Wed, 19 Mar 202507:32 AM IST
ఢిల్లీకి మూటలు పంపడమే వీరి లక్ష్యం - కేటీఆర్
కమీషన్లు పెంచుకునే దిశగా బడ్దెట్ రూపొందించాని కేటీఆర్ ఆరోపించారు. వీళ్ల ప్రాధాన్యత వ్యవసాయం కాదని… ఢిల్లీకి మూటలు పంపడమే అని దుయ్యబట్టారు. రేవంత్ రెడ్డి పాలనా వైఫల్యానికి ఈ బడ్జెట్ నిదర్శనమని కేటీఆర్ వ్యాఖ్యానింతారు.
Wed, 19 Mar 202507:33 AM IST
కేటీఆర్ విమర్శలు
రాష్ట్ర బడ్జెట్ పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు గుప్పించారు. ప్రసంగం చూస్తే 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అనే మాట పాతర వేశారు అని స్పష్టంగా అర్ధం అవుతుందన్నారు.
Wed, 19 Mar 202507:28 AM IST
సభ ఎల్లుండికి వాయిదా
బడ్జెట్ ను ప్రవేశపెట్టిన తర్వాత శాసనసభ, మండలి ఎల్లుండికి వాయిదా పడింది. బడ్జెట్ పై చర్చ జరగనుంది.
Wed, 19 Mar 202507:21 AM IST
ముగిసిన భట్టి ప్రసంగం
ఆర్థిక పద్దును ప్రతి ఒక సభ్యుడు స్వాగతించాలని.. పద్దుపై జరిగే చర్చలో పాల్గొని విలువైన సూచనలు ఇవ్వాలని భట్టి కోరారు. జై హింద్ అంటూ తన ప్రసంగాన్ని ముగించారు.
Wed, 19 Mar 202507:18 AM IST
రేషన్ కార్డులపై ప్రకటన
జనవరి 26 నుంచి రాష్ట్రంలో రేషన్ కార్జుల జారీ ప్రక్రియ ప్రారంభమైందని భట్టి తెలిపారు. ఈ ప్రక్రియ నిరంతరంగా కొనసాగుతుందని పేర్కొన్నారు.
Wed, 19 Mar 202507:11 AM IST
ఐటీ కేంద్రంగా వరంగల్
"ఐటీ కేంద్రంగా వరంగల్ ను చేయబోతున్నాం. వరంగల్ ను విద్యావైద్య మరియు ఐటీ కేంద్రంగా అభివృద్ధి చేస్తాం నిజామాబాద్, ఖమ్మంను వ్యవసాయాధారిత పరిశ్రమలు, తయారీ రంగానికి కేంద్రాలుగా తీర్చిదిద్దుతాం" అని భట్టి విక్రమార్క తెలిపారు.
Wed, 19 Mar 202507:08 AM IST
ఆత్మీయ భరోసాకు రూ.600 కోట్లు
సన్న బియ్యం బోనస్‌కు రూ.1800 కోట్లు, రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకానికి రూ.1,143 కోట్లు, గ్యాస్ సిలిండర్ సబ్సిడీకి రూ.723 కోట్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు రూ.600 కోట్లు కేటాయించినట్లు ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క తెలిపారు.
Wed, 19 Mar 202507:07 AM IST
6 గ్యారెంటీలకు రూ. రూ.56,084 కోట్లు
6 గ్యారెంటీల అమలుకు రూ.56,084 కోట్లు, మహాలక్ష్మి పథకానికి రూ.4,305 కోట్లు, గృహజ్యోతి పథకానికి రూ.2,080 కోట్లు కేటాయించారు.
Wed, 19 Mar 202506:46 AM IST
3 నినాదాలతో ముందుకు
“అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన అనే మూడు అంశాలు మా నినాదం. తెలంగాణ రైజింగ్ 2050 అనే ప్రణాళికతో సీఎం పాలనను ముందుకు నడిపిస్తున్నారు. నేడు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పరిణామం 200 బిలియన్ డాలర్లు. రాబోయే ఐదేళ్లలో ఐదు రెట్లు అభివృద్ధి చేసి 1000 బిలియన్ డాలర్లు ఉండేలా కార్యాచరణ ఉంటుంది " అని భట్టి తన బడ్జెట్ ప్రసంగంలో ప్రస్తావించారు.
Wed, 19 Mar 202506:44 AM IST
తెలంగాణ బడ్జెట్ - కేటాయింపులు
షెడ్యూల్ కులాల సంక్షేమం - రూ. 40,232 కోట్ల
పంచాయతీ రాజ్ శాఖ - రూ. 31,605 కోట్లు
వ్యవసాయశాఖ - రూ. 24,439 కోట్లు
ఇరిగేషన్ - రూ. 23, 373 కోట్లు
విద్యాశాఖ - రూ. 23,108 కోట్లు
విద్యుత్ - రూ. 21,221 కోట్లు
మున్సిపల్ శాఖ - రూ. 17, 677 కోట్లు
గిరిజన సంక్షేమం - రూ. 17169 కోట్లు
ఆరోగ్యం - రూ.12393 కోట్లు
బీసీ సంక్షేమం - రూ. 11405 కోట్లు
రోడ్లు భవనాలు - రూ. 5907 కోట్లు
పౌరసరఫరాలు - రూ. 5734 కోట్లు
మైనార్టీ వ్యవహారాలు - రూ. 3591 కోట్లు
పరిశ్రమలు - రూ. 3527 కోట్లు
స్రీ మరియు శిశు సంక్షేమం - 2862 కోట్లు
పశుసంవర్థకం - రూ. 1674 కోట్లు
పర్యావరణం, అటవీ శాఖ -రూ. 1023 కోట్లు
టూరిజం - రూ. 775 కోట్లు
ఐటీ - రూ. 774 కోట్లు
క్రీడలు - రూ. 465 కోట్లు
చేనేత రంగం - రూ. 371 కోట్లు.
Wed, 19 Mar 202506:42 AM IST
వృద్ధిరేటు 9.6 శాతం
రాష్ట్ర తలసరి ఆదాయం రూ. 3,79,751గా ఉందని భట్టి తెలిపారు. వృద్ధిరేటు 9.6 శాతంగా నమోదైందని వివరించారు. దేశ తలసరి ఆదాయం రూ. 2,55,079గా ఉందని.. దీనితో పోల్చితే రాష్ట్ర వృద్ధిరేటు 8.8 శాతంగా ఉందని పేర్కొన్నారు.
Wed, 19 Mar 202506:27 AM IST
కేటాయింపుల వివరాలు
రూ. 1,674 కోట్లు - పశుసంవర్ధకం
రూ.1,023 కోట్లు - అడవులు & పర్యావరణం
రూ.900 కోట్లు - యువజన సేవలు
రూ.775 కోట్లు - పర్యాటకం
రూ.774 కోట్లు - సమాచార సాంకేతికత
రూ.465 కోట్లు - క్రీడలు
రూ.371 కోట్లు - చేనేత
Wed, 19 Mar 202506:26 AM IST
శాఖలవారీగా కేటాయింపులు
రూ. 11,405 కోట్లు - వెనుకబడిన తరగతుల సంక్షేమం
రూ.5,907 కోట్లు - రోడ్లు & భవనాలు
రూ.5,734 కోట్లు - పౌర సరఫరాలు
రూ.3,591 కోట్లు - మైనార్టీ సంక్షేమం
రూ.3,527 కోట్లు - పరిశ్రమలు
రూ.2,862 కోట్లు - మహిళలు మరియు శిశు సంక్షేమం
Wed, 19 Mar 202506:26 AM IST
శాఖలవారీగా కేటాయింపులు
రూ. 40,232 కోట్లు - షెడ్యూల్డ్ కులాల సంక్షేమం
31,605 కోట్లు - పంచాయతీరాజ్ & గ్రామీణం
రూ.24,439 కోట్లు - వ్యవసాయం
రూ.23,373 కోట్లు - నీటిపారుదల
రూ.23,108 కోట్లు - విద్య
రూ.21,221 కోట్లు - ఇంధనం
రూ.17,677 కోట్లు - మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్
రూ.17,169 కోట్లు - షెడ్యూల్డ్ తెగల సంక్షేమం
రూ.12,393 కోట్లు - ఆరోగ్యం
Wed, 19 Mar 202506:25 AM IST
తెలంగాణ బడ్జెట్ 2025 సమగ్ర వివరాలు:
మొత్తం వ్యయం - రూ. 3,04,965 కోట్లు
రెవెన్యూ వ్యయం - రూ. 2,26,982 కోట్లు
మూలధన వ్యయం - రూ. 36,504 కోట్లు
Wed, 19 Mar 202506:17 AM IST
రుణమాఫీ చేశాం - భట్టి
రైతులకు రూ.20, 616 కోట్లు రుణ మాఫీ చేశామని భట్టి చెప్పారు. రైతు భరోసా కింద ఎకరాకు రూ.12000 అందిస్తున్నామని.. ఈ స్కీమ్ కు రూ.18000 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల సంఖ్య 8,332కు పెంచున్నామని పేర్కొన్నారు. రాజీవ్ యువ వికాస పథకానికి రూ.6000 కోట్లు కేటాయించినట్లు భట్టి ప్రకటించారు.
Wed, 19 Mar 202505:59 AM IST
తెలంగాణ బడ్జెట్
తెలంగాణ 2025-26 వార్షిక బడ్జెట్ రూ.3,04,965 కోట్లతో ప్రవేశపెట్టారు. రెవెన్యూ వ్యయం రూ.2,26,982 కోట్లు, మూలధన వ్యయం రూ.36,504 కోట్లుగా పేర్కొన్నారు.
Wed, 19 Mar 202505:50 AM IST
సంక్షేమమే ధ్యేయం - ఆర్థిక మంత్రి భట్టి
రైజింగ్ తెలంగాణ నినాదంతో ముందుకెళ్తున్నామని భట్టి చెప్పారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తున్నామని తెలిపారు. మెడికల్ కాలేజీల నిర్మాణానికి భారీగా నిధులను కేటాయిస్తున్నామని వివరించారు. సంక్షేమం, అభివృద్ధిని వేగంగా పరుగులు పెట్టేంచేలా అడుగులు వేస్తున్నామని తెలిపారు.
Wed, 19 Mar 202505:50 AM IST
పారదర్శకతతో బడ్జెట్ - భట్టి విక్రమార్క
శాసనసభ వేదికగా మూడో సారి ఆర్థిక మంత్రి భట్టి బడ్జెట్ ను ప్రవేశపెడుతున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… పారదర్శకత, జవాబుదారీతనంతో పద్దును ప్రవేశపెడుతున్నట్లు భట్టి వివరించారు.
Wed, 19 Mar 202505:39 AM IST
బడ్జెట్ ప్రసంగం మొదలు
శాసనసభలో భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రసంగం మొదలైంది. బడ్జెట్ కు సంబంధించిన వివరాలను చెబుతున్నారు.
Wed, 19 Mar 202505:36 AM IST
బీఆర్ఎస్ సభ్యుల ఆందోళన
బడ్జెట్ ప్రవేశపెట్టే వేళ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆందోళనకు దిగారు. ఎండిపోయిన పంటలపై నిరసనకు దిగారు. ఎండిపోయిన పైరుతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. కాలం తెచ్చిన కరువు కాదని… కాంగ్రెస్ తీసుకొచ్చిన కరువు అని విమర్శలు గుప్పించారు.
Wed, 19 Mar 202505:32 AM IST
సీఎం చేతికి పద్దు..
బడ్జెట్ ప్రతిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆర్థిక మంత్రి భట్టి అందించారు. ఆర్థిక శాఖ అధికారులతో పాటు పలువురు మంత్రులు భట్టి వెంట ఉన్నారు.
Wed, 19 Mar 202505:22 AM IST
మరికాసేపట్లో సభ ముందుకు బడ్జెట్
మరికాసేపట్లో అసెంబ్లీ ముందుకు బడ్జెట్ రానుంది. శాసనసభలో ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క, మండలిలో శ్రీధర్ బాబు పద్దును ప్రవేశపెట్టనున్నారు.
Wed, 19 Mar 202504:59 AM IST
బడ్జెట్ కు కేబినెట్ ఆమోదముద్ర
తెలంగాణ వార్షిక బడ్జెట్ 2025-26కి కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ఉదయం 11.06 గంటలకు అసెంబ్లీలో బడ్జెట్ ను ప్రవేశ పెట్టనున్నారు.
Wed, 19 Mar 202504:52 AM IST
కేసీఆర్ దూరం….?
ఈసారి బడ్జెట్ సమావేశానికి ప్రతిపక్ష నేత కేసీఆర్ దూరంగా ఉండనున్నట్లు సమాచారం. ఈసారి గవర్నర్ ప్రసంగం రోజు సభకు వచ్చిన కేసీఆర్.. బడ్జెట్ ప్రసంగంతో పాటు చర్చలకు దూరంగా ఉంటారని తెలుస్తోంది.
Wed, 19 Mar 202504:38 AM IST
ఈసారి బడ్జెట్ ఎంతంటే…?
ఈసారి రూ. 3.20 లక్షల కోట్లతో బడ్జెట్ ఉండే ఛాన్స్ ఉంది. శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెడుతున్న సందర్భంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు అసెంబ్లీ హాల్లో శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రెడ్డి, సీతక్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి తదితరులు అభినందనలు తెలిపారు.
Wed, 19 Mar 202504:30 AM IST
అసెంబ్లీకి చేరుకున్న భట్టి
బడ్జెట్ ప్రతులతో ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క అసెంబ్లీకి చేరుకున్నారు.
Wed, 19 Mar 202504:30 AM IST
కేబినెట్ భేటీ
బడ్జెట్ కు ముందు అసెంబ్లీ కమిటీ హాల్ లో తెలంగాణ క్యాబినెట్ సమావేశమైంది. బడ్జెట్ కు ఆమోదం తెలపనుంది.
Wed, 19 Mar 202504:18 AM IST
కీలక ప్రాజెక్టులకు నిధులు…!
ఫ్యూచర్ సిటీ, మెట్రో రైలు,మూసీ రివర్ డెవలప్ మెంట్ ప్రాజెక్టు,త్రిపుల్ ఆర్ కు బడ్జెట్ లో నిధులు కేటాయించే అవకాశం ఉంది. గతేడాదితో పొల్చితే పది నుంచి 15 శాతం ఎక్కువ ఉండే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.
Wed, 19 Mar 202504:18 AM IST
పూర్తిస్థాయి బడ్జెట్…
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి సారి పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది. ఇరిగేషన్,ఆరు గ్యారంటీలకు నిధులు కేటాయించే అవకాశం ఉంది.
Wed, 19 Mar 202504:30 AM IST
ఇవాళ బడ్జెట్
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఇవాళ బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. శాసనసభలో ఉముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మండలిలో శ్రీధర్ బాబు ప్రవేశపెట్టనున్నారు.