ఈగల్ టీమ్ ఆపరేషన్ - జీడిమెట్లలో రూ.72 కోట్ల విలువైన ఎఫెడ్రిన్ డ్రగ్స్ పట్టివేత-telangana anti narcotics wing seizes rs 72 crore worth of ephedrine four arrested ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  ఈగల్ టీమ్ ఆపరేషన్ - జీడిమెట్లలో రూ.72 కోట్ల విలువైన ఎఫెడ్రిన్ డ్రగ్స్ పట్టివేత

ఈగల్ టీమ్ ఆపరేషన్ - జీడిమెట్లలో రూ.72 కోట్ల విలువైన ఎఫెడ్రిన్ డ్రగ్స్ పట్టివేత

హైదరాబాద్ నగరంలో భారీ మొత్తంలో మాదకద్రవ్యాలు దొరికాయి. జీడిమెట్లలో రూ.72 కోట్ల విలువైన ఎఫెడ్రిన్ ను చేసుకున్నారు. ఈ కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు.

ఎఫెడ్రిన్ స్వాధీనం

హైదరాబాద్ నగరంలో భారీగా మాదకద్రవ్యాలు పట్టుబడ్డాయి. ఈగల్ టీమ్ పోలీసులు చేపట్టిన సోదాల్లో భారీగా(220 కేజీలు) ఎఫ్రిడిన్ పట్టుబడింది. దీని విలువు రూ. 72 కోట్లుగా ఉంటుందని పోలీసులు తెలిపారు.

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం…. మాదకద్రవ్యాల తయారీలో ప్రధాన నిందితుడిగా శివరామకృష్ణ ఉన్నట్లు గుర్తించారు. ఇతనిది ఏపీలోని కాకినాడ కాగా… మరికొందరితో కలిసి ఈ దందా చేస్తున్నట్లు తేలింది. ప్రస్తుతం ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నాడు.

ఇక ఎఫెడ్రిన్ తయారీకి బిగ్ స్కేల్ కెమికల్ యూనిట్ వినియోగంచినట్లు గుర్తించారు. డ్రగ్ తయారీకి వాడిన ఫార్ములా సైతం స్వాధీనం చేసుకున్నారు. ఇందుకోసం బొల్లారంలో ఉపయోగించిన యూనిట్ కూడా సీజ్ చేశారు.ఈ కేసులోని ప్రధాన నిందితుడిపై 2017, 2019 సంవత్సరాల్లో కూడా నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) కేసులు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు బయటపడింది.

2024 డిసెంబరులో ప్రధాన నిందితుడు… ఈ డ్రగ్ ను తయారు చేయడానికి ఒక ఫార్ములాను అందించాడు. ముడి పదార్థాలను కూడా సరఫరా చేశాడు. ఆన్ లైన్ మరియు బ్యాంకు లావాదేవీల ద్వారా రూ .8 లక్షలను బదిలీ చేశాడు. ఆ మొత్తాన్ని ఉపయోగించి… ఈ కేసులో ఇతరులు అదనపు పదార్థాలను కొనుగోలు చేశారు. మూడు దశల ప్రాసెసింగ్ తరువాత… తుది ఉత్పత్తిగా మార్కెట్ లోకి తీసుకువస్తున్నారు. ఈ సోదాల్లో సుమారు 220 కిలోల ఎఫెడ్రిన్ సరఫరాకు సిద్ధంగా ఈగిల్ పోలీసులు ప్రకటించారు. ఈ కేసులో నలుగురిని అరెస్ట్ చేయగా.. ప్రధాన నిందితుడి కోసం గాలిస్తున్నారు.

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం