TS Inter Board : అలర్ట్... ఇంటర్ అడ్మిషన్ల గడువు పెంపు - ఎప్పటివరకంటే
Telangana Intermediate Board Updates : ఇంటర్ లో చేరాలనుకునే వారికి అలర్ట్ ఇచ్చింది తెలంగాణ ఇంటర్ బోర్డు. ఫస్ట్ ఇయర్ అడ్మిషన్ల గడువును పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు వివరాలను పేర్కొంది.
Telangana State Board of Intermediate Education: ఫస్ట్ ఇయర్ అడ్మిషన్లకు సంబంధించి కీలక అప్డేట్ ఇచ్చింది తెలంగాణ ఇంటర్ బోర్డు. జూనియర్ కాలేజీల్లో మొదటి సంవత్సరం ప్రవేశ గడువును పెంచుతున్నట్లు ప్రకటించింది. గతంలో నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ప్రథమ సంవత్సరం ప్రవేశాల గడువు ఈ నెల 16తో ముగిసింది. అయితే ఈ సమయాన్ని ఆగస్టు 31వ తేదీకి పొడిగిస్తున్నట్లు ఇంటర్ బోర్డు ప్రకటించింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది.
తాజాగా ప్రైవేటు కాలేజీల్లో చేరాలనుకునే వాళ్లు ఆలస్య రుసుం కింద రూ.750 చెల్లించాలని ఇంటర్ బోర్డు స్పష్టం చేసింది. ప్రభుత్వ, ఎయిడెడ్ కాలేజీల్లో మాత్రం ఎలాంటి ప్రత్యేక ఫీజు కట్టాల్సిన అవసరం లేదని తెలిపింది. అడ్మిషన్లు తీసుకొని విద్యార్థులు... తాజాగా పొడిగించిన గడువు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరింది.
Telangana Junior Colleges:ఇంటర్మీడియట్ తరగతులు జూన్ 1 నుంచి ప్రారంభమయ్యాయి. ఇక 2023 -24 విద్యాసంవత్సరం అకడమిక్ క్యాలెండర్‌ను ఇప్పటికే విడుదల చేసింది ఇంటర్‌బోర్డు.మొత్తంగా 227 రోజులపాటు తరగతులు నిర్వహించేలా షెడ్యూల్‌ను రూపొందించింది.
జూన్ 1, 2023 పునఃప్రారంభం
అర్ధవార్షిక పరీక్షలు 20-11-2023 నుంచి 25-11-2023
ప్రాక్టికల్ ఎగ్జామ్స్ 2024 ఫిబ్రవరి రెండో వారంలో
ఇంటర్ వార్షిక పరీక్షలు 2024 మార్చి మొదటి వారంలో
దసరా సెలవులు 19-10-2023 నుంచి 25-10- 2023
పునః ప్రారంభం 26 అక్టోబర్ 2023 నుంచి
సంక్రాతి సెలవులు 13-1-2024 నుంచి 16-1-2023
పునః ప్రారంభం 17 జనవరి 2024 నుంచి
వేసవి సెలవులు 1-4-2024 నుంచి 31-5-2024
మొత్తం పని దినాలు - 227
ఇంటర్ ఇంగ్లీష్‌కూ ప్రాక్టికల్స్….
ఈ కొత్త విద్యాసంవత్సరంలో పలు సంస్కరణలు అమలు చేసే దిశగా తెలంగాణ ఇంటర్ బోర్డు అడుగులు వేసింది. ఓవైపు సిలబస్ మార్పులపై దృష్టి పెట్టగా... ఇంగ్లీష్ పరీక్షా విధానంలో మార్పులు తీసుకురావాలని నిర్ణయించింది. ఈ ఏడాది ఇంగ్లీష్ లో ప్రాక్టికల్స్ ను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఈ కొత్త విద్యాసంవత్సరం (2023-24) నుంచి ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులకు వీటిని అమలు చేయనున్నారు. ప్రాక్టికల్స్‌కు 20 మార్కులు కేటాయిస్తే.... రాత పరీక్ష 80 మార్కులకే ఉండనుంది. ఇప్పటివరకు ఇంటర్ సెకండియర్‌లోని భౌతిక, రసాయన శాస్త్ర సబ్జెక్టులతో పాటు జువాలజీ,బొటనీ సబ్జెక్టులకు ప్రాక్టికల్స్ ఉన్నాయి. అయితే వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఇంగ్లిష్‌లోనూ ప్రాక్టికల్స్ అమలు చేయనున్నారు. ఫలితంగా థియరీ మార్కులు తగ్గిపోతాయి. ఇటీవల జరిగిన ఇంటర్మీడియట్ బోర్డు సమావేశంలో ఇంగ్లిష్‌లో ప్రాక్టికల్స్ అమలుపై నిర్ణయం తీసుకొన్నారు. వార్షిక పరీక్షలే కాకుండా ఇంటర్నల్ ఎగ్జామ్స్‌ను కూడా ఇదే విధానంలోనే నిర్వహించే అవకాశం ఉంది.
అంతర్జాతీయంగా ఇంగ్లీష్ కు అత్యధిక ప్రాధాన్యత ఉంటుంది. ప్రైవేటు రంగాల్లో అవకాశాలు రావాలంటే ఇంగ్లీష్ రావాల్సిందే. విషయంపై అవగాహన ఉన్న... ఇంగ్లీష్ రాకపోవటంతో చాలా మందికి అవకాశాలు రావటం లేదు. ఈ నేపథ్యంలో ఇంటర్ స్థాయిలోనే ప్రాక్టికల్స్ దిశగా విద్యార్థులను అడుగులు వేసేలా చేసేందుకు ఇంటర్ అధికారులు భావిస్తున్నారు. నూతన విధానం ప్రకారం ఇంటర్ ఇంగ్లిష్ సబ్జెక్టుకు ల్యాబ్ వర్క్ తప్పనిసరి కానున్నది. ఫలితంగా అన్ని కాలేజీల్లో ఆంగ్ల ల్యాబ్‌లు ఏర్పాటు కానున్నాయి. ఇప్పటికే ఈ విధానం ఇంజినీరింగ్ కాలేజీల్లో అమలవుతోంది. ప్రయోగ పరీక్షల్లో భాగంగా తరగతి గదిలో విద్యార్థులతో ఆంగ్లంలో మాట్లాడిస్తారు. ఆంగ్ల నిపుణులు మాడ్యుళ్లు కూడా రూపొందిస్తున్నారు. వాటికి సంబంధించిన పుస్తకాలనూ ముద్రించాలని భావిస్తున్నారు. ఈ ప్రాక్టికల్స్ లో ప్రధానంగా వినడం, మాట్లాడటం, చదవడం, రాయడం వంటి భాషా నైపుణ్యాలను పెంచుకోనేలా సాధన చేయిస్తారు. మాట్లాడినవి రికార్డు చేయటం వంటివి చేస్తారు. భాషా సామర్థ్యాన్ని పరీక్షించుకునే అవకాశం ఉంటుంది.