Kishan reddy On Mlc Issue: గవర్నర్ నిర్ణయాన్ని స్వాగతించిన కిషన్ రెడ్డి
Kishan reddy On Mlc Issue: ఎమ్మెల్సీల జాబితాను గవర్నర్ తిరస్కరించడాన్ని బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి స్వాగతించారు. నామినేటెడ్ కోటాలో కవులు, కళాకారులు, సేవ చేసేవారికి అవకాశం కల్పిస్తార, కేసీఆర్ మాత్రం క్రిమినల్ కేసులు ఉన్న వారిని పెద్దల సభకు పంపించాలని చూస్తున్నారని ఆరోపించారు.
Kishan reddy On Mlc Issue: ఎమ్మెల్సీల జాబితాను తిరస్కరించడంతో గవర్నర్ నిర్ణయాన్ని స్వాగిస్తున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. తెలంగాణ గవర్నర్ తమిళ సై సరైన నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు. నామినేటెడ్ కోటాలో కవులు, కళాకారులు, సేవ చేసేవారికి ఎమ్మె్సీలుగా అవకాశం కల్పిస్తారని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం క్రిమినల్ కేసులు ఉన్న వ్యక్తులను పెద్దల సభకు పంపించాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ట్రెండింగ్ వార్తలు
కేసీఆర్ కుటుంబం కోసం పని చేసేవారికి ఎమ్మెల్సీ పదవి అడుగుతున్నారన్నారు. పార్టీలు పదేపదే ఫిరాయించిన వారికి, కేసీఆర్ కుటుంబానికి సేవ చేసే వారిని గవర్నర్ తిరస్కరించడం స్వాగతించాల్సిన విషయమేనని అన్నారు. కేసీఆర్ ఏం చెబితే అది వింటే మంచివాళ్లు, లేకుంటే చెడ్డవాళ్లా? అని ప్రశ్నించారు.
నామినేటెడ్ కోటా ఎమ్మెల్సీల కొరకు ప్రభుత్వం ప్రదిపాధించిన అభ్యర్థిత్వాలను తిరస్కరిస్తూ గవర్నర్ సంచలన నిర్ణయం తీసుకున్న తెలంగాణలో దుమారం రేపుతోంది. ప్రభుత్వం పంపిన సిఫార్సులను తిరస్కరించిన అనంతరం గవర్నర్ లేఖ రూపంలో స్పందించారు.
"ప్రభుత్వం ప్రదిపాధించిన దాసోజు శ్రావణ, సత్యనారాయణలకు రాజకీయాలతో సంబంధాలు ఉన్నాయని ప్రస్తుతం కూడా వారు ప్రత్యేక్ష రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్నారని పేర్కొన్నారు. కళలు, సాహిత్యం, సైన్స్ వంటి రంగాల్లో వీరిద్దరూ పెద్దగా కృషి చేయ లేదని గవర్నర్ కోటాలో నామినేట్ చేసే అర్హతలు వీరికి లేవని తమిళసై స్పష్టం చేశారు. ఆర్టికల్ 171(5) ప్రకారం అభ్యర్థుల ఎంపిక సరైన పద్దతిలో జరగలేదని గవర్నర్ తమిళ సై పేర్కొన్నారు.
మరోవైపు ఎమ్మెల్సీల జాబితాను గవర్నర్ తిరస్కరించడంపై బిఆర్‌ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గవర్నర్ పదవి చేపట్టడానికి ముందు తమిళనాడు రాష్ట్రానికి బీజేపీ అధ్యక్షురాలిగా ఉన్న వ్యక్తి గవర్నర్ అవ్వొచ్చు కానీ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన బడుగు వర్గాలకు చెందిన వారు మాత్రం ఎమ్మెల్సీలు కావొద్దనే ఉద్దేశంతోనే గవర్నర్ తిరస్కరించారని బిఆర్‌ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు.
రిపోర్టింగ్ కె.తరుణ్, హైదరాబాద్