Telangana ACB : 2024లో తెలంగాణ ఏసీబీ రికార్డ్.. 170 మంది అవినీతి అధికారుల అరెస్టు!-telangana acb arrested 170 corrupt officials in the year 2024 ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Telangana Acb : 2024లో తెలంగాణ ఏసీబీ రికార్డ్.. 170 మంది అవినీతి అధికారుల అరెస్టు!

Telangana ACB : 2024లో తెలంగాణ ఏసీబీ రికార్డ్.. 170 మంది అవినీతి అధికారుల అరెస్టు!

Basani Shiva Kumar HT Telugu
Dec 30, 2024 11:14 AM IST

Telangana ACB : అవినీతి అధికారులకు తెలంగాణ ఏసీబీ చుక్కలు చూపిస్తోంది. 2024 సంవత్సరంలో ఏకంగా 170 మంది లంచగొండి అధికారులను అరెస్టు చేసి రికార్డ్ సృష్టించింది. ముఖ్యంగా 5 శాఖల్లో ఎక్కువ అవినీతి జరిగింది. అరెస్టు అయిన అధికారుల్లో ఎక్కువమంది పోలీస్, రెవెన్యూ, పంచాయతీ రాజ్ శాఖల వారే ఉన్నారు.

తెలంగాణ ఏసీబీ
తెలంగాణ ఏసీబీ

తెలంగాణ ఏసీబీ.. అవినీతి అధికారుల ఆటకట్టిస్తోంది. 2024 ఏడాదిలో వివిధ ప్రభుత్వ శాఖల్లో లంచాలకు మరిగిన సుమారు 170 మంది అధికారులను అరెస్టు చేసింది. ముఖ్యంగా రెవెన్యూ, పోలీస్, పంచాయతీ రాజ్, స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖల్లో ఎక్కువమంది అధికారులు అవినీతికి పాల్పడ్డారు. ఏసీబీ అరెస్టు చేసిన వారిలో ఈ శాఖ అధికారులే ఎక్కువగా ఉన్నారు.

yearly horoscope entry point

ఏ శాఖలో ఎంతమంది..

పోలీస్ శాఖలో కానిస్టేబుల్ స్థాయి నుంచి డీఎస్పీ ర్యాంకు అధికారుల వరకు 31 లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. రెవెన్యూ శాఖలో 19 మంది అధికారులు ఏసీబీకి చిక్కారు. రిజిస్ట్రేషన్ శాఖలో 13 మంది, పంచాయతీ రాజ్ శాఖలో 24 మంది అధికారులు లంచాలు తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. కేవలం ఈ 4 శాఖల నుంచే 87 మందిని ఏసీబీ అరెస్టు చేసింది.

ప్రధాన కేసులు..

1.కుషాయిగూడ పోలీస్ ఇన్‌స్పెక్టర్, సబ్ ఇన్‌స్పెక్టర్ ఓ కేసును మూసివేయడానికి రూ.3 లక్షలు తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు.

2.హైదరాబాద్ సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ రూ.15 లక్షలు డిమాండ్ చేశారు. అప్పటికే రూ.5 లక్షలు తీసుకున్నారు. ఆ తర్వాత రూ.3 లక్షలు తీసుకుంటూ పట్టుబడ్డారు.

3.సంగారెడ్డి ఇన్‌స్పెక్టర్ రూ.1.5 కోట్లు డిమాండ్ చేసి.. రూ.5 లక్షలు తీసుకుంటూ పట్టుబడ్డాడు.

4.షామీర్‌పేట తహసీల్దార్ రూ.20 లక్షలు డిమాండ్ చేసి.. రూ.10 లక్షల లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు.

అక్రమాస్తులు..

1.హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ వద్ద రూ.250 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు, వాటిలో 214 ఎకరాల భూమి, 29 ప్లాట్లు, బ్రాండెడ్ వాచీలు, ఐఫోన్లు వంటి ఖరీదైన వస్తువులు ఉన్నాయి.

2.నీటిపారుదల శాఖలో ఒక అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వద్ద రూ.100 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు.

3.హైదరాబాద్ సీసీఎస్ ఏసీపీ వద్ద రూ.3.95 కోట్ల విలువైన అక్రమ ఆస్తులు ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. పలు కేసుల్లో మొత్తం 12 మంది అధికారులను దోషులుగా నిర్ధారించి.. 1 నుంచి 4 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించారు.

Whats_app_banner