తెలంగాణ మంత్రివర్గ సమావేశం ముగిసింది. ఐదు గంటలపాటు సుదీర్ఘంగా సాగింది. ఉద్యోగులకు రెండు డీఏలు ఇవ్వాలని నిర్ణయించింది. ఇదే విషయంపై డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ప్రకటన చేశారు. తక్షణమే ఒక DAను ఇస్తున్నట్లు తెలిపారు. రెండో డీఏను మరో 6 నెలల్లో ఇస్తామని వెల్లడించారు.
మెట్రో రెండో విడత విస్తరణపై తెలంగాణ కేబినెట్‌లో చర్చ జరిగింది. ములుగు జిల్లా ఇంచర్లలో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీకి 12 ఎకరాలు కేటాయింపునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మహిళా స్వయం సహాయక బృందాల సభ్యుల ప్రమాద బీమా ఇవ్వాలని నిర్ణయించింది. లోన్ బీమా చెల్లింపుల కోసం రూ.70 కోట్లు చెల్లిస్తూ ఆమోదముద్ర వేసింది. హమ్ విధానంలో గ్రామీణ రోడ్ల ఆధునీకరణ చేపట్టాలని కేబినెట్ నిర్ణయించింది.