SC on HCU Lands: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములపై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. గత నాలుగైదు రోజులుగా సెంట్రల్ యూనివర్శిటీలోని 400ఎకరాల భూములను ఏపీఐఐసీ కేటాయించే నిర్ణయంపై విద్యార్థుల నుంచి తీవ్ర స్థాయిలో ప్రతిఘటన వ్యక్తమవుతోంది. తాజాగా సెంట్రల్ యూనివర్శిటీ భూముల్ని అన్యాక్రాంతం చేయొద్దంటూ విపక్షాలు గొంతు కలిపాయి. ఈ వ్యవహారంపై హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ పరిసరాల్లో ఉన్న 400 ఎకరాల భూముల్ని కాపాడాలని కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లు కేంద్రానికి ఫిర్యాదు చేశారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌లో కూడా పిటిషన్లు దాఖలయ్యాయి.
ఈ నేపథ్యంలో సుప్రీం కోర్టులో దాకలైన పిటిషన్‌పై విచారణ జరిపిన ధర్మాసనం సెంట్రల్ యూనివర్శిటీలో చెట్లను నరకొద్దని ఆదేశించింది. తెలంగాణ హైకోర్టు రిజిస్టార్ ను కంచ గచ్చిబౌలి భూములు సందర్శించి మధ్యాహ్న 3:30 గంటల లోపు రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశించింది.
కంచ గచ్చిబౌలి భూముల్లో ఒక్క చెట్టును కూడా నరకవద్దని తెలంగాణ చీఫ్ సెక్రటరీకి సుప్రీంకోర్టు ఆదేశించింది.ఈ పిటిషన్‌పై గురువారం మధ్యాహ్నం 3.45 నిమిషాలకు మరోసారి విచారణ జరుగనుంది. సుప్రీంకోర్టు జస్టిస్ గవాయ్, జస్టిస్ ఆగస్టిన్ జార్జ్:ల నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరుపనుంది. తాజా ఆదేశాల నేపథ్యంలో హైకోర్టులో జరిగే ప్రొసిడింగ్స్‌పై ఎలాంటి స్టే విధించడం లేదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.
సంబంధిత కథనం