Sun, 08 Jun 202506:56 AM IST
ప్రమాణస్వీకార కార్యక్రమం పూర్తి
ముగ్గురు కొత్త మంత్రులతో రాష్ట్ర గవర్నర్ ప్రమాణస్వీకారం చేయించారు. జాతీయ గీలాపానతో కార్యక్రమం ముగిసింది.
Sun, 08 Jun 202506:50 AM IST
వాకిటి ప్రమాణం
చివరిగా వాకిటి శ్రీహరితో గవర్నర్ ప్రమాణస్వీకారం చేయించారు. కొత్తగా ఎంపికైన వారికి గవర్నర్ పుష్పగుచ్చం ఇచ్చి అభినందనలు తెలిపారు.
Sun, 08 Jun 202506:48 AM IST
అడ్లూరితో ప్రమాణస్వీకారం
వివేక్ తర్వాత అడ్లూరి లక్ష్మణ్ తో గవర్నర్ ప్రమాణస్వీకారం చేయించారు.
Sun, 08 Jun 202506:47 AM IST
వివేక్ ప్రమాణస్వీకారం
ముందుగా జి వివేక్ తో గవర్నర్ ప్రమాణస్వీకారం చేయిస్తున్నారు.
Sun, 08 Jun 202506:44 AM IST
ముగ్గురు మంత్రుల ప్రమాణం
మధ్యాహ్నం 12.19 నిమిషాలకు రాజ్‌భవన్‌లో కొత్త మంత్రుల ప్రమాణస్వీకారం జరగనుంది. మంత్రులుగా వివేక్, వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్ ప్రమాణం చేయనున్నారు.
Sun, 08 Jun 202506:39 AM IST
మరికొద్ది నిమిషాల్లో..
మరికొద్ది నిమిషాల్లో మంత్రుల ప్రమాణస్వీకార కార్యక్రమం ప్రారంభం కానుంది. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ వారితో ప్రమాణం చేయించనున్నారు.
Sun, 08 Jun 202506:26 AM IST
చాలా సంతోషంగా ఉంది - అడ్లూరి
“మంత్రివర్గంలో చోటు లభించినందుకు చాలా సంతోషంగా ఉంది. మాదిగ సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నందుకు గర్వంగా ఉంది. మా ఆరుగురు ప్రజాప్రతినిధులలో ఎవరికి మంత్రి పదవి ఇచ్చినా నాకు సంతోషమే. కాంగ్రెస్ పార్టీ అన్ని సామాజిక వర్గాలకు తగిన ప్రాతినిధ్యం కల్పించింది” అని అడ్లూరి లక్ష్మణ్ అన్నారు.
Sun, 08 Jun 202506:25 AM IST
మక్తల్ నుంచి విజయం
2023లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వాకిటి శ్రీహరి ముదిరాజ్ మక్తల్ నుంచి గెలిచారు.
17525 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు.
బీసీల కోటాలో కేబినెట్ లో చోటు దక్కించుకున్నారు.
Sun, 08 Jun 202506:25 AM IST
వాకిటి శ్రీహరి నేపథ్యం:
వాకిటి శ్రీహరి ముదిరాజ్ ప్రస్తుతం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని మక్తల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు.
తొలినాళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీతోనే రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు.
2001 నుండి 2006 వరకు మక్తల్ గ్రామ సర్పంచ్‌గా పని చేశారు.
2014 నుండి 2018 వరకు మక్తల్ జెడ్పీటీసీగా ఉన్నారు.
2014 నుండి 2018 వరకు కాంగ్రెస్ పార్టీ నారాయణపేట జిల్లా ప్రధాన కార్యదర్శిగా పని చేశారు. ఆ తర్వాత జిల్లా అధ్యక్షుడు కూడా అయ్యారు.
Sun, 08 Jun 202506:24 AM IST
చెన్నూరు నుంచి ఎమ్మెల్యేగా గెలుపు
2019లో టీఆర్ఎస్ నుంచి బయటికి వచ్చిన వివేక్… బీజేపీలో చేరారు. భారతీయ జనతా పార్టీ కేంద్ర కార్యవర్గ సభ్యుడిగా నియమితుల్యారు.
బీజేపీని వీడిని వివేక్… మళ్లీ కాంగ్రెస్ గూటికి చేరారు. 2023లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో చెన్నూరు నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు.
వివేక్ కుమారుడైన గడ్డం వంశీ… ప్రస్తుతం పెద్దపల్లి ఎంపీ( కాంగ్రెస్)గా ఉన్నారు.
Sun, 08 Jun 202506:24 AM IST
వివేక్ ప్రస్థానం:
వివేక్ పూర్తి పేరు… గడ్డం వివేక్ వెంకటస్వామి. ఇయన కాంగ్రెస్ సీనియర్ నేత వెంకటస్వామి కుమారుడు.
బేగంపేట లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో పాఠశాల విద్యను చదివారు. ఉస్మానియా వైద్య కళాశాల నుంచి వైద్య విద్యను పూర్తి చేశారు.
2009లో పెద్దపల్లి నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో కీలకంగా వ్యవహరించారు. రాష్ట్ర సాధన కోసం కాంగ్రెస్ పార్టీ తరపున పార్లమెంట్ లో పోరాడారు.
ఉద్యమ సమయంలో కాంగ్రెస్ పార్టీని వీడిని వివేక్… 2013లో టీఆర్ఎస్ లో చేరారు. కొద్దిరోజులకే మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
2014లో పెద్దపల్లి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు.
2016లో మళ్లీ టీఆర్‌ఎస్‌లో చేరిన వివేక్… రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా నియమితులయ్యారు.
Sun, 08 Jun 202506:18 AM IST
అడ్లూరి రాజకీయ ప్రస్థానం
2009లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో, 2010లో జరిగిన ఉప ఎన్నికల్లో ధర్మపురి నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓడిపోయారు,
2014, 2018లో ధర్మపురి నియోజకవర్గం నుండి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు.
2013 నుంచి 14 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్‌గా పని చేశారు.
అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆ తరువాత జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నియమితులయ్యారు.
2023లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ధర్మపురి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ తన సమీప బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ పై 22,039 ఓట్ల మెజారిటీతో గెలిచారు. తొలిసారిగా అసెంబ్లీలోకి అడుగుపెట్టారు.
అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను 2023 డిసెంబర్ 15న ప్రభుత్వ విప్‌గా ప్రభుత్వం నియమించింది. తాజాగా ఆయనకు కేబినెట్ లో బెర్త్ కల్పించింది.
Sun, 08 Jun 202506:17 AM IST
అడ్లూరి లక్ష్మణ్ నేపథ్యం:
అడ్లూరి లక్ష్మణ్ ప్రస్తుతం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ధర్మపురి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. 1982 నుండి 85 వరకు గోదావరిఖని జూనియర్ కళాశాల ఎన్‌ఎస్‌యూఐ అధ్యక్షుడిగా పని చేశారు.
1986 నుండి 94 వరకు ఎన్‌ఎస్‌యూఐ కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా, 1996 నుండి 2001 వరకు ఏపీ యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించారు.
2006లో ధర్మారం (ఎస్సీ) రిజర్వుడ్ స్థానం నుంచి జడ్పీటీసీగా పోటీ చేసి గెలిచారు.
1999లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో మేడారం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయాడు.
అడ్లూరి లక్ష్మణ్ కుమార్ 2010 నుండి 2012 వరకు కరీంనగర్ జడ్పీ ఛైర్మన్‌గా పని చేశారు.
Sun, 08 Jun 202506:09 AM IST
ముగ్గురు ఎమ్మెల్యేలు - నియోజవర్గాలు ఇవే
కొత్తగా కేబినెట్ లోకి వచ్చిన ఈ ముగ్గురు తొలిసారిగా ఎమ్మెల్యేలుగా గెలిచినవారే కావటం విశేషం. వివేక్ గతంలో ఎంపీగా పని చేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో చెన్నూరు నుంచి పోటీ విజయం సాధించారు. ఇక మక్తల్ నుంచి వాకిిటి శ్రీహరి, ధర్మపురి నుంచి అడ్లూరి లక్ష్మణ్ ఎమ్మెల్యేగా గెలిచారు.
Sun, 08 Jun 202506:01 AM IST
ఎస్సీలకు 4…
కాంగ్రెస్ నుంచి 15 మంది ఎస్సీ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇప్పటికే భట్టి విక్రమార్క, దామోదర రాజ నరసింహ ఉన్నారు. వీరికితోడు వివేక్, అడ్లూరి లక్ష్మణ్ చేరికతో వీరి సంఖ్య 4కు చేరనుంది. వీరిలో ఇద్దరు ఎస్సీ మాల, మరో ఇద్దరు మాదిగ సామాజికవర్గానికి చెందినవారుగా ఉన్నారు.
Sun, 08 Jun 202505:59 AM IST
ఎస్టీలకు డిప్యూటీ స్పీకర్
ఆదివాసీల సామాజిక వర్గానికి చెందిన సీతక్క మంత్రిగా కొనసాగుతున్నారు. లంబాడీలకు అవకాశం కల్పించకపోవడంతో.. వారిని సంతృప్తి పరిచే విధంగా రామచంద్రునాయక్ కు డిప్యూటీ స్పీకర్ గా అవకాశం కల్పించనున్నారు.
Sun, 08 Jun 202505:59 AM IST
ముగ్గురు బీసీలు
అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నుంచి ఏడుగురు బీసీ ఎమ్మెల్యేలు గెలవగా ప్రస్తుతం ఇద్దరు బీసీ మంత్రులుగా ఉన్నారు. కొత్తగా ముదిరాజ్ వర్గానికి చెందిన వాకిటి శ్రీహరికి కొత్తగా మంత్రి వర్గంలో చోటు కల్పించారు. దీంతో తెలంగాణ మంత్రి వర్గంలో బీసీ కమ్మూనిటీకి చెందిన వారు ముగ్గురు మంత్రులు అవుతారు.
Sun, 08 Jun 202505:57 AM IST
మాదిగ సామాజికవర్గానికి చోటు
మాదిగ సామాజిక వర్గానికి మంత్రివర్గంలో చోటు కల్పించాలని ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, చేవేళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం శనివారం నాడు సీఎం రేవంత్ రెడ్డిని కలవడం తెలిసిందే. ఈ నేపథ్యంలో వారి సామాజికవర్గం నుంచి లక్ష్మణ్ కు అవకాశం లభించింది.
Sun, 08 Jun 202505:56 AM IST
చాలారోజులుగా కసరత్తు
2023 డిసెంబర్ నెలలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైంది. అది మొదలుకుని గత 18 నెలల నుంచి పలుమార్లు రాష్ట్ర కేబినెట్ విస్తరణపై చర్చ జరిగేది. ఎట్టకేలకు ఇవాళ విస్తరణ జరుగుతోంది.
Sun, 08 Jun 202505:52 AM IST
తొలిసారి ఎమ్మెల్యేలుగా…
ప్రస్తుతం కేబినెట్ లోకి వచ్చే ముగ్గురు కూడా తొలిసారిగా ఎమ్మెల్యేలుగా గెలిచినవారే. వివేక్ గతంలో ఎంపీగా పని చేశారు. మొన్నటి ఎన్నికల్లో తొలిసారిగా ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు.
Sun, 08 Jun 202505:51 AM IST
చివరి నిమిషంలో ట్విస్ట్
ప్రస్తుత కేబినెట్ విస్తరణలో మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లికి చోటు దక్కినట్లు ప్రచారం దక్కింది. కానీ చివర్లో ధర్మపురి నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన అడ్లూరి లక్ష్మణ్ ను మంత్రి పదవి వరించింది.
Sun, 08 Jun 202505:50 AM IST
కోమటిరెడ్డికి నో ఛాన్స్
ప్రస్తుత కేబినెట్ విస్తరణలో కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి చివరి వరకు ప్రయత్నాలు చేసినట్లు తెలిసింది. చివరి నిమిషంలో ఆయనకు చోటు దక్కలేదు. ఇప్పటికే ఆయన సోదరుడు వెంకట్ రెడ్డి కేబినెట్ లో ఉన్నారు.
Sun, 08 Jun 202505:50 AM IST
ఈ జిల్లాలకు నో ఛాన్స్…!
ప్రస్తుత కేబినెట్ లో ఉమ్మడి నిజామాబాద్ నుంచి ఎవరికీ అవకాశం దక్కలేదు. ఇక్కడ్నుంచి పార్టీ సీనియర్ నేత సుదర్శన్ రెడ్డి పేరు రేసులో ఉన్నారు.ఇక ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి పరిగి ఎమ్మెల్యేతో పాటు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి మంత్రి పదవి కోసం గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు.
Sun, 08 Jun 202505:49 AM IST
మరో 3 త్వరలోనే
మంత్రివర్గ విస్తరణలో చోటు కోసం చాలా మంది ఎమ్మెల్యేలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆరు స్థానాలు మాత్రమే ఖాళీ ఉండగా… వీటి కోసం చాలా మంది నేతలు రేసులో ఉన్నారు. ఈ నేపథ్యంలో… బెర్తుల ఖరారు కోసం పార్టీ అధినాయకత్వం చాలారోజులుగా కసరత్తు చేస్తూనే వస్తోంది. ఎట్టకేలకు మూడు బెర్తులను ఖరారు చేయటంతో… మరో మూడు కూడా త్వరలోనే చేసే అవకాశం ఉందని కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
Sun, 08 Jun 202505:49 AM IST
రెండు ఎస్సీ, ఒకటి బీసీలకు
ఈసారి విస్తరణలో ఎస్సీ, బీసీ సామాజికవర్గాలకు చోటు దక్కినట్లు అయింది. ఎమ్మెల్యే వివేక్ ఎస్సీ మాల సామాజికవర్గానికి చెందిన వారు కాగా… లక్ష్మణ్ మాదిగ సామాజికవర్గానికి చెందిన వారుగా ఉన్నారు. ఇక ముదిరాజ్ సామాజికవర్గానికి చెందిన శ్రీహరికి బీసీల కోటాలో ఛాన్స్ దక్కినట్లు అయింది.
Sun, 08 Jun 202505:49 AM IST
ఆరు ఖాళీలు - 3 భర్తీ
ప్రస్తుతం తెలంగాణ కేబినెట్ లో 6 బెర్తులు ఖాళీగా ఉన్నాయి. అయితే ఇందులో మూడింటిని భర్తీ చేయనున్నారు. మిగిలిన మూడింటిని త్వరలోనే భర్తీ చేస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుత కేబినెట్ విస్తరణలో ఎస్సీలకు రెండు, బీసీ సామాజికవర్గానికి మరో బెర్త్ ను ఖరారు చేశారు.
Sun, 08 Jun 202505:47 AM IST
సీఎం రేవంత్ అభినందనలు
నూతన మంత్రులుగా బాధ్యతలు స్వీకరించబోతున్న వివేక్ వెంకట స్వామి, అడ్లూరి లక్ష్మణ్, వాకిటి శ్రీహరికి సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు.శాసన సభ లోఉప సభాపతి బాధ్యతలు స్వీకరించబోతున్న రామచంద్రు నాయక్ కు కూాడా అభినందనలు ఉంటూ ఓ ప్రకటన చేశారు.
Sun, 08 Jun 202505:46 AM IST
సామాజికవర్గాల వారీగా
బీసీల నుంచి వి.శ్రీహరి ముదిరాజ్, ఎస్సీల నుంచి వివేక్ (మాల), అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ (మాదిగ)లకు చోటు లభించింది.
Sun, 08 Jun 202505:45 AM IST
ముగ్గురు మంత్రులు
తెలంగాణ మంత్రివర్గంలో ముగ్గురికి చోటు ఖరారైంది. వీరితో కాసేపట్లో గవర్నర్ ప్రమాణిస్వీకారం చేయించనున్నారు. కొత్తగా చోటు దక్కించుకున్న వారిలో వాకిటి శ్రీహరి, వివేక్, అడ్లూరి లక్ష్మణ్ ఉన్నారు.