BRS Delhi Office: ఢిల్లీలో బిఆర్‌ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించనున్న కేసీఆర్-telangana cm kcr will inaugurate brs office in delhi today ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Telangana Cm Kcr Will Inaugurate Brs Office In Delhi Today

BRS Delhi Office: ఢిల్లీలో బిఆర్‌ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించనున్న కేసీఆర్

HT Telugu Desk HT Telugu
May 03, 2023 08:30 AM IST

BRS Delhi Office: తెలంగాణ సిఎం కేసీఆర్‌ ఢిల్లీలో బిఆర్‌ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. వసంతవిహార్ ప్రాంతంలో నిర్మించిన కార్యాలయాన్ని కేసీఆర్ లాంఛనంగా ప్రారంభిస్తారు.

సీఎం కేసీఆర్
సీఎం కేసీఆర్ (twitter)

BRS Delhi Office: భారత రాష్ట్ర సమితి ఢిల్లీ కార్యాలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఢిల్లీ బిఆర్‌ఎస్ కార్యాలయాన్ని గురువారం ప్రారంభించాలని భావించినా ఒక రోజు ముందే ఆ కార్యక్రమ నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. బిఆర్‌ఎస్‌ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు బుధవారం ఢిల్లీకి వెళుతున్నారు

ట్రెండింగ్ వార్తలు

అత్యాధునిక హంగులతో వసంత్‌ విహార్‌లో నిర్మించిన బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించనున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వెంట పలువురు మంత్రులు, పార్టీ నేతలు తరలి వెళ్లనున్నారు. మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్‌ ఇప్పటికే పార్టీ ఆఫీస్‌ కార్యాలయ ప్రారంభ కార్యక్రమ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ప్రారంభానికి ముందు శాస్త్రోక్తంగా యాగం, హోమం, ఇతర పూజ కార్యాక్రమాలను నిర్వహించనున్నారు. బుధవారం సీఎం కేసీఆర్ ఢిల్లీకి పయనం కానున్నారు.

పార్టీ కేంద్ర కార్యాలయ ప్రారంభోత్సవంలో పాల్గొన్న తర్వాత రెండ్రోజుల పాటు కేసీఆర్‌ ఢిల్లీలో ఉంటారని సీఎంవో వర్గాలు చెబుతున్నాయి. శుక్రవారం సాయంత్రం తిరిగి హైదరాబాద్‌కు రానున్నారు. కేసీఆర్ ఢిల్లీ పర్యటనలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌తో, మరికొందరు జాతీయ నాయకులతో భేటీ అయ్యే అవకాశం ఉంది.

IPL_Entry_Point