TG DOST 2024 Updates : డిగ్రీ విద్యార్థులకు అలర్ట్ - రేపటితో ముగియనున్న'దోస్త్' రిపోర్టింగ్ గడువు..!
Telangana Degree Admissions 2024 : డిగ్రీ ప్రవేశాలకు సంబంధించి తెలంగాణ ఉన్నత విద్యా మండలి కీలక అప్డేట్ ఇచ్చింది. సీట్ల పొందిన విద్యార్థులు రిపోర్టింగ్ చేసే జులై 18వ తేదీతో ముగియనుంది.
Telangana Degree Admissions 2024 : తెలంగాణలో డిగ్రీ ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతోంది. ఉన్నత విద్యా మండలి తాజాగా విడుదల చేసిన ప్రకటన ప్రకారం… జులై 18వ తేదీతో రిపోర్టింగ్ గడువు పూర్తి కానుంది. ఇంకా రిపోర్టింగ్ చేయని విద్యార్థులు రేపటిలోపు చేయాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు.
మూడు విడతల వారికి ఛాన్స్…!
దోస్త్ ద్వారా మూడు విడతల్లో సీట్లు పొంది రిపోర్టింగ్ చేయనివారు… జులై 18వ తేదీలోపు రిపోర్టింగ్ చేసుకోవచ్చని ఉన్నత విద్యా మండలి తెలిపింది. ఈ అవకాశాన్ని విద్యార్థులు ఉపయోగించుకోవాలని సూచించింది. రిపోర్టింగ్ చేయకపోతే సీటు రద్దు చేయనున్నారు.
మరోవైపు స్పాట్ అడ్మిషన్ల కోసం ఉన్నత విద్యామండలి త్వరలోనే మార్గదర్శకాలను విడుదల చేసే అవకాశం ఉంది. రేపటితో రిపోర్టింగ్ గడువు పూర్తి అయితే… ఎన్ని సీట్లు ఖాళీగా ఉన్నాయనే దానిపై క్లారిటీ రానుంది. ఈ మేరకు స్పాట్ అడ్మిషన్లకు సంబంధించి గైడ్ లైన్స్ ఖరారు కానున్నాయి.
దోస్త్ ద్వారా రాష్ట్రంలోని 1,066 డిగ్రీ కళాశాలల్లో మొత్తం 4,49,449 సీట్లు అందుబాటులో ఉన్నాయి. దోస్త్ ప్రక్రియ ద్వారా ఈ సీట్లన్నీ భర్తీ చేస్తున్నారు. ఇప్పటికే మూడు విడుతల్లో సీట్లను కేటాయించారు. అయితే చాలా మంది రిపోర్టింగ్ చేయకపోవటంతో జులై 18వ తేదీ వరకు గడువు పొడిగించారు. రేపటితో ఈ గడువు కూడా పూర్తి కానుంది.
ఏపీలో డిగ్రీ ప్రవేశాలు - గడువు పొడిగింపు
మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో 2024-25 విద్యా సంవత్సరానికి గానూ డిగ్రీ ప్రవేశాలకు కౌన్సిలింగ్ కొనసాగుతోంది. జూన్ 18 నుంచి ఈ ప్రక్రియ ప్రారంభం కాగా… తాజాగా షెడ్యూల్ గడువును అధికారులు పొడిగించారు.
ఏపీ ఉన్నత విద్యా మండలి తాజా నిర్ణయం ప్రకారం…. రిజిస్ట్రేషన్ కోసం జులై 20వ తేదీ వరకు అవకాశం కల్పించారు. అర్హత ఉన్న విద్యార్థులు ఈ తేదీలోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. మరోవైపు ప్రత్యేక కేటగిరీ ధ్రువపత్రాల పరిశీలన జులై 18 నుంచి 20 తేదీల్లో నిర్వహిస్తారు. జులై 23 నుంచి 26వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లను ఎంచుకోవచ్చు. జులై 31వ తేదీన సీట్ల కేటాయింపు ఉంటుంది.
రాష్ట్రంలోని అన్ని డిగ్రీ కాలేజీల్లో 3.19 లక్షల సీట్లు ఉండగా, గతేడాది 1.53 లక్షల సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. ఆన్‌లైన్ అడ్మిషన్ మాడ్యుల్ ఫర్ డిగ్రీ కాలేజెస్ (ఓఏఏండీసీ) ద్వారా ఈ ప్రవేశాలను ప్రక్రియ కొనసాగుతోంది. 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ అన్ఎయిడెడ్, అటానమస్ డిగ్రీ కాలేజీల్లో సాధారణ డిగ్రీ కోర్సుల్లో సీట్లను భర్తీ చేస్తున్నారు. మొత్తం మూడు దశల్లో ఈ ప్రక్రియను పూర్తి కానుంది.
అర్హత ఉన్న విద్యార్థులు https://oamdc-apsche.aptonline.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.ఇందుకోసం బీసీ విద్యార్థులు రూ. 300, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.200, జనరల్ కేటగిరీ (ఓసీ) విద్యార్థులు రూ.400 ప్రాసెసింగ్ ఫీజును చెల్లించాలి. ఆన్‌లైన్ లో దరఖాస్తు చేసే సమయంలో విద్యార్థులు తమ ఇంటర్మీడియట్ మార్కు షీట్, కుల ధృవీకరణ, ఇతర అవసరమైన పత్రాలు స్కాన్ చేసిన కాపీలను తప్పనిసరిగా అప్‌లోడ్ చేయాలి.
సంబంధిత కథనం