November 24 Telugu News Updates: మల్లారెడ్డి ఆస్తులపై ఐటీ సోదాలు.. రూ.15 కోట్లు స్వాధీనం
తెలంగాణ, ఏపీ వార్తల కోసం ఈ పేజీని ఫాలో అవ్వండి. తాజా వార్తల కోసం రిఫ్రెష్ చేస్తూ ఉండండి.
Thu, 24 Nov 202202:20 PM IST
మల్లారెడ్డి ఆస్తులపై ఐటీ సోదాలు.. రూ.15 కోట్లు స్వాధీనం
మంత్రి మల్లారెడ్డి ఆస్తులపై ఐటీ శాఖ తనిఖీలు ముగిశాయి. కీలక పలు పత్రాలు, నగదును స్వాధీనం చేసుకున్నారు. మంత్రితోపాటుగా ఆయన బంధువులకు సమన్లు జారీ చేశారు. ఈ నెల 28, 29 తేదీల్లో హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశాలు వెళ్లాయి. మల్లారెడ్డికి సంబంధించి రూ.15 కోట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
Thu, 24 Nov 202201:46 PM IST
డిసెంబర్‌లో శాసనసభ సమావేశాలు
తెలంగాణ ఆర్థికపరిస్థితులు, కేంద్రం విధిస్తున్న ఆంక్షలపై చర్చించేందుకు డిసెంబర్లో శాసనసభ సమావేశాన్ని నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. వారం రోజులపాటు సమావేశాలు జరగనున్నాయి. దీనికి సంబంధించి.. చర్యలు తీసుకోవాలని మంత్రులు హరీశ్ రావు, ప్రశాంత్ రెడ్డిని కేసీఆర్ ఆదేశించారు.
Thu, 24 Nov 202212:40 PM IST
ఎమ్మెల్యేలకు ఎర కేసులో నిందితుల కస్టడీ పిటిషన్ కొట్టివేత
ఎమ్మెల్యేలకు ఎర కేసులో నిందితుల కస్టడీ పిటిషన్ ను అనిశా కోర్టు కొట్టివేసింది. ముగ్గురు నిందితులను ఇప్పటికే రెండురోజుల కస్టడీకి అనుమతించామని.. మరోసారి కస్టడీకి ఇవ్వడం కుదరదని తేల్చిచెప్పింది.
Thu, 24 Nov 202211:56 AM IST
ఆన్ లైన్ లో బ్రేక్ దర్శనం టికెట్స్
యాదాద్రి శ్రీలక్ష్మి నరసింహ స్వామి దేవాలయంలో బ్రేక్ దర్శనల టికెట్స్ ఆన్ లైన్ ఇవ్వనున్నారు. ఈ సౌకర్యం వినియోగించుకొ కోవాలని ఆలయ అధికారులు విజ్ఞప్తి చేశారు.
Thu, 24 Nov 202210:39 AM IST
టీపీసీసీ నిరసన
రాష్ట్ర వ్యాప్తంగా వ్యయసాయ, భూమి అంశాలపై టీపీసీసీ ఆధ్వర్యంలో మండల కేంద్రాలలో ధర్నాలు. 21న సీఎస్ ను కలిసి భూమి సంబంధ అంశాలపై సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వినతిపత్రాలను టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సమర్పించింది. 24న అన్ని మండల కేంద్రాలలో ధర్నాలకు పిలుపునిచ్చింది టీపీసీసీ. 30న నియోజకవర్గ లలో ధర్నాలకు పిలుపునిచ్చింది.
Thu, 24 Nov 202206:26 AM IST
గ్రీన్ సిగ్నల్…..
అంగన్వాడీ సూపర్‌వైజర్ పోస్టుల భర్తీకి అడ్డంకులు తొలగిపోయాయి. పోస్టుల భర్తీకి ఏపీ హైకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. నిబంధనల ప్రకారం పోస్టులు భర్తీ చేయట్లేదంటూ.. నియామక ప్రక్రియలో అవకతవకలు జరిగాయంటూ గతంలో కొంతమంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు... గతంలో స్టే ఇచ్చింది. తాజాగా ఆ స్టేను ఎత్తివేస్తింది. నిబంధనల ప్రకారం పోస్టుల భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఫలితంగా 560 ఉద్యోగాల భర్తీ కానున్నాయి.
Thu, 24 Nov 202205:46 AM IST
సీబీఐకి కేసు…
నెల్లూరు కోర్టులో జరిగిన చోరీ కేసును సీబీఐకి అప్పగించింది ఏపీ హైకోర్టు. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పి.కె.మిశ్రా ఆదేశాలు జారీచేశారు.
Thu, 24 Nov 202205:45 AM IST
ఐటీ నోటీసులు…
రాష్ట్ర కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి(Minister Mallareddy)కి సంబంధించి.. రెండు రోజులుగా ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు. మంగళవారం ఉదయం నుంచి జరుగుతున్న సోదాలు... ఇవాళ ఉదయం ముగిశాయి.మంత్రి మల్లారెడ్డితోపాటుగా ఆయన కుమారులు, బంధువులు ఇళ్లు, కార్యాలయాల్లో అధికారులు ఏకధాటిగా తనిఖీలు జరిగాయి. మల్లారెడ్డి సోదరుడు గోపాల్‌రెడ్డి, అల్లుడు మర్రి రాజశేఖర్‌రెడ్డి, వియ్యంకుడు మర్రి లక్ష్మారెడ్డి ఇళ్లలోనూ విస్తృతంగా రైడ్స్ చేపట్టారు. మరో వైపు ఆయనకు ఐటీ నోటీసులు కూడా ఇచ్చింది.
Thu, 24 Nov 202204:29 AM IST
కొత్త నియమాకాలు…
వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వైసీపీ పావులు కదుపుతోంది. ఇప్పటికే 175 సీట్లే లక్ష్యమంటూ ముందుకెళ్తోంది. నియోజకవర్గాల నేతలతో స్వయంగా ఆ పార్టీ అధినేత జగన్ సమావేశాలు నిర్వహిస్తున్నారు. చేసిన కార్యక్రమాలు, చేయాల్సిన పనులపై దిశానిర్దేశం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకున్నారు వైఎస్ జగన్. రీజనల్ కో ఆర్డినేటర్ నియామకంలో మార్పులు చేసింది.. కొంత మందిని తప్పించి వారి స్థానంలో కొత్త వారికి అవకాశం కల్పించారు.
శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాలకు రీజినల్ కోఆర్డినేటర్‌గా మంత్రి బొత్స సత్యనారాయణను నియమించింది. ఇక విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాలకు వైవీ సుబ్బారెడ్డిని... తూర్పు గోదావరి, డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాలకు రీజినల్ కోఆర్డినేటర్లుగా పిల్లి సుభాష్ చంద్రబోస్ ,మిథున్ రెడ్డి పేర్లను ప్రకటించింది. కృష్ణ, ఎన్టీఆర్ జిల్లా, గుంటూరు జిల్లాలకు రీజినల్ కోఆర్డినేటర్లుగా మర్రి రాజశేఖర్ రెడ్డి, ఆళ్ల అయోధ్య రామిరెడ్డిని నియమించింది.
Thu, 24 Nov 202202:23 AM IST
పరీక్షల ఫీజు వివరాలు..
వచ్చే ఏడాది జరిగే పదో తరగతి పరీక్షలకు సంబంధించి కీలక అప్డేట్ ఇచ్చింది ఏపీ ప్రభుత్వం. ఈ మేరకు పరీక్షల ఫీజు తేదీలను వెల్లడించింది. ఈ నెల 25 నుండి డిసెంబర్ 10వ తేదీ లోగా చెల్లించాలని ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ డి.దేవానందరెడ్డి పేర్కొన్నారు. ఈ పరీక్షకు సంబంధించి ఒక్కో విద్యార్థి 125 రూపాయలు చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. నిర్దేశించిన గడువులోగా ప్రధానోపాధ్యాయులు పరీక్షల విభాగానికి జమ చేయాలని సూచించారు.
Thu, 24 Nov 202201:56 AM IST
ముగిసిన సోదాలు..
మంత్రి మల్లారెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు ముగిశాయి. రెండు రోజుల పాటు జరిగిన సోదాల్లో దాదాపు రూ. 10 కోట్ల వరకు స్వాధీనం చేసుకుంది.
Thu, 24 Nov 202201:49 AM IST
ముసాయిదా విడుదల…
ఏపీలో పట్టభద్రులు- ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కసరత్తు వేగవంతం చేస్తోంది ఎన్నికల సంఘం. 2023 మార్చి 29 తేదీతో 5గురు ఎమ్మెల్సీల పదవీ కాలం ముగుస్తుండటంతో ఓటర్ల నమోదు ప్రక్రియకు ఇప్పటికే షెడ్యూల్ జారీ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం ఎమ్మెల్సీ ఎన్నికల ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల చేసింది.
Thu, 24 Nov 202201:20 AM IST
పదోన్నతి..
ఏపీలో పని చేస్తున్న 20 మంది అదనపు ఎస్పీలకు ఎస్పీలుగా ప్రభుత్వం పదోన్నతి కల్పించింది. ఇటీవల ప్రభుత్వం 20 మంది పోలీసు అధికారులకు నాన్ క్యాడర్ ఐపీఎస్‌లుగా పదోన్నతి కల్పిస్తూ ప్యానల్‌ను ఆమోదించింది. వారికి నాన్ క్యాడర్ ఎస్పీలుగా పోస్టింగులు ఇవ్వడంతోపాటు మరో ఎస్పీని బదిలీ చేస్తూ హోం శాఖ ముఖ్య కార్యదర్శి హరీశ్ కుమార్‌గుప్తా బుధవారం ఉత్తర్వులిచ్చారు.
Thu, 24 Nov 202201:18 AM IST
గుడ్ న్యూస్…
TSRTC Latest News: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని విద్యార్థులకు తెలంగాణ ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. గ్రేటర్ హైదరాబాద్ బస్ పాస్ తో ఇక నుంచి పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్ గా నడిచే పల్లె వెలుగు సర్వీసుల్లో ప్రయాణించవచ్చు. ఈ మేరకు ఆర్టీసీ ఆదేశాలు జారీ చేసింది. విద్యార్థుల రద్దీ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్టీసీ యాజమాన్యం వెల్లడించింది. ఈ అవకాశాన్ని విద్యార్థులందరూ ఉపయోగించుకోవాలని ఓ ప్రకటనలో కోరారు.
Thu, 24 Nov 202201:18 AM IST
దర్యాప్తు సంస్థల దూకుడు…
Raids in Telangana: ఈడీ... ఐటీ రైడ్స్.... ప్రస్తుతం తెలంగాణలో ఎటుచూసిన ఇదే డిస్కషన్..! ఓవైపు బీజేపీ నేతలే టార్గెట్ గా సిట్ ముందుకెళ్తుండగా... ఇదే సమయంలో ఐటీ, ఈడీలు ఓ రేంజ్ లో ఎంట్రీ ఇచ్చేశాయి. అధికార పార్టీ నేతలే టార్గెట్ గా దాడులు జరుగుతున్నాయి. మంత్రులతో మొదలైన ఈ రైడ్స్... ఎక్కడి వరకు చేరుతాయో అర్థం కావటం లేదు. మరోవైపు ఎమ్మెల్యేల ఎర కేసులో సిట్ కూడా దూసుకెళ్తోంది. ఏ ఒక్కర్నీ వదిలే ప్రస్తక్తే లేదన్నట్లు సీన్ క్లియర్ కట్ గా కనిపిస్తోంది. హైదరాబాద్ సెంటర్ గా జరుగుతున్న ఈ సోదాలు.. ఏటువైపు వెళ్తాయి...? ఫలితంగా ఏం జరగబోతుందనేది చర్చనీయాంశంగా మారింది. మరోవవైపు జీఎస్టీ సోదాలు కూడా తెరపైకి వస్తున్నాయి. వీటిపై టీఆర్ఎస్, బీజేపీ నేతలు ఓ క్లారితో స్పందిస్తూంటే... కాంగ్రెస్ వాదన మరోలా ఉంది.