మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లో కోల్డ్‌రిఫ్ దగ్గు సిరప్ తీసుకున్న కారణఁగా 11 మంది చిన్నారులను మరణించిన విషయం తెలిసిందే. దీనిపై తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్(డీసీఏ) అప్రమత్తమైంది. కిడ్నీ వైఫల్యానికి కారణమయ్యే డైథిలిన్ గ్లైకాల్ కలుషితం ఉన్న SR-13 బ్యాచ్ సిరప్‌ను ఉపయోగించకూడదని హెచ్చరించింది.
కోల్డ్‌రిఫ్ సిరప్ (బ్యాచ్ నం. SR-13) వాడకాన్ని ప్రజలు ఆపేయాలని డీసీఏ నోటీసు ఇచ్చింది. తమిళనాడులోని కాంచీపురం జిల్లాలో శ్రేసన్ ఫార్మా తయారు చేసిన ఈ సిరప్‌లో తీవ్రమైన ఆరోగ్య సమస్యలు, మరణానికి కారణమయ్యే విషపూరిత రసాయనమైన డైథిలిన్ గ్లైకాల్ (DEG) కల్తీ ఉన్నట్లు డీసీఏ తెలిపింది.
ప్రజలు వెంటనే ఈ సిరప్ వాడకాన్ని నిలిపివేయాలని, ఏదైనా సిరప్ కలిగి ఉంటే స్థానిక డ్రగ్స్ కంట్రోల్ అధికారులకు నివేదించాలని సూచించింది. పౌరులు ఉదయం 10:30 నుండి సాయంత్రం 5:00 గంటల మధ్య అన్ని పని దినాలలో అందుబాటులో ఉన్న టోల్-ఫ్రీ నంబర్ 1800-599-6969 ద్వారా డీసీఏని కూడా సంప్రదించవచ్చు. సిరప్ గురించి సమాచారం ఇవ్వాలి.
తెలంగాణ డీసీఏ అధికారులు తమిళనాడు డీసీఏ అధికారులతో సమన్వయం చేసుకుని ప్రభావిత దగ్గు సిరప్ బ్యాచ్ పంపిణీని పర్యవేక్షిస్తున్నారు. అన్ని డ్రగ్స్ ఇన్‌స్పెక్టర్లు, అసిస్టెంట్ డైరెక్టర్లు రిటైలర్లు.. టోకు వ్యాపారులు, ఆసుపత్రులను ప్రస్తుత నిల్వలను అలాగే ఆపేయాలన్నారు అధికారులు. ఈ ప్రత్యేక బ్యాచ్‌కు చెందిన దగ్గు సిరప్‌లను వెంటనే సీజ్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రజాల భద్రత కోసం, ప్రమాదాన్ని నివారించడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటోందని డీసీఏ డైరెక్టర్ జనరల్ షానవాజ్ ఖాసిం పేర్కొన్నారు.
మధ్యప్రదేశ్‌లోని చింద్వారా ప్రాంతంలో ఈ దగ్గు మందుతో 15 రోజుల్లో 11 మంది చిన్నారులు మరణించారు. కిడ్నీలు దెబ్బతిని ప్రాణాలు కోల్పోయారు. దగ్గు సిరప్‌ను ఎక్కువగా సిఫారసు చేసిన డాక్టర్ ప్రవీణ్ సోనిని అరెస్టు చేశారు. విషపూరితమైన పదార్థాలను ఉపయోగించినందుకు.. సిరప్‌ను ఉత్పత్తి చేసిన తమిళనాడు ఫార్మాస్యూటికల్స్ కంపెనీపై కూడా కేసు నమోదు అయింది.
టాపిక్