August 21 Telugu News Updates : తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం వస్తుంది- అమిత్ షా
- Amit Shah Munugode visit : ఇవాళ మునుగోడులో బీజేపీ భారీ బహిరంగ సభను తలపెట్టింది. ఇందుకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అమిత్ షా తెలంగాణ పర్యటన లైవ్ అప్డేట్స్ కోసం ఇక్కడ చూడండి.
Sun, 21 Aug 202201:32 PM IST
'తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం వస్తుంది'
తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం వస్తుందని కేంద్ర మంత్రి అమిత్‌షా జోస్యం చెప్పారు. కేసీఆర్ పాలనలో ప్రజలు మోసపోయారని మండిపడ్డారు.
Sun, 21 Aug 202201:27 PM IST
'రాజగోపాల్ రెడ్డిని గెలిపించండి'
మునుగోడులో జరిగిన బీజేపీ బహిరంగ సభలో ప్రసంగించారు కేంద్ర మంత్రి అమిత్ షా. బీజేపీ తీర్థం పుచ్చుకున్న రాజగోపాల్ రెడ్డిని.. ప్రజలు గెలిపించాలని పిలుపునిచ్చారు. రాజగోపాల్ రెడ్డిని గెలిపిస్తే.. కేసీఆర్ ప్రభత్వాన్ని కూకటివేళ్లతో పెకిలించినట్టు అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
Sun, 21 Aug 202212:41 PM IST
బీజేపీలోకి రాజగోపాల్ రెడ్డి
కాంగ్రెస్ మాజీ నేత రాజగోపాల్ రెడ్డి.. బీజేపీలోకి చేరారు. కేంద్రమంత్రి అమిత్ షా సమక్షంలో మునుగోడు బహిరంగ సభలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.
Sun, 21 Aug 202212:27 PM IST
మునుగోడుకు అమిత్ షా
మునుగోడు బహిరంగ సభకు చేరుకున్నారు కేంద్ర మంత్రి అమిత్ షా. మరికొద్ది సేపట్లో ప్రజలనుద్దేశించి ఆయన ప్రసంగించనున్నారు. కేసీఆర్, టీఆర్ఎస్పై ఆయన ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారన్నది ఆసక్తిగా మారింది.
ఇప్పటికే బహిరంగ సభకు వేలాది మంది ప్రజలు తరలివెళ్లారు. జనసందోహంతో ఆ ప్రాంతం కిటకిటలాడిపోతోంది.
Sun, 21 Aug 202211:15 AM IST
మునుగోడుకు అమిత్ షా
కేంద్ర మంత్రి అమిత్ షా.. మరికొద్ది సేపట్లో మునుగోడుకు చేరుకోనున్నారు. అక్కడ జరిగే బీజేపీ బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. ఇప్పటికే ఆ ప్రాంతంలో జన సందోహం నెలకొంది.
Sun, 21 Aug 202210:59 AM IST
ఉజ్జయిని ఆలయంలో అమిత్ షా..
ఉజ్జెయిని ఆలయంలో అమిత్ షా ఫొటోలు..
Sun, 21 Aug 202210:35 AM IST
బీజేపీ కార్యకర్త ఇంటికి..
ఉజ్జయిన ఆలయం నుంచి బీజేపీ కార్యకర్త సత్యనారాయణ నివాసానికి వెళ్లారు అమిత్ షా. సత్యనారాయణ కుటుంబసభ్యులతో ముచ్చటించారు. అక్కడే దాదాపు 30 నిమిషాల పాటు గడిపారు కేంద్రమంత్రి.
Sun, 21 Aug 202210:34 AM IST
ఉజ్జయిని ఆలయంలో ప్రత్యేక పూజలు
అమిత్ షా.. బేగంపేట్ నుంచి తొలుత సికింద్రాబాద్ ఉజ్జయిని ఆలయానికి వెళ్లారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
కేంద్రమంత్రి పర్యటన వేళ.. ఆలయం చుట్టూ భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు పోలీసులు.
Sun, 21 Aug 202210:26 AM IST
తెలంగాణకు అమిత్ షా
తెలంగాణలో అమిత్ షా పర్యటన ప్రారంభమైంది. ఢిల్లీ నుంచి విమానంలో బేగంపేట్ విమానాశ్రయానికి చేరుకున్నారు అమిత్ షా. ఆయనకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తో పాటు ఇతరులు ఘనస్వాగతం పలికారు.
Sun, 21 Aug 202208:06 AM IST
యాదాద్రిలో భక్తుల రద్దీ
యాదాద్రి భక్తుల రద్దీతో కిటకిటలాడుతోంది. ఇవాళ సెలవు దినం కావడంతో యాదాద్రికి భక్తజనం పోటెత్తారు. ఉచిత దర్శనానికి రెండు గంటలు, ప్రత్యేక దర్శనానికి గంట సమయం పడుతోంది.
Sun, 21 Aug 202205:53 AM IST
కొత్తగా 11,539 కేసులు
దేశంలో కొత్తగా 11,539 మందికి కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్ బారిన పడి 43 మంది కొవిడ్‌కు బలయ్యారు.
Sun, 21 Aug 202203:24 AM IST
రాజకీయాల్లో సినీ నటి త్రిష…?
సినీ నటి త్రిష రాజకీయ పార్టీలోకి వస్తున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు కాంగ్రెస్, బీజేపీ వారి పార్టీలో చేర్చుకునేందుకు గట్టిగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ వార్తలపై ఆమె నుంచి ఎలాంటి స్పందన రాలేదు.
Sun, 21 Aug 202203:23 AM IST
తగ్గిన వరద ఉద్ధృతి
శ్రీశైలం జలాశయానికి వరద ఉద్ధృతి తగ్గుముఖం పడుతోంది. దీంతో జలాశయం 5 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. శ్రీశైలం జలాశయం ఇన్‌ఫ్లో 2,18,386 క్యూసెక్కులుండగా.. ఔట్‌ఫ్లో 1,94,854 క్యూసెక్కులుగా ఉంది.
Sun, 21 Aug 202203:22 AM IST
యువకుడు దారుణ హత్య…
చాంద్రాయణగుట్టలో దారుణం జరిగింది. ఓ యువకుడిని గుర్తు తెలియని దుండగులు అతి దారుణంగా హత్యచేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Sun, 21 Aug 202202:43 AM IST
మునుగోడులో బీజేపీ సభ….
కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పార్టీలో చేరిక సందర్భంగా నేడు ‘మునుగోడు సమరభేరి’ పేరుతో బీజేపీ సభను తలపెట్టింది. దీనికి ఆ పార్టీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. మరోవైపు సభకు భారీ ఎత్తున జనాలను తరలించేందుకు పార్టీ నాయకత్వం ఏర్పాట్లు చేస్తోంది.
Sun, 21 Aug 202202:43 AM IST
నేటి నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియ…..
TS EAMCET Counseling తెలంగాణలో ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ ప్రక్రియ నేటి నుంచి ప్రారంభం కానుంది. ఈ ఏడాది మూడు విడతల్లో సీట్లు భర్తీ చేయనున్నారు. ఇవాళ్టి నుంచి ఈ నెల 29 వరకు ఆన్‌లైన్ కౌన్సెలింగ్ రుసుము చెల్లించి ధ్రువపత్రాల పరిశీలన కోసం స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.