BRS Narsapur Ticket : నర్సాపూర్ బీఆర్ఎస్ అభ్యర్థిగా సునీతా లక్ష్మారెడ్డి, బీఫామ్ అందజేత, మదన్ రెడ్డికి మెదక్ ఎంపీ టికెట్-sunitha laxma reddy has been finalized as narsapur brs candidate for assembly elections 2023 ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Brs Narsapur Ticket : నర్సాపూర్ బీఆర్ఎస్ అభ్యర్థిగా సునీతా లక్ష్మారెడ్డి, బీఫామ్ అందజేత, మదన్ రెడ్డికి మెదక్ ఎంపీ టికెట్

BRS Narsapur Ticket : నర్సాపూర్ బీఆర్ఎస్ అభ్యర్థిగా సునీతా లక్ష్మారెడ్డి, బీఫామ్ అందజేత, మదన్ రెడ్డికి మెదక్ ఎంపీ టికెట్

Maheshwaram Mahendra Chary HT Telugu
Oct 25, 2023 04:01 PM IST

Telangana assembly elections: నర్సాపూర్ ఎమ్మెల్యే అభ్యర్థిగా సునీత లక్ష్మారెడ్డిని ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ప్రకటించారు.ఈ మేరకు బుధవారం ప్రస్తుతం నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి గారితో కలిసి ఆమెకు బీఫామ్ అందజేశారు.

నర్సాపూర్ అభ్యర్థి ఖరారు
నర్సాపూర్ అభ్యర్థి ఖరారు

Telangana assembly Elections 2023: ఎట్టకేలకు నర్సాపూర్ అభ్యర్థిని ఖరారు చేశారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా సునీతా లక్ష్మారెడ్డిని ఖరారు చేశారు. బుధవారం స్థానిక ఎమ్మెల్యే మదన్ రెడ్డి సమక్షంలో ఆమెకు బీఫామ్ అందజేశారు.

మెదక్ ఎంపీ అభ్యర్థిగా మదన్ రెడ్డి

ప్రస్థుతం నర్సాపూర్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న మదన్ రెడ్డికి రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మెదక్ ఎంపీ అభ్యర్థిగా అవకాశం ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించింది. పార్టీలో అంతర్గత సర్దుబాటు చేస్తూ, అధినేత సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో భేటీ అయిన బీఆర్ఎస్ పార్టీ కోర్ కమిటీ సభ్యులు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఏకగ్రీవంగా బీఆర్ఎస్ పార్టీ కీలక సభ్యులు తీసుకున్న నిర్ణయం పట్ల సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు.

మదన్ రెడ్డి నాకు అత్యంత ఆప్తుడు - సీఎం కేసీఆర్

ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ...‘‘ మదన్ రెడ్డి గారు నాతో పార్టీలో మొదటినుంచి కొనసాగుతున్న సీనియర్ నాయకుడు. 35 ఏండ్లనుంచి నాతో సన్నిహితంగా కొనసాగుతున్న నేతగా నాకు అత్యంత ఆప్తుడు. నాకు కుడి భుజం లాంటి వాడు. సోదర సమానుడు. పార్టీ ఆలోచనలను గౌరవించి నర్సాపూర్ ఎన్నికలను తన భుజ స్కందాలమీద వేసుకుని సునీత లక్ష్మారెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించే బాధ్యత తీసుకున్నందుకు సంతోషంగా వుంది. ప్రస్తుతం కొత్త ప్రభాకర్ రెడ్డి ఎంపీగా కొనసాగుతున్న పార్లమెంటరీ స్థానం నుండి మదన్ రెడ్డికి అవకాశం ఇవ్వాలని పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు పార్టీ కీలక సభ్యులకు, కార్యవర్గానికి అభినందనలు. వారి సీనియారిటిని పార్టీ గుర్తించి గౌరవించినందుకు పార్టీ మఖ్య కర్యవర్గాన్ని అభినందిస్తున్నాను" అని అన్నారు.

"మెదక్ జిల్లాలో అత్యంత ప్రజాదరణ కలిగిన నేతగా కేవలం నర్సాపూర్ లోనే కాకుండా జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో వారు పాపులర్ లీడర్. వివాద రహితుడు సౌమ్యుడు మదన్ రెడ్డి గారి సేవలను పార్టీ మరింత గొప్పగా వినియోగించుకోవాల్సివుంది. నాతో పాటు కలిసి సునీతకు నర్సాపూర్ నియోజకవర్గ బీఫామ్ ఇవ్వడం నాకు సంతోషాన్ని కలిగించింది. చిన్న చిన్న సర్దుబాట్లు చేసుకుంటూ కీలక సమయంలో ఐక్యంగా ముందుకు పోవడం ద్వారా మదన్ రెడ్డి గారు పార్టీ ప్రతిష్టను మరింత ఇనుమడింప చేశారు.వారికి నా ధన్యవాదాలు అభినందనలు ’’ అని బీఆర్ఎస్ అధినేత సrఎం కేసీఆర్ తెలిపారు. ముఖ్యమంత్రి కలిసిన వారిలో మంత్రి హరీశ్ రావు కూడా ఉన్నారు.

Whats_app_banner