Hyderabad: జర్నలిస్టుల ఇళ్ల స్థలాలు, నిర్మాణాలకు సుప్రీం గ్రీన్ సిగ్నల్-supreme court verdict on hyderabad journalists society lands ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Supreme Court Verdict On Hyderabad Journalists Society Lands

Hyderabad: జర్నలిస్టుల ఇళ్ల స్థలాలు, నిర్మాణాలకు సుప్రీం గ్రీన్ సిగ్నల్

Mahendra Maheshwaram HT Telugu
Aug 25, 2022 01:48 PM IST

హైదరాబాద్ జర్నలిస్టులకు సుప్రీంలో ఊరట లభించింది. ఇళ్ల స్థలాల కేటాయింపు, నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

జర్నలిస్టులకు సుప్రీంలో ఊరట
జర్నలిస్టులకు సుప్రీంలో ఊరట

Supreme Court on Journalists Society Lands Case: హైదరాబాద్ జర్నలిస్టు ఇళ్ల స్థలాలు, నిర్మాణాలకు సంబంధించి సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. పదవీ విరమణకు ఒక రోజు ముందు సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ తీర్పును వెల్లడించారు. జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కేటాయింపు, నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఫలితంగా సుదీర్ఘకాలంగా ఇళ్ల స్థలాల కోసం పోరాడుతున్న హైదరాబాద్‌ జర్నలిస్టులకు ఉపశమనం దొరికినట్లు అయింది.

ట్రెండింగ్ వార్తలు

జర్నలిస్టులు, బ్యూరోక్రాట్లు, ప్రజా ప్రతినిధులకు ఇళ్లస్థలాల కేసులో విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు... జర్నలిస్టుల వ్యవహారాన్ని బ్యూరోక్రాట్లు, ప్రజా ప్రతినిధులతో ముడిపెట్టకూడదని తెలిపింది. జర్నలిస్టులకు 12 ఏళ్ల క్రితం ప్రభుత్వం స్థలాన్ని కేటాయించిందని గుర్తు చేసింది. ఈ సందర్భంగా సీజేఐ కీలక వ్యాఖ్యలు చేశారు. ఐఏఎస్, ఐపీఎస్‌ల గురించి నేను మాట్లాడ్డం లేదు. ఓ చిన్న జర్నలిస్టు ఎందుకు ఇబ్బందిపడాలి? - రూ. 8,000 నుంచి రూ. 50 వేల జీతం తీసుకునే సుమారు 8వేల మంది జర్నలిస్టులు అభ్యర్థనను పరిగణలోకి తీసుకుంటున్నాం. వారికి భూమి కేటాయించారు. కానీ అభివృద్ధి చేయలేదు. వారంతా కలిసి స్థలం కోసం రూ. 1.33 కోట్లు డిపాజిట్ చేశారు. జర్నలిస్టుల స్థలాన్ని వారు స్వాధీనం చేసుకోడానికి మేం అనుమతిస్తున్నాం. వారి స్థలంలో నిర్మాణాలు కూడా జరుపుకోవచ్చు అని స్పష్టం చేశారు.

ఐఏఎస్, ఐపీఎస్, ఎంపీలకు సంబంధించిన మిగతా కేసును ఇంకో బెంచ్ ముందు లిస్టు చేయాలంటూ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.

lands for journalists in hyd: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 12 ఏళ్ళ కిత్రం ఎంపీలు, ఎమ్మెల్యేలు, అఖిల భారత సర్వీసు అధికారులతో పాటు జర్నలిస్టులకు హైదరాబాద్ లో ఇళ్ళ స్థలాల కోసం స్థలాన్ని కేటాయించారు. అప్పుడు అక్రిడిటేషన్ ఉన్న జర్నలిస్టులు చాలా మంది డబ్బులు కట్టారు. అయితే, తర్వాత స్థలం కేటాయింపు విషయంలో కోర్టుల్లో పలు కేసులు నమోదయ్యాయి. చివరికి సుప్రీంకోర్టు చేరింది.అప్పటి నుండి న్యాయస్థానాల సానుకూల స్పందన కోసం జర్నలిస్టులు ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో సుప్రీంకోర్టు... జర్నలిస్టుల విషయంలో సానుకూలంగా స్పందిస్తూ తీర్పును వెల్లడించింది.సుప్రీం తీర్పు పట్ల జర్నలిస్టులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

IPL_Entry_Point

సంబంధిత కథనం

టాపిక్