TS Constable Key 2022: కానిస్టేబుల్ 'కీ' విడుదల.. 5 మార్కులు కలిపే ఛాన్స్!-telanagana police constable answer key 2022 released heres direct link ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Telanagana Police Constable Answer Key 2022 Released Heres Direct Link

TS Constable Key 2022: కానిస్టేబుల్ 'కీ' విడుదల.. 5 మార్కులు కలిపే ఛాన్స్!

Mahendra Maheshwaram HT Telugu
Aug 31, 2022 07:38 AM IST

ts police constable answer key 2022: కానిస్టేబుల్ పరీక్ష ప్రిలిమినరీ 'కీ' వచ్చేసింది. ఈ మేరకు అధికారిక వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచారు. అభ్యంతరాలను తగిన ఫార్మాట్​లో పంపాలని అభ్యర్థులకు సూచించారు. మొత్తం 6,61,198 మంది దరఖాస్తుదారులకుగాను 6,03,955 మంది పరీక్షకు హాజరయ్యారు.

తెలంగాణ పోలీసు కానిస్టేబుల్ కీ విడుదల
తెలంగాణ పోలీసు కానిస్టేబుల్ కీ విడుదల (TSLPRB)

Telangana State Level Police Recruitment Board: తెలంగాణ కానిస్టేబుల్ రాతపరీక్ష ప్రాథమిక పరీక్ష 'కీ' విడుదలైంది. కీ పేపర్​పై అభ్యంతరాలుంటే తగిన ఆధారాలతో వెబ్ సైట్‌లో అప్ లోడ్ చేయాలని పోలీస్ నియామక మండలి బోర్డు స్పష్టం చేసింది. 15 వేల 644 పోలీస్ కానిస్టేబుల్, 614 ఆబ్కారీ, రవాణా శాఖలోని 63 కానిస్టేబుళ్లకు ఈ నెల 28న రాత పరీక్ష నిర్వహించగా... 6,03,955 మంది పరీక్షకు హాజరైన సంగతి తెలిసిందే.

ట్రెండింగ్ వార్తలు

కీ ఇలా చెక్ చేసుకోండి.

ts police constable answer key link 2022: అభ్యర్థులు మొదటగా tslprb.in వెబ్ సైట్ లోకి వెళ్లాలి.

‘PWT Preliminary Key’ అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి.

మీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేస్తే 'కీ' డిస్ ప్లే అవుతుంది.

డౌన్లోడ్ ఆప్షన్ పై క్లిక్ చేసి 'కీ' ని పొందవచ్చు.

ఇలా పంపండి....

telangana police constable answer key: కానిస్టేబుల్ కీ లో ఏవైనా అభ్యంతరాలుంటే బుధవారం ఉదయం 8 గంటల నుంచి సెప్టెంబరు 2 సాయంత్రం 5 గంటల్లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని నియామక మండలి స్పష్టం చేసింది. ప్రతీ అభ్యంతరానికి ప్రత్యేక వెబ్‌ టెంప్లెట్‌ ద్వారా దరఖాస్తు చేయడం తప్పనిసరి అని పేర్కొంది. మాన్యువల్‌గా చేసే దరఖాస్తులు చెల్లుబాటు కావు. ఈ అభ్యంతరాలు పరిగణనలోకి తీసుకుంటే.. కొన్ని మార్కులు కలిపే అవకాశం ఉంటుంది.

లింక్ పై క్లిక్ చేసి అభ్యర్థులు అభ్యంతరాలు పంపవచ్చు.

telanagana police constable exam: ఇక కానిస్టేబుల్‌ స్థాయి ప్రాథమిక పరీక్షలో మాత్రం ఎలాంటి ప్రశ్నల తొలగింపు జరగలేదు. అయితే సరైన సమాధానాలతో సంబంధం లేకుండా అభ్యర్థులందరికీ రెండు మార్కులు మాత్రం కలవనున్నాయి. ఉదాహరణకు ‘ఎ’ బుక్‌లెట్‌లో 56వ, 129వ ప్రశ్నలకు నాలుగు ఆప్షన్లు సరైన సమాధానాలే. అభ్యర్థులు ఏ ఆప్షన్‌పై టిక్‌ చేసినా మార్కు వచ్చినట్లే. అలాగే ఆ రెండు ప్రశ్నల్ని వదిలేసినా మార్కు ఉన్నట్లే లెక్క. మరో మూడు ప్రశ్నలను వదిలేసినా మార్కుల్ని కలపనున్నారు. ఉదాహరణకు ‘ఎ’ బుక్‌లెట్‌లో 68వ ప్రశ్నకు ఆప్షన్‌ ‘4’.. 76వ ప్రశ్నకు ఆప్షన్‌ ‘4’.. 158వ ప్రశ్నకు ఆప్షన్లు ‘1’, ‘3’ సరైన సమాధానాలు. ఆయా ప్రశ్నలకు ఆ ఆప్షన్లను గుర్తించిన వారికి మార్కులిస్తారు. అలాగే ఆ మూడు ప్రశ్నల్ని గుర్తించని వారికీ మార్కులు కలపనున్నారు. ఇదే విషయాన్ని కీ చివర్లో పరోక్షంగా పేర్కొన్నారు.

ఆగస్టు 28వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా జరిగిన కానిస్టేబుల్ పరీక్షకు.. 91.34 శాతం అభ్యర్థులు హాజరయ్యారు. 6,61,198 మంది పరీక్షకు దరఖాస్తు చేసుకోగా.. 6,03,955 మంది పరీక్షకు హాజరయ్యారు.

WhatsApp channel