TG SSC Exams Fee 2025 : తెలంగాణ పదో తరగతి పరీక్షల ఫీజు చెల్లింపు షెడ్యూల్ విడుదల - ముఖ్య తేదీలివే-telangana 10th class annual examination fee payment dates 2024 finalised key dates check here ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tg Ssc Exams Fee 2025 : తెలంగాణ పదో తరగతి పరీక్షల ఫీజు చెల్లింపు షెడ్యూల్ విడుదల - ముఖ్య తేదీలివే

TG SSC Exams Fee 2025 : తెలంగాణ పదో తరగతి పరీక్షల ఫీజు చెల్లింపు షెడ్యూల్ విడుదల - ముఖ్య తేదీలివే

Maheshwaram Mahendra Chary HT Telugu
Nov 08, 2024 07:38 PM IST

తెలంగాణ పదో తరగతి విద్యార్థులకు కీలక అప్డేట్ వచ్చేసింది. పబ్లిక్‌ పరీక్షల ఫీజు చెల్లించేందుకు షెడ్యూల్ విడుదలైంది. ఎలాంటి రుసుం లేకుండా నవంబర్ 18వ తేదీ వరకు వరకు ఫీజు చెల్లించుకునే అవకాశం కల్పించారు. రూ. 500 ఆలస్య రుసుంతో డిసెంబర్‌ 21 వరకు చెల్లించుకోవచ్చని ప్రకటనలో పేర్కొన్నారు.

తెలంగాణ పదో తరగతి పరీక్షల ఫీజు చెల్లింపు తేదీలు
తెలంగాణ పదో తరగతి పరీక్షల ఫీజు చెల్లింపు తేదీలు

తెలంగాణ పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు షెడ్యూల్ వచ్చేసింది. ఈ మేరకు ప్రభుత్వ పరీక్షల విభాగం ప్రకటన విడుదల చేసింది. ఈ ఏడాది టెన్త్ చదువుతున్న విద్యార్థులతో పాటు బ్యాక్ లాగ్ ఉన్న విద్యార్థులు ఎలాంటి ఆలస్య రుసుం లేకుండా నవంబర్ 18వ తేదీ వరకు చెల్లించుకోవచ్చు.

నిర్దేశించిన గడువు దాటితే… రూ.50 ఆలస్య రుసుంతో డిసెంబర్‌ 2 వరకు ఫీజు చెల్లించుకోవచ్చని ప్రకటనలో పేర్కొన్నారు. రూ. 200 ఆలస్య రుసుంతో డిసెంబర్‌ 12 వరకు ఫీజు చెల్లించవచ్చు. ఇక రూ. 500 ఆలస్య రుసుంతో డిసెంబర్‌ 21 వరకు చెల్లించుకునే అవకాశం ఉంటుంది. పాఠశాల హెడ్ మాస్టర్ ను కలిసి ఫీజు చెల్లించవచ్చు.

రెగ్యూలర్ విద్యార్థులు అన్ని పేపర్లకు కలిపి రూ. 125 ఫీజు చెల్లించాలి. మూడు పేపర్ల లోపు ఉంటే రూ. 110గా చెల్లించాలి. మూడు పేపర్ల కంటే ఎక్కువ బ్యాక్ లాగ్స్ ఉన్న విద్యార్థులు రూ. 125 చెల్లించాలని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. ఒకేషనల్ విద్యార్థులు అదనంగా రూ. 60 చెల్లించాలి. https://www.bse.telangana.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.

ఏపీ టెన్త్ పరీక్షల ఫీజు షెడ్యూల్:

ఆంధ్రప్రదేశ్ పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు షెడ్యూల్ వచ్చేసింది. ఈ మేరకు ప్రభుత్వ పరీక్షల విభాగం నోటిఫికేషన్‌ జారీ చేసింది. నవంబర్ 11వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు.

నిర్ణయించిన తేదీలలోపు కట్టకపోతే… ఆలస్య రుసుం చెల్లించాల్సి ఉంటుంది.నవంబర్ 12వ తేదీ నుంచి నవంబరు 18వ తేదీల్లో చెల్లిస్తే… రూ.50 అదనంగా కట్టాలి. ఇక నవంబర్ 19 నుంచి 25వ తేదీల్లో చెల్లిస్తే… రూ.200 అదనపు రుసుం చెల్లించాలి. నవంబర్ 26 నుంచి నవంబరు 30 వరకు రూ.500 ఆలస్య రుసుము చెల్లించాలి.

ఈ ఫీజును ఆన్ లైన్ విధానంలోనే చెల్లించాల్సి ఉంటుందని ప్రభుత్వ పరీక్షల విభాగం స్పష్టం చేసింది. పాఠశాల లాగిన్‌ ద్వారా ప్రధానోపాధ్యాయులూ కూడా చెల్లించవచ్చు.

  • ఏపీ టెన్త్ పబ్లిక్ పరీక్షల ఫీజు చెల్లింపు ప్రారంభం - 28 అక్టోబర్ 2024.
  • ఫీజు చెల్లింపునకు తుది గడువు - 11 నవంబర్ 2024.
  • ఆలస్య రుసుంతో నవంబర్ 12 - 18 - రూ. 50 అదనంగా చెల్లించాలి.
  • నవంబర్ 19 నుంచి 25 - రూ.200 అదనపు రుసుం చెల్లించాలి.
  • నవంబర్ 26 నుంచి నవంబరు 30 వరకు - రూ.500 ఆలస్య రుసుము చెల్లించాలి.
  • అధికారిక వెబ్ సైట్ - https://bse.ap.gov.in/

ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి రెగ్యులర్‌ విద్యార్థులు రూ.125 చెల్లించాల్సి ఉంటుంది. ఇక సప్లిమెంటరీ అభ్యర్థులు అయితే… 3 పేపర్ల వరకు రూ.110 కట్టాలి. అంతకంటే ఎక్కువ ఉంటే రూ.125గా నిర్ణయించారు. ఇక వయసు తక్కువగా ఉండి ఎగ్జామ్స్ కు హాజరయ్యే వారు రూ.300 చెల్లించాల్సి ఉంటుంది.

Whats_app_banner

సంబంధిత కథనం