MLC Kavitha Plea : కవితకు దక్కని ఊరట - బెయిల్ కోసం ట్రయల్ కోర్టుకే వెళ్లాలన్న సుప్రీంకోర్టు
MLC Kavitha Plea in Supreme Court: లిక్కర్ కేసులో తనను ఈడీ అరెస్ట్ చేయటాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు కవిత. దీనిపై ఇవాళ విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం…. బెయిల్ కోసం ట్రయల్ కోర్టుకే వెళ్లాలని సూచించింది.
Kavitha Arrest in Delhi Liquor Scam Updates: ఢిల్లీ లిక్కర్ కేసులో(Delhi Liquor Scam) అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు(MLC Kavitha) సుప్రీంకోర్టులో ఊరట దక్కలేదు. ఈడీ అరెస్ట్ ను సవాల్ చేస్తూ… సుప్రీంకోర్టులో(Supreme Court) పిటిషన్ వేయగా… దీనిపై ఇవాళ న్యాయస్థానం విచారించింది. ప్రస్తుత సమయంలో తాము బెయిల్ ఇవ్వలేమని… కింది కోర్టునే ఆశ్రయించాలని సూచించింది. ట్రయల్ కోర్టుకు వెళ్లాలని సూచించిన కోర్టు… ఈ పిటిషన్ పై త్వరితగతిన విచారణ జరపాలని కింది కోర్టుకు సూచించింది.

సుప్రీంకోర్టు న్యాయమూర్తులు సంజీవ్ ఖన్నా, ఎంఎం సుందరేష్, బేలా ఎం. త్రివేది కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వలను జారీ చేసింది. బెయిల్ అభ్యర్థనను విచారించే మొదటి న్యాయస్థానం ట్రయల్ కోర్ట్ అని నొక్కిచెప్పింది.
“ఎవరైనా రాజకీయ వ్యక్తి అయినందున నేరుగా సుప్రీంకోర్టుకు రావొచ్చు. కానీ మేము ఈ తరహా పిటిషన్ ల విషయంలో స్పష్టంగా ఉన్నాయి. ఆచరణలో మనం ఏకరీతిగానే ఉండాలి. ప్రతి ఒక్కరూ ముందుగా ట్రయల్ కోర్టును ఆశ్రయించాల్సి ఉంటుంది” అని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత తరఫున వాదించిన సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్‌కు ధర్మాసనం తెలిపింది. పలువురు ప్రతిపక్ష నేతలను అరెస్టు చేసినందున కోర్టును తక్షణమే జోక్యం చేసుకోవాలని కోరుతూ సిబల్ తన వాదనలను ప్రారంభించగా.. కోర్టు స్పందిస్తూ… చట్టాన్ని అనుసరించాల్సిదేనని కోర్టు స్పష్టం చేసింది.
“దయచేసి దీన్ని రాజకీయ వేదికగా మార్చకండి. మీరు మమ్మల్ని చేయమని అడుగుతున్నది సాధ్యం కాదు. ఆర్టికల్ 32 [నేరుగా ఉన్నత న్యాయస్థానం ముందు ఒక రిట్] కింద ఒక పిటిషన్‌ను నేరుగా స్వీకరించమని మీరు మమ్మల్ని అడుగుతున్నారు, ఆ వ్యక్తి సుప్రీంకోర్టుకు రావొచ్చు. కానీ ఆ ప్రక్రియ ఏకరీతిగా ఉండాలి, ”అని కోర్టు అభిప్రాయపడింది.
ఈ కేసుకు సంబంధించి ఈడీకి కూడా నోటీసులు జారీ చేసింది సుప్రీంకోర్టు. ఆరు వారాల్లోగా కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఇక కవిత బెయిల్ పిటిషన్‌పై ట్రయల్ కోర్టు జాప్యం లేకుండా వెంటనే విచారణ జరపాలని చెప్పటంతో… రౌస్ అవెన్యూ కోర్టు ఎలాంటి తీర్పు ఇవ్వబోతుందనేది ఉత్కంఠగా మారింది.
రేపటితో ముగియనున్న కస్టడీ..!
దిల్లీ లిక్కర్ పాలసీ (Delhi Liquor Case)రూపకల్పన, అమల్లో అవకతవకలు జరిగాయని ఈడీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఆప్ నేతలతో పాటు ఎమ్మెల్సీ కవితకు పలుమార్లు సమన్లు ఇచ్చి విచారించింది. ఈ కేసు విచారణలో భాగంగా ఈ నెల 15న హైదరాబాద్ లోని కవిత ఇంట్లో ఈడీ అధికారులు(ED Raids) సోదాలు నిర్వహించారు. అనంతరం కవితను అరెస్టు చేసి దిల్లీకి తరలించారు. దిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో కవితను ప్రవేశపెట్టారు. కోర్టు ఆమెకు మార్చి 23 వరకు ఈడీ కస్టడీ విధించింది. ఈడీ కస్టడీలో ఉన్న కవితను అధికారులు విచారిస్తున్నారు. అయితే ఈ కేసుపై ఈడీ ఇప్పటికే కీలక ప్రకటన చేసింది. దిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కవితదే (Mlc Kavitha)కీలక పాత్ర అని తెలిపింది. కవిత ఆప్ నేతలకు రూ.100 కోట్లు ఇచ్చారని తెలిపింది. ఈ కేసులో ఇప్పటి వరకూ 15 మందిని అరెస్టు చేసినట్లు ఈడీ తెలిపింది. రేపటితో కవిత కస్టడీ ముగియనుంది.