉంటుంది. 160 ప్రశ్నలు ఉంటాయి. రెండు గంటల 30 నిమిషాల సమయం ఉంటుంది. డీఎస్సీ పరీక్షలో జనరల్ నాల్డెజ్, టీచింగ్ తో పాటు సబ్జెక్టు నుంచి ప్రశ్నలు ఉంటాయి. మిగతా 20 మార్కులకు టెట్(TS TET ) వెయిటేజ్ ఉంటుంది. రాతపరీక్ష తర్వాత టెట్ వెయిటీజీని కలిపి తుది జాబితాను ప్రకటిస్తారు.

Whats_app_banner

సంబంధిత కథనం