Telangana Govt Jobs : ఉద్యోగాల భర్తీకి దివ్యాంగుల సంక్షేమ శాఖ నోటిఫికేషన్ - దరఖాస్తులకు చివరి తేదీ ఎప్పుడంటే..?-telangana disabled welfare department issued recruitment notification for various posts 2024 ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Telangana Govt Jobs : ఉద్యోగాల భర్తీకి దివ్యాంగుల సంక్షేమ శాఖ నోటిఫికేషన్ - దరఖాస్తులకు చివరి తేదీ ఎప్పుడంటే..?

Telangana Govt Jobs : ఉద్యోగాల భర్తీకి దివ్యాంగుల సంక్షేమ శాఖ నోటిఫికేషన్ - దరఖాస్తులకు చివరి తేదీ ఎప్పుడంటే..?

Maheshwaram Mahendra Chary HT Telugu
Aug 17, 2024 01:36 PM IST

తెలంగాణలోని దివ్యాంగుల సంక్షేమ శాఖ నుంచి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఎంపికైన వారు హైదరాబాద్ లో పని చేయాల్సి ఉంటుంది. దరఖాస్తు ఫారమ్ ను https://www.wdsc.telangana.gov.in/ వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. మొత్తం ఆరు రకాల పోస్టులను భర్తీ చేయనున్నారు.

దివ్యాంగుల సంక్షేమ శాఖలో ఉద్యోగాలు
దివ్యాంగుల సంక్షేమ శాఖలో ఉద్యోగాలు

దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా మొత్తం ఆరు రకాల పోస్టులను రిక్రూట్ చేయనున్నారు. పోస్టును బట్టి జీతాన్ని నిర్ణయించారు. ఆగస్టు 14వ తేదీన నోటిఫికేషన్ విడుదలైంది. అయితే నోటిఫికేషన్ విడుదలైన తేదీ నుంచి పది రోజుల్లో అప్లికేషన్ ప్రాసెస్ ను పూర్తి చేయాల్సి ఉంటుందని అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.

మత్తు పదార్థాలకు బానిసలు అవుతున్న బాలలకు విముక్తి కల్పించేందుకు హైదరాబాద్ లోని సైదాబాద్‌ జువైనల్‌ హోంలో మత్తు విముక్తి కేంద్రం ఏర్పాటు చేశారు. ఈ సెంటర్ లో పని చేసేందుకు ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. అర్హత ఉన్న అభ్యర్థులు https://www.wdsc.telangana.gov.in/ వెబ్ సైట్ నుంచి దరఖాస్తు ఫారమ్ ను డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.

పూర్తి చేసిన దరఖాస్తు ఫారమ్ ను " డైరెక్టర్, దివ్యాంగుల సంక్షేమ శాఖ, మలక్‌పేట క్రాస్‌రోడ్డు, హైదరాబాద్‌, పిన్ నెంబర్ - 500036 చిరునామాకు పంపించాలి. ఏమైనా సందేహాలు ఉంటే 040-245590480 నంబరును సంప్రదించవచ్చు.

ముఖ్య వివరాలు :

  • ఉద్యోగ ప్రకటన శాఖ -దివ్యాంగుల సంక్షేమ శాఖ, తెలంగాణ ప్రభుత్వం.
  • మొత్తం ఖాళీలు - 07
  • MSc Psychologist -02
  • డాక్టర్ - 01
  • స్పెషల్ ఎడ్యుకేటర్ - 01
  • అటెండర్ - 01,
  • యోగా, ఆర్ట్స్, మ్యూజిక్, డ్యాన్స్ థెరఫిస్ట్స్ - 01
  • స్వీపర్ - 01
  • జీతం - రూ. 5 - 60 వేల మధ్య ఉంటుంది. పోస్టును బట్టి వేతనాన్ని నిర్ణయించారు.
  • వయసు - 21 -35 ఏళ్ల లోపు ఉండాలి.
  • నోటిఫికేషన్ విడుదల తేదీ - ఆగస్టు 14, 2024.
  • పది రోజుల్లో దరఖాస్తు ఫారమ్ ను పైన పేర్కొన్న చిరునామాకు పంపాలి.
  • అధికారిక వెబ్ సైట్ - https://www.wdsc.telangana.gov.in/

వరంగల్ జిల్లాలో జాబ్ మేళా….

ఈ నెల 20న (మంగళవారం) వివాహిత మహిళలకు జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఈ మేరకు వరంగల్ జిల్లా ఉపాధి కల్పనాధికారి ఉమారాణి వివరాలు వెల్లడించారు. వరంగల్ రిలయన్స్ నిప్పన్ లైఫ్ ఇన్సూరెన్స్ కో లిమిటెడ్ కంపెనీలో లైఫ్ ప్లానింగ్ ఆఫీసర్ ఉద్యోగాలు ఉన్నాయని ఉమారాణి వెల్లడించారు.

 మొత్తం 50 ఖాళీలు ఉండగా.. వరంగల్ నగరం ములుగు రోడ్డులోని ఐటీఐ ప్రాంగణంలో ఉద్యోగాల ఎంపీక ప్రక్రియ ఉంటుందని వివరించారు. డిగ్రీ పూర్తిచేసిన వారు ఈ ఉద్యోగానికి అర్హులని చెప్పారు. ఏమైనా సందేహాలు ఉంటే.. 95735 85532 నంబర్‌కు ఫోన్ చేసి నివృత్తి చేసుకొవాలని సూచించారు.

ఆసక్తి ఉన్న మహిళలు ఈ నెల 20న ములుగు రోడ్డులోని ఐటీఐ కాలేజీకి రావాలని ఉమారాణి సూచించారు. వచ్చేటప్పుడు తమ బయోడేటా, విద్యార్హత సర్టిఫికేట్లు తీసుకురావాలని సూచించారు. ఈ అవకాశాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.