కంచె గచ్చిబౌలి భూములపై సుప్రీం కోర్టు ఘాటు వ్యాఖ్యలు.. పర్యావరణ అనుమతులపై స్పష్టత ఇవ్వాలని ఆదేశం..-supreme courts strong comments on kanche gachibowli lands ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  కంచె గచ్చిబౌలి భూములపై సుప్రీం కోర్టు ఘాటు వ్యాఖ్యలు.. పర్యావరణ అనుమతులపై స్పష్టత ఇవ్వాలని ఆదేశం..

కంచె గచ్చిబౌలి భూములపై సుప్రీం కోర్టు ఘాటు వ్యాఖ్యలు.. పర్యావరణ అనుమతులపై స్పష్టత ఇవ్వాలని ఆదేశం..

Sarath Chandra.B HT Telugu

న్యాయస్థానాలకు సెలవులు ఉండే వారాంతాల్లో కంచె గచ్చిబౌలి భూముల్లో బుల్డోజర్లు నడపడం ఏమిటని సుప్రీం కోర్టు ధర్మాసనం తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. కంచె గచ్చిబౌలి భూముల్లో పర్యావరణ పునరుద్ధరణపై స్పష్టత ఇవ్వాలని, ఉల్లంఘన తేలితే సీఎస్‌తో పాటు అధికారులు జైలుకు వెళ‌్ళాల్సి ఉంటుందని హెచ్చరించింది.

కంచ గచ్చిబౌలి భూముల వివాదంపై సుప్రీం కోర్టు కామెంట్స్‌

కంచ గచ్చిబౌలి భూముల్లో తెలంగాణ ప్రభుత్వ తీరుపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. న్యాయస్థానాలు పని చేయని రోజుల్లో పనులు ఎందుకు చేపట్టారని ప్రశ్నించింది. లాంగ్‌ వీక్‌ ఎండ్‌లో ఎందుకు చెట్లను నరికి వేశారని నిలదీసింది.

కంచ గచ్చిబౌలి భూముల్లో పర్యావరణానికి జరిగిని నష్టాన్ని పూడ్చేందుకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. పర్యావరణ అనుమతులు తీసుకున్నారో లేదో తేల్చాలని, ఈ వ్యవహారంపై తదుపరి విచారణలోగా అఫిడవిట్‌ దాఖలు చేయాలని ఆదేశించారు.

కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై సీజే బీఆర్‌ గవాయ్‌ నేతృత్వంలోని ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. ప్రస్తుతం ఎలాంటి పనులు చేపట్టడం లేదని, పర్యావరణ పునరుద్దరణ పనులు మినహా ఏమి చేయడం లేదని వివరణ ఇచ్చింది. చెట్లు నరికి వేయడంపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టులకు సెలవులు ఉన్న సమయంలో వారాంతాల్లో ఎందుకు హడావుడి

కంచె గచ్చిబౌలి భూములపై పర్యావరణ అనుమతులు తీసుకున్నారో లేదో వివరణ ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. విజిల్‌ బ్లోయర్స్‌, విద్యార్థులపై కేసులు పెట్టిన విషయాన్ని న్యాయవాదులు ధర్మాసనం దృష్టికి జారీ చేసింది.

పర్యావరణ పునరుద్ధరణపై అలసత్వం వహిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ప్రధాన కార్యదర్శితో పాటు అరడజను మంది బాధ్యులైన అధికారులు జైలుకు వెళ్లాల్సి ఉంటుందని హెచ్చరించింది. జులై 23లోపు కౌంటర్‌ దాఖలు చేయాలని, పర్యావరణ నష్టంపై కౌంటర్ దాకలు చేయాలని ధర్మాసనం ఆదేశించింది.

అభివృద్ధి పేరుతో అడవుల్ని నరికి వేయడాన్ని ఎట్టి పరిస్థితుల్లో అనుమతించమని సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది. కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో సుప్రీంకోర్టులో జరిగిన విచారణలో తెలంగాణ ప్రభుత్వ తీరుపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. కంచె గచ్చిబౌలి భూముల వ్యవహారంపై ఏప్రిల్ 16న సుప్రీం కోర్టు జోక్యం చేసుకుంది. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పనులపై స్టే విధించింది.

కంచ గచ్చబౌలి భూముల్లోచెట్లు నరికి వేతపై తెలంగాణ ప్రభుత్వం అఫిడవిట్‌ సమర్పించింది. హెచ్‌సీయూ పరిధిలో ఉన్న భూములు ప్రభుత్వానివేనని అవి అటవీ భూములు కాదని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వివరణ ఇచ్చింది. కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై సుప్రీం కోర్టు సుమోటో విచారణ చేపట్టింది.

గురువారం జరిగిన విచారణలో ప్రభుత్వ తీరుపై జస్టిస్‌ గవాయ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. పర్యావరణం విషయంలో రాజీ పడేది లేదని, ప్రైవేట్ ఫారెస్ట్‌ భూముల్లో చెట్లు నరికినా తీవ్రంగానే స్పందిస్తామని ధర్మాసనం వ్యాఖ్యానించింది. అభివృద్ధి పేరుతో అడవుల్ని నరకడాన్ని ధర్మాసనం తప్పు పట్టింది. కేసు విచారణకు జులైకు వాయిదా పడింది.

శరత్‌ చంద్ర హిందుస్తాన్ టైమ్స్‌ తెలుగు న్యూస్‌ ఎడిటర్‌గా ఉన్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో వివిధ హోదాల్లో 2001 నుంచి పని చేస్తున్నారు. జర్నలిజంలో నాగార్జున యూనివర్శిటీ నుంచి పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. గతంలొ ఈనాడు, ఎన్‌టీవీ, టీవీ9, హెచ్‌ఎంటీవీ, టీవీ5లలో వివిధ హోదాలలో విజయవాడ, హైదరాబాద్‌, ఢిల్లీలలో పనిచేశారు. 2022లో హెచ్‌టీ తెలుగులో చేరారు. ఇక్కడ ఏపీ తెలంగాణకు సంబంధించిన వర్తమాన అంశాలు, బ్యూరోక్రసీ, రాజకీయ వార్తలు, క్రైమ్ వార్తలను అందిస్తారు.

సంబంధిత కథనం