ED Enquiry : విచారణకు రాలేనన్న రోహిత్ రెడ్డి-tandur mla rohit reddy absents to enforcement directorates enquiry ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Tandur Mla Rohit Reddy Absents To Enforcement Directorates Enquiry

ED Enquiry : విచారణకు రాలేనన్న రోహిత్ రెడ్డి

HT Telugu Desk HT Telugu
Dec 19, 2022 01:07 PM IST

ED Enquiry ఈడీ నోటీసుల నేపథ్యంలో నేడు జరగాల్సిన విచారణకు హాజరు కాలేనంటూ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి తన పిఏ శ్రవణ్‌ కుమార్‌ ద్వారా ఈడీ అధికారులకు లేఖను పంపాడు. సోమవారం ఉదయం పదిన్నరకు విచారణకు రావాలని ఈడీ ఆదేశించిన నేపథ్యంలో అదే సమయానికి విచారణకు మరికొంత వ్యవధి కావాలంటూ రోహిత్ రెడ్డి లేఖను పంపడం చర్చనీయాంశంగా మారంది. మరోవైపు రోహిత్ రెడ్డి విజ్ఙప్తికి ఈడీ అమోదింకపోవడంతో మధ్యాహ్నం విచారణకు హాజరవుతారని తెలుస్తోంది.

ఈడీ విచారణకు రోహిత్ రెడ్డి డుమ్మా
ఈడీ విచారణకు రోహిత్ రెడ్డి డుమ్మా (twitter)

ED Enquiryబెంగళూరు డ్రగ్స్ పార్టీ కేసులో విచారణకు కావాలని బిఆర్ఎస్‌ ఎమ్మెల్యే రోహిత్‌ రెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో, తనకు మరికొంత వ్యవధి కావాలంటూ రోహిత్ రెడ్డి లేఖను పంపారు. బ్యాంకు ఖాతాల సమాచారంతో పాటు 2015 నుంచి వివరాలు కావాలని కోరడంతో తక్కువ వ్యవధిలో వాటిని సేకరించడం సాధ్యం కాదని మరో వారం గడువు కావాలని విజ్ఞప్తి చేశారు. రోహిత్ రెడ్డి విజ్ఞప్తి ఈడీ తోసిపుచ్చడంతో మధ్యాహ్నంమూడు గంటలకు విచారణకు హాజరు కానున్నారు.

ట్రెండింగ్ వార్తలు

సోమవారం ఉదయం ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ప్రగతి భవన్‌లో సిఎం కేసీఆర్‌తో భేటీ అయ్యారు. ఈడీ విచారణకు హాజరు కావాల్సిన సమయంలనే రోహిత్ రెడ్డి ప్రగతి భవన్‌కు చేరుకున్నారు. తాజా పరిణామాలపై ముఖ్యమంత్రితో చర్చించిన రోహిత్ రెడ్డి భవిష్యత్ కార్యాచరణపై సిఎంతో చర్చించారు. డ్రగ్స్‌ కేసులో తనపై వస్తున్న ఆరోపణలకు సిఎం కేసీఆర్‌కు వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఈడీ విచారణపై మల్లగుల్లాలు….

2021లో నమోదైన డ్రగ్స్‌ పార్టీ కేసులో టీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, నటి రకుల్ ప్రీత్ సింగ్ లకు ఈడీ నోటీసులు జారీ చేసింది. బెంగళూరు డ్రగ్స్ కేసులో నోటీసులు జారీ చేసింది. డిసెంబర్ 19న విచారణకు హాజరుకావాలని గత వారం నోటీసుల్లో పేర్కొంది.

2021లో బెంగళూరు పోలీసులు నమోదు చేసిన డ్రగ్స్ కేసు ఆధారంగా ఈడీ నోటీసులు జారీ చేసింది. వ్యాపారవేత్త కళహర్ రెడ్డితో కలిసి బెంగళూరులో డ్రగ్స్ పార్టీకి రోహిత్ రెడ్డి వెళ్లినట్లు నోటీసుల్లో పేర్కొంది. సినీ నిర్మాత శంకర్ గౌడ్ ఆ పార్టీ ఇచ్చినట్లు తెలిపింది. పార్టీ కోసం రూ. 4 కోట్ల విలువైన డ్రగ్స్ నైజీరియన్ల నుంచి వచ్చినట్లు పోలీసులు ఇప్పటికే తేల్చారు.

నటి రకుల్‌ ప్రీత్‌సింగ్‌కు కూడా ఈడీ మరోసారి నోటీసులు జారీ చేసింది. టాలీవుడ్ డ్రగ్స్ కేసులో గతేడాది సెప్టెంబర్‌ 3న రకుల్‌ను ఈడీ అధికారులు విచారించారు. అత్యవసరంగా వెళ్లాల్సి ఉందని విచారణ మధ్యలోనే రకుల్‌ వెళ్లిపోవడంతో.. ఈడీ అధికారులు అమెను అప్పుడు పూర్తిస్థాయిలో విచారించలేకపోయారు. దీంతో మరోసారి విచారణకు హాజరుకావాలని రకుల్‌కు ఈడీ నోటీసులు ఇచ్చింది.

ఈడీ నోటీసులు అందాయని ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి కూడా గతంలోనే స్పందించారు. డిసెంబర్ 19వ తేదీన ఈడీ ఆఫీసుకి రావాలని చెప్పారని.. అయితే కేసు వివరాలు మాత్రం తనకు అందించలేదని చెప్పారు. ఆధార్, ఓటర్ ఐడీ సహా ఆర్థిక లావాదేవీల వివరాలు తీసుకొని రావాలని చెప్పారు. కేసు వివరాలు లేకుండా ఇచ్చిన నోటీసులపై న్యాయనిపుణులతో చర్చిస్తానని.. వారి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత స్పందిస్తానని రోహిత్ రెడ్డి చెప్పారు. తాజాగా గడువు చాలదంటూ ఈడీకి లేఖను రాశారు.

మరోవైపు బెంగళూరు డ్రగ్స్ కేసు రీ ఓపెన్ చేస్తే రోహిత్ రెడ్డి పాత్ర బయట పడుతుందని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించడం, ఆ వెంటనే ఈడీ నోటీసులు రావడం కలకలం రేపింది. ఈ కేసులో కర్ణాటక ప్రభుత్వం నుంచి రోహిత్ రెడ్డికి నోటీసులు కూడా వచ్చాయని ప్రకటించారు. ఈడీ నోటీసులను మొదట తోసిపుచ్చిన రోహిత్‌ రెడ్డి, తర్వాత ప్రతిపక్షాల నాయకుల్ని బీజేపీ వేధిస్తోందని ఆరోపించారు. బండి సం జయ్ వ్యాఖ్యలు చేసిన మూడో రోజే... రోహిత్ రెడ్డికి డ్రగ్స్ కేసులో ఈడీ నోటీసులు పంపడం సంచలనంగా మారింది. ఈడీ విచారణకు వెళ్లకుండా రోహిత్ లేఖను పంపడంతో అధికారులు దానిని తోసిపుచ్చారు. రోహిత్ రెడ్డి హైదరాబాద్‌లోనే ఉన్నందున మధ్యాహ్నంలోగా విచారణకు హాజరు కావాలని తేల్చి చెప్పారు.

IPL_Entry_Point