TS CPGET Results : టీఎస్ సీపీగెట్ ఫలితాలు విడుదల, ఎంత మంది అర్హత సాధించారంటే?-telangana cpget 2023 results released entrance exam for pg seats in universities ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Telangana Cpget 2023 Results Released Entrance Exam For Pg Seats In Universities

TS CPGET Results : టీఎస్ సీపీగెట్ ఫలితాలు విడుదల, ఎంత మంది అర్హత సాధించారంటే?

Bandaru Satyaprasad HT Telugu
Aug 22, 2023 05:43 PM IST

TS CPGET Results : తెలంగాణలోని యూనివర్సిటీలు, జేఎన్టీయూహెచ్ లోని పీజీ సీట్ల భర్తీని నిర్వహించిన సీపీగెట్ పరీక్ష ఫలితాలు విడుదల అయ్యాయి.

తెలంగాణ సీపీగెట్ ఫలితాలు
తెలంగాణ సీపీగెట్ ఫలితాలు

TS CPGET Results : తెలంగాణ సీపీగెట్-2023 ఫలితాలు విడుదల అయ్యాయి. రాష్ట్రంలో విశ్వవిద్యాలయాలతోపాటు జేఎన్‌టీహెచ్‌లోని పీజీ సీట్ల భర్తీకి కామన్‌ పీజీ ప్రవేశ పరీక్ష (CPGET) నిర్వహించారు. సీపీగెట్ ఫలితాలను రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ఆర్‌ లింబాద్రి, ఓయూ వీసీ డీ.రవీందర్‌ విడుదల చేశారు. ఈ పరీక్షల్లో 93.42 శాతం మంది అభ్యర్థులు అర్హత సాధించారు. ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, పాలమూరు, మహాత్మాగాంధీ, శాతవాహన, తెలంగాణ మహిళా యూనివర్సిటీలతోపాటు హైదరాబాద్‌ జేఎన్‌టీయూలో పీజీ, ఇంటిగ్రేటెడ్‌ పీజీ, పీజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం కామన్ పీజీ ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహించారు. టీఎస్ CPGET -2023 అర్హత పరీక్షలను ఈ ఏడాది జూన్‌ 30 నుంచి జులై 10 వరకు నిర్వహించారు. ఈ పరీక్షకు మొత్తం 68,422 మంది అప్లై చేసుకున్నారు. వీరిలో 59,665 మంది పరీక్షలకు హాజరుకాగా... మొత్తం 55,739 మంది అర్హత సాధించారు. అభ్యర్థులు ఫలితాలను cpget.tsche.ac.in వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవచ్చు.

ట్రెండింగ్ వార్తలు

TS CPGET 2023 ఫలితాలను ఇలా చెక్ చేసుకోండి

Step 1: cpget.tsche.ac.in అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.

Step 2: డౌన్‌లోడ్ ర్యాంక్ కార్డ్ లింక్‌పై క్లిక్ చేయండి.

Step 3: ఫలితాల విండోలో హాల్ టికెట్ నంబర్, రిజిస్ట్రేషన్ నంబర్ పుట్టిన తేదీని టైప్ చేయండి.

Step 4: CPGET ర్యాంక్ కార్డ్ స్క్రీన్‌పై కనిపిస్తుంది.

ప్రతి విశ్వవిద్యాలయంలో స్థానిక అభ్యర్థులకు 85 శాతం సీట్లు, స్థానికేతర అభ్యర్థులకు 50 శాతం సీట్లు, ఎస్సీ కేటగిరీ అభ్యర్థులకు 15 శాతం, ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు ఆరు శాతం సీట్లు కేటాయిస్తారు. ఫలితాలను ఇతర వెబ్‌సైట్‌లు https://www.osmania.ac.in, http://www.ouadmissions.com తనిఖీ చేసుకోవచ్చు.

సీపీగెట్ లో అర్హత సాధించిన అభ్యర్థులకు తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (TSCHE) కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. ఫలితాల ప్రకటనకు ముందు, www.osmania.ac.in, www.ouadmissions.com వెబ్‌సైట్‌లలో అన్ని సబ్జెక్టులకు సంబంధించిన ప్రశ్న పత్రాలు, సమాధానాల కీలను విడుదల చేశారు. విద్యార్థులు ఏవైనా అభ్యంతరాలను సమర్పించడానికి సమయం ఇచ్చారు. కౌన్సెలింగ్ షెడ్యూల్ నిర్ణీత సమయంలో TSCHE వెబ్‌సైట్‌లో పోస్ట్ చేస్తామని అధికారులు తెలిపారు. అర్హత కలిగిన అభ్యర్థులు వెబ్ కౌన్సెలింగ్ కు హాజరు కావాల్సి ఉంటుంది. కౌన్సెలింగ్ సమయంలో ధృవీకరణ కోసం సర్టిఫికేట్‌లను అప్‌లోడ్ చేయాలి. ఈ వెబ్ ఆధారిత కౌన్సెలింగ్ విధానం ద్వారా ఎంపిక, అడ్మిషన్లు నిర్వహిస్తారు.

WhatsApp channel