Teacher Misbehaviour : ఆధార్ కార్డు వెరిఫికేషన్ అంటూ గదిలోకి పిలిచాడు.. తర్వాత-teacher booked under pocso act for misbehaviour with girl student in mulugu ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Teacher Booked Under Pocso Act For Misbehaviour With Girl Student In Mulugu

Teacher Misbehaviour : ఆధార్ కార్డు వెరిఫికేషన్ అంటూ గదిలోకి పిలిచాడు.. తర్వాత

HT Telugu Desk HT Telugu
Nov 30, 2022 08:31 PM IST

Mulugu District News : విద్యార్థులకు పాఠాలు చెప్పాల్సిన ఓ గురువే విద్యార్థినితో తప్పుగా ప్రవర్తించాడు. మంచి ఏంటో.. చెడు ఏంటో చెప్పి ముందుకు నడిపించాల్సిన ఉపాధ్యాయుడు అసభ్యంగా ఉన్నాడు.

విద్యార్థినితో ఉపాధ్యాయుడి అసభ్య ప్రవర్తన
విద్యార్థినితో ఉపాధ్యాయుడి అసభ్య ప్రవర్తన (HT_PRINT)

ఉపాధ్యాయుడు.. పిల్లల భవిష్యత్ కోసం దారి చూపించాలి. కానీ ఓ ఉపాధ్యాయుడు(Teacher) మాత్రం విద్యార్థిని జీవితాన్ని అంధకారంలోకి నెట్టేందుకు ప్రయత్నించాడు. గదిలో తప్పుగా ప్రవర్తించాడు. ఈ విషయం బయటకు తెలిసి.. ఇప్పుడు అందరి ముందు తల కిందుకు దించుకున్నాడు. ఈ ఘటన ములుగు జిల్లా(Mulugu District)లో జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

ట్రెండింగ్ వార్తలు

ములుగు జిల్లా కేంద్రంలో ఓ ప్రైవేటు పాఠశాల. అదే పాఠశాలలో కృష్ణ అనే ఉపాధ్యాయుడు ఉన్నాడు. విద్యార్థులతో మంచిగా ఉన్నట్టుగానే ప్రవర్తించేవాడు. అయితే తాజాగా ఆధార్ కార్డ్ వెరిఫికేషన్(Aadhar Card Verfication) అంటూ పదో తరగతి విద్యార్థులను గదిలోకి పిలిపించాడు. కాసేపు దానికి సంబంధించిన పని చేసి.. అందరినీ బయటకు పంపించాడు. ఒక్క బాలికను మాత్రమే ఉండమని చెప్పాడు.

ఆ తర్వాత తన బుద్ధిని బయటపెట్టాడు. ఒంటరిగా ఉన్న విద్యార్థినితో తప్పుడుగా ప్రవర్తించాడు. ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడాడు. బాలికను లైంగికంగా వేధించాడు. దీంతో బాలికకు భయం పట్టుకుంది. ఇంటికి వచ్చాక ఈ విషయాన్ని తన తల్లిదండ్రులకు(Parents) చెప్పింది. వెంటనే ములుగు పోలీస్ స్టేషన్(Mulugu Police Station) వెళ్లారు. ఉపాధ్యాయుడిపై ఫిర్యాదు చేశారు. పోక్సో చట్టం కింద అతడిపై కేసు నమోదైంది. ఈ మేరకు దర్యాప్తు చేస్తున్నట్టుగా ములుగు ఎస్సై ఓంకార్ వెల్లడించారు. విద్యార్థినులతో తప్పుగా ప్రవర్తిస్తే.. కఠిన చర్యలు ఉంటాయని పోలీసులు చెప్పారు.

IPL_Entry_Point