CMRF Scam: సీఎంఆర్ఎఫ్ స్కామ్‌లో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే.. ఆ నియోజకవర్గంపై సీఐడీ ఫోకస్!-telangana cid suspects role of former brs mla in cmrf scam ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Cmrf Scam: సీఎంఆర్ఎఫ్ స్కామ్‌లో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే.. ఆ నియోజకవర్గంపై సీఐడీ ఫోకస్!

CMRF Scam: సీఎంఆర్ఎఫ్ స్కామ్‌లో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే.. ఆ నియోజకవర్గంపై సీఐడీ ఫోకస్!

Basani Shiva Kumar HT Telugu
Aug 27, 2024 05:13 AM IST

CMRF Scam: తెలంగాణలో సీఎంఆర్ఎఫ్ స్కామ్ సంచలనంగా మారింది. ఈ స్కామ్‌పై సీఐడీ దూకుడు పెంచింది. ఈ నేపథ్యంలో.. కీలక విషయం వెలుగులోకి వచ్చింది. సీఎంఆర్ఎఫ్ స్కామ్‌లో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఉన్నట్టు తెలుస్తోంది. సదరు మాజీ ఎమ్మెల్యే ఎన్నికల ముందు విచ్చలవిడిగా సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారని సమాచారం.

సీఎంఆర్ఎఫ్ స్కామ్‌లో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే
సీఎంఆర్ఎఫ్ స్కామ్‌లో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ( (istockphoto.com))

తెలంగాణలో సీఎంఆర్ఎఫ్ స్కామ్ రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ స్కామ్‌పై ఫుల్ ఫోకస్ పెట్టిన తెలంగాణ సీఐడీ.. కీలక సమాచారం సేకరించింది. సీఐడీ అనుమానించినట్టు.. ఈ స్కామ్‌లో రాజకీయ ప్రమేయం ఉందని విచారణలో స్పష్టమవుతోంది. తాజాగా.. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పాత్ర ఈ స్కామ్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో సీఐడీ అధికారులు ఆ నేత నియోజకవర్గంపై ఫోకస్ పెంచినట్టు సమాచారం.

సీఎం సీరియస్..

సీఎంఆర్ఎఫ్ నిధులు కాజేయడానికి కొన్ని ఆస్పత్రులు, కొందరు అధికారులు, గత ప్రభుత్వంలో లీడర్లుగా చెలామణి అయిన నాయకులు ముఠాగా ఏర్పడ్డారు. ఫేక్ బిల్లులు సృష్టించి.. ఆస్పత్రులతో కుమ్మక్కై కోట్లాది రూపాయల దోపిడీకి పాల్పడ్డారు. ఈ వ్యవహారంపై కొత్తగా ఏర్పడిన రేవంత్ సర్కార్ సీరియస్ అయ్యింది. నిధులు పక్కదారి పట్టడాన్ని సీరియస్‌గా తీసుకొని.. సీఐడీ విచారణకు ఆదేశించింది.

సీఐడీ విచారణలో కీలక విషయాలు..

సీఐడీ విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలోని పలు ఆస్పత్రులు, ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లోని కొన్ని ఆస్పత్రులు ఈ స్కామ్‌లో భాగస్వాములు అయినట్టు సీఐడీ గుర్తించింది. 28 ఆస్పత్రులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఈ వ్యవహారం తెలంగాణ వ్యాప్తంగా సంచలనంగా మారింది. అయితే.. దీంట్లో రాజకీయ నాయకుల హస్తం ఉందనే ఆరోపణలు ఉన్నాయి. ఈ కోణంలోనూ సీఐడీ విచారణ సాగించగా.. విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

స్కామ్‌లో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే..

ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఈ స్కామ్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. ఆ నేత ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో.. ఆస్పత్రులతో కుమ్మక్కై.. కోట్లాది రూపాయలు కొల్లగొట్టినట్టు సమాచారం. ఆయన అనుచరులు కొందరు ఆస్పత్రుల సిబ్బందితో చేతులు కలిపి.. సీఎంఆర్ఎఫ్ నిధులు కాజేశారు. ఈ నేపథ్యంలో.. సదరు నేత ఎన్నికల ముందు తన నియోజకవర్గంలో విచ్చలవిడిగా సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసినట్టు ప్రచారం జరుగుతోంది. ఆయన నియోజకవర్గంలో చెక్కులు తీసుకున్నవారి వివరాలను అధికారులు సేకరిస్తున్నారు.

సెక్షన్ ఆఫీసర్ ఫిర్యాదుతో..

తెలంగాణ సచివాలయంలోని రెవెన్యూ శాఖలో పనిచేసే సెక్షన్ ఆఫీసర్ డీఎస్ఎన్ మూర్తి ఫిర్యాదుతో.. ఈ స్కామ్‌పై దర్యాప్తు ప్రారంభించారు. చాలా మంది ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకోకున్నా.. చేయించుకున్నట్టు బిల్లులు సృష్టించారు. ఆ నకిలీ బిల్లులుతో సీఎంఆర్ఎఫ్‌ కోసం దరఖాస్తు చేసుకున్నారు. దీనికి ఆయా ఆస్పత్రుల్లో పనిచేసే సిబ్బంది, లోకల్ ప్రజా ప్రతినిధులు సహకరించారు. ఈ వ్యవహారంతో.. రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థికంగా నష్టం కలిగిందని అధికారులు చెబుతున్నారు.

హైదరాబాద్‌లోని ఈ హాస్పిటళ్లపై ఎఫ్ఐఆర్..

అరుణ శ్రీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, ఐఎస్ సదన్ ఎక్స్ రోడ్

శ్రీ కృష్ణ హాస్పిటల్, సైదాబాద్

హిరణ్య హాస్పిటల్, మీర్‌పేట్

డెల్టా హాస్పిటల్, హస్తినాపురం

శ్రీ రక్ష హాస్పిటల్, బీఎన్ రెడ్డి నగర్

ఎంఎంఎస్ హాస్పిటల్, సాగర్ రింగ్ రోడ్

ఏడీఆర్ఎం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, శారదానగర్

ఎంఎంవీ ఇందిరా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, కొత్తపేట

శ్రీ సాయి తిరుమల హాస్పిటల్, బైరామల్గూడ

ఖమ్మం:

శ్రీ శ్రీకరా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్

గ్లోబల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్

డా. జే.ఆర్. ప్రసాద్ హాస్పిటల్

శ్రీ వినాయక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్

శ్రీ సాయి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్

మెగశ్రీ హాస్పిటల్, బోనకల్

నల్గొండ:

నవీనా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, మిర్యాలగూడ

మహేష్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, మిర్యాలగూడ

అమ్మ హాస్పిటల్, రైల్వే స్టేషన్ రోడ్

కరీంనగర్:

సప్తగిరి హాస్పిటల్, జమ్మికుంట

శ్రీ సాయి హాస్పిటల్, పెద్దపల్లి

వరంగల్:

రోహిణి మెడికేర్ ప్రైవేట్ లిమిటెడ్, హనుమకొండ

మహబూబాబాద్:

శ్రీ సంజీవిని హాస్పిటల్

సిద్ధార్థ హాస్పిటల్