KCR Meets Uddhav Thackeray | కేసీఆర్ యాక్షన్ ప్లాన్.. ఉద్ధవ్ ఠాక్రే, శరద్ పవర్ తో భేటీ.. ఏం మాట్లాడారంటే.. -telangana cm kcr meets maharashtra cm uddhav thackeray in mumbai ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Kcr Meets Uddhav Thackeray | కేసీఆర్ యాక్షన్ ప్లాన్.. ఉద్ధవ్ ఠాక్రే, శరద్ పవర్ తో భేటీ.. ఏం మాట్లాడారంటే..

KCR Meets Uddhav Thackeray | కేసీఆర్ యాక్షన్ ప్లాన్.. ఉద్ధవ్ ఠాక్రే, శరద్ పవర్ తో భేటీ.. ఏం మాట్లాడారంటే..

HT Telugu Desk HT Telugu
Published Feb 20, 2022 03:31 PM IST

మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే, మాజీ సీఎం శరద్ పవార్ తో సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. దేశంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల గురించి చర్చించారు. ప్రాంతీయ పార్టీలను కలుపుకొని వెళ్లేలా ప్రణాళికలు వేస్తున్నట్టు చెప్పారు.

<p>మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేతో కేసీఆర్ భేటీ</p>
మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేతో కేసీఆర్ భేటీ

కేంద్రంపై కొన్ని రోజులుగా పోరాటం చేస్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్.. ఆ వైపుగా అడుగులు వేస్తున్నారు. తాజాగా మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేతో సమావేశమయ్యారు. కేంద్ర ప్రభుత్వం విధానాలపై.. ప్రజల్లో వస్తున్న వ్యతిరేకపై ఈ భేటీలో చర్చించినట్టు తెలుస్తోంది. బీజేపీ వ్యతిరేక కూటమి ఏర్పాటు, కలిసి ఎలా మందుకు వెళ్లాలనే అంశాలపై కూడా మాట్లాడినట్టు సమాచారం. ఈ భేటీలో ఎమ్మెల్సీ కవిత, ఎంపీలు రంజిత్ రెడ్డి, సంతోష్‌, బీబీ పాటిల్‌, సినీ నటుడు ప్రకాశ్​ రాజ్ కూడా ఉన్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ ను మహారాష్ట్ర సీఎం ఆహ్వానించిన విషయం తెలిసిందే. ఈ మేరకు బేగంపేట నుంచి ప్రత్యేక విమానంలో కేసీఆర్ వెళ్లారు. ఠాక్రే నివాసంలో ఇద్దరు ముఖ్యమంత్రులు కలిసి.. లంచ్ చేశారు. అనంతరం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. దేశ రాజకీయాలపై చర్చించినట్టు తెలుస్తోంది. బీజేపీపై పోరులో ఎలా ముందుకు వెళ్లాలనే విషయాలు కూడా ప్రస్తవనకు వచ్చినట్టు సమాచారం.

ముంబయిలో కేసీఆర్ ను ప్రకాశ్ రాజ్ కలిశారు. ముంబయిలో వెళ్లిన కేసీఆర్.. నేరుగా.. గ్రాండ్ హయత్ హోటల్ కు వెళ్లారు. అక్కడే ప్రకాశ్ రాజ్ కలిశారు. ఎమ్మెల్సీ కవిత, ఎంపీలు సంతోష్ సంతోష్ కుమార్, రంజిత్ రెడ్డి, బి.బి పాటిల్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి శ్రవణ్ కుమార్​ను ప్రకాశ్ రాజ్​కు పరిచయం చేశారు కేసీఆర్.

మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రేతో భేటీ ముగిసిన అనంతరం.. కేసీఆర్, ఉద్ధవ్ ఠాక్రే మీడియా సమావేశంలో మాట్లాడారు. 'దేశ రాజకీయాలపై మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ ఠాక్రేతో చర్చించా. కేంద్ర ప్రభుత్వ విధానాలపై కూడా సమాలోచనలు చేశాం. తెలంగాణ, మహారాష్ట్ర సోదర రాష్ట్రాలు. మనకు వెయ్యి కిలో మీటర్ల మేర ఉమ్మడి సరిహద్దు ఉంది. 75 ఏళ్ల స్వాతంత్య్రం తర్వాత కూడా అనేక సమస్యలు ఉన్నాయి. ప్రాంతీయ పార్టీలు ఏకతాటిపైకి రావాలి. ఆ సమయం వచ్చింది. అనేక ప్రాంతీయ పార్టీల నేతలతో చర్చలు చేస్తాం. కార్యాచరణ, చర్చలు ఇవాళే ప్రారంభమయ్యాయి. కేంద్ర- రాష్ట్ర సంబంధాల్లో మార్పు జరగాలి. ఉద్ధవ్‌ ఠాక్రేను హైదరాబాద్‌కు రావాలని ఆహ్వానించాను.' అని కేసీఆర్ అన్నారు.

కేసీఆర్ తో ఎప్పటి నుంచో భేటీ కావాలని అనుకున్నట్టు మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే చెప్పారు. ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితులపై మాట్లాడినట్టు పేర్కొన్నారు. జాతీయ రాజకీయాలపై కేసీఆర్‌తో చర్చించానని ఉద్ధవ్‌ ఠాక్రే తెలిపారు. దేశాభివృద్ధికి అవసరమైన కార్యాచరణపై చర్చించామన్నారు. అనంతరం కేసీఆర్ శరద్ పవార్ ను కలిశారు.

శరద్ పవార్ తోనూ భేటీ

ఉద్ధవ్ ఠాక్రేతో భేటీ అనంతరం శరద్ పవార్ తో కేసీఆర్ భేటీ అయ్యారు. భారత్ ను సరైన దిశగా నడిపించేందుకు.. కొత్త అజెండా, విజన్ కావాలని.. కేసీఆర్ అన్నారు. దీనిపైనే.. శరద్ పవార్ తో సమావేశంలో చర్చించినట్టు చెప్పారు. ఇలాంటి ఆలోచన ఉన్న నేతలతో కలిసి ముందుకు వెళ్తామని చెప్పారు. ఎంతో అనుభవం ఉన్న.. శరద్ పవార్ ఆశీర్వాదం తీసుకున్నట్టు చెప్పారు. ప్రాంతీయ పార్టీలను కలుపుకొని ముందుకు వెళ్తామని చెప్పారు.

ముంబయి పర్యటనను విజయవంతంగా ముగించుకున్నారు సీఎం కేసీఆర్. అనంతరం ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ చేరుకున్నారు.

Whats_app_banner