Swachh Survekshan Awards : జాతీయ స్థాయిలో సత్తా చాటిన తెలంగాణ-swachh survekshan awards to telangana ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Swachh Survekshan Awards To Telangana

Swachh Survekshan Awards : జాతీయ స్థాయిలో సత్తా చాటిన తెలంగాణ

HT Telugu Desk HT Telugu
Oct 02, 2022 05:32 PM IST

Swachh Survekshan 2022 : స్వచ్ఛ సర్వేక్షణ్ 2022లో తెలంగాణ రాష్ట్రానికి అనేక అవార్డుల వచ్చాయి. దేశవ్యాప్తంగా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల పరిధిలో జరిగిన స్వచ్ఛతా కార్యక్రమాల్లో అవార్డులు దక్కాయి.

స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు అందుకున్న వారితో కేటీఆర్
స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు అందుకున్న వారితో కేటీఆర్

తెలంగాణకు స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు వచ్చాయి. దిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో అన్ని కేటగిరీల్లో 160కి పైగా అవార్డులు ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రానికి భారీగా స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు దక్కాయి. మిషన్ భగీరథ, స్వచ్ఛ భారత్ స‌ర్వేక్షణ్ లో తెలంగాణ నెంబర్ వన్ గా ఉంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా మిషన్ భగీరథ కు జలజీవన్ పురస్కారం దక్కింది. గ్రామాలలో ఇంటింటికి 100 శాతం నల్లా నీరు అందిస్తున్న పెద్ద రాష్ట్రంగా తెలంగాణగా ఉంది.

ట్రెండింగ్ వార్తలు

నాణ్యతా ప్రమాణం, ప‌రిమాణంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచింది. స్వచ్ఛ స‌ర్వేక్షణ్ లోనూ అగ్రగామిగా తెలంగాణ ఉంది. దేశంలో అత్యుత్తమంగా 13 స్వచ్ఛ అవార్డులు, రికార్డు స్థాయిలో మొత్తం 14 అవార్డులు ద‌క్కించుకుంది తెలంగాణ. దిల్లీలో వేర్వేరుగా జ‌రిగిన కార్యక్రమాల్లో అవార్డులను రాష్ట్ర పంచాయ‌తీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ‌ల కార్యద‌ర్శి సందీప్ కుమార్ సుల్తానియా, పంచాయ‌తీరాజ్ శాఖ డైరెక్టర్ హ‌నుమంత‌రావు, ఆయా జిల్లాల క‌లెక్టర్లు అందుకున్నారు.

100శాతం ఇంటింటికీ శుద్ధి చేసిన‌ మంచినీరు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ‌ మిషన్ భగీరధ పథకానికి కేంద్ర ప్రభుత్వ జలజీవన్ మిషన్ పురస్కారం లభించింది. మిష‌న్ భ‌గీర‌థ పథకం నాణ్యతా ప్రమాణం, పరిమాణంలో దేశానికే ఆదర్శప్రాయంగా నిలిచిందని, అన్ని గ్రామాలలో ఇంటింటికి నల్లా కనెక్షన్ల ద్వారా రోజు తాగునీరు అందిస్తున్నట్లు కేంద్ర పుభుత్వం గుర్తించి పురస్కారానికి ఎంపిక చేసింది.

స్వచ్ఛ స‌ర్వేక్షణ్ లో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అత్యుత‌న్న ప్రతిభావంత‌మైన రాష్ట్రంగా గుర్తింపు పొంది ఏకంగా 13 పురస్కారాల‌ను సొంతం చేసుకుంది. జాతీయ జల జీవన్ మిషన్ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వ మంచినీరు, పారిశుద్యం, జలశక్తి మంత్రిత్వ శాఖ ఆదర్శప్రాయమైన పనితీరుకు నిదర్శంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఈ పురస్కారానికి ఎంపిక చేసింది. తెలంగాణలోని 53,86,962 గృహాలకు గాను 100 శాతం నల్లా కనెక్షన్ల ద్వారా తాగునీరు అందిస్తున్న పెద్ద రాష్ట్రంగా గుర్తించింది. కవరేజీ కనెక్షన్ల జాబితాలో తెలంగాణ రాష్ట్రం ర్యాంక్-1 గా నిలిచింది.

ఈ మేరకు న్యూదిల్లీలోని విజ్ఞానభవన్లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆదివారం స్వచ్చభారత్ దివస్ గాంధీ జయంతి పురస్కరించుకుని రాష్ట్రపతి ద్రౌపదిముర్ము నుండి రాష్ట్ర అధికారులు.. పురస్కారాన్ని అందుకున్నారు. పథకం పనితీరు, నిర్వహణపై రాష్ట్రంలోని 320 గ్రామాలలో జాతీయ స్థాయి స్వతంత్ర సంస్థ ద్వారా కేంద్రం అధ్యయనం చేసి.. ప్రజాభిప్రాయాలు సేకరించింది. ఈ పథకం ద్వారా రోజూ ఇంటింటికి నాణ్యమైన తాగు నీరు అందుతున్నట్లు కేంద్రం గుర్తించి జాతీయ పురస్కారానికి ఎంపిక చేసింది.

WhatsApp channel