SCR Special Trains : ప్రయాణికులకు అలర్ట్... కాచిగూడ - కాకినాడ మధ్య ప్రత్యేక రైళ్లు, టైమింగ్స్ ఇవే-summer special trains between kacheguda kakinada town ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Summer Special Trains Between Kacheguda Kakinada Town

SCR Special Trains : ప్రయాణికులకు అలర్ట్... కాచిగూడ - కాకినాడ మధ్య ప్రత్యేక రైళ్లు, టైమింగ్స్ ఇవే

HT Telugu Desk HT Telugu
May 13, 2023 11:41 AM IST

South Central Railway Special Trains: వేసవిలో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింద దక్షిణ మధ్య రైల్వే. పలు మార్గాల్లో ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఈ మేరకు తేదీలతో పాటు టైమింగ్స్ వివరాలను పేర్కొంది.

సమ్మర్ ప్రత్యేక రైళ్లు
సమ్మర్ ప్రత్యేక రైళ్లు (twitter)

South Central Railway Special Trains Latest: ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే అప్డేట్ ఇచ్చింది. తెలుగు రాష్ట్రాల్లోని ఇప్పటికే పలు ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు ప్రవేశపెట్టగా... తాజాగా మరో రూట్ లో ప్రతిరోజూ సర్వీసులను నడపనుంది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. ఇందులో భాగంగా కాచిగూడ - కాకినాడ మధ్య ప్రత్యేక రైళ్లను నడపనుంది. వేసవి రద్దీ దృష్ట్యా వీటిని నడుపుతున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు వాటి వివరాలు చూస్తే….

ట్రెండింగ్ వార్తలు

కాచిగూడ - కాకినాడ టౌన్(07417) మధ్య ప్రత్యేక రైళును ప్రవేశపెట్టారు దక్షిణ మధ్య రైల్వే అధికారులు. మే 13వ తేదీన 08.45 నిమిషాలకు కాచిగూడ నుంచి బయల్దేరుతుంది. మరునాడు ఉదయం 08.45 గంటలకు కాకినాడ టౌన్ కు చేరుతుంది. ఇక కాకినాడ టౌన్ నుంచి కాచిగూడకు(ట్రైన్ నెంబర్ 07418) కూడా మరొక ట్రైన్ అందుబాటులో ఉంటుంది. మే 14వ తేదీన ప్రత్యేక రైలు కాకినాడ టౌన్ నుంచి 09.55 నిమిషాలకు బయల్దేరి... మరునాడు ఉదయం 09.45 నిమిషాలకు కాచిగూడకు చేరుతుంది.

ఆగే స్టేషన్లు ఇవే...

ఈ ప్రత్యేక రైళ్లు కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, రాయనపాడు, గుడివాడ, కైకలూరు, ఆకివీడు, భీమవరం టౌన్, తణుకు, నిడదవోలు, రాజమండ్రి, సామల్ కోట్ స్టేషన్లలో ఆగుతుంది. ఈ రైళ్లలో ఏసీ 2 టైర్, ఏసీ 3 టైర్, స్లీపర్ అండ్ జనరల్ సెకండ్ క్లాస్ కోచ్ లు ఉంటాయి. ప్రయాణికులు ఈ ప్రత్యేక రైళ్ల సేవలను వినియోగించుకోవాలని అధికారులు ఓ ప్రకటనలో కోరారు.

ఈ రూట్లలో కూడా….

Summer Special Trains: వేసవి ప్రయాణికుల రద్దీ నియంత్రణ కోసం సికింద్రాబాద్‌ నుంచి దానాపూర్‌, దిబ్రూగఢ్‌కు కూడా ప్రత్యేక రైళ్లను దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ నుంచి బిహార్‌లోని దానాపూర్‌కు, అస్సాంలోని దిబ్రూగఢ్‌కు ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.సికింద్రాబాద్‌-దానాపూర్‌ మధ్య ట్రైన్ నంబర్ 07419 రైలు మే 13, 20, 27 తేదీల్లో.. ప్రతి శనివారం సాయంత్రం 3.15కి బయల్దేరే రైలు ఆదివారం రాత్రి 11.15 గంటలకు దానాపూర్‌ చేరుకుంటుంది.

దానాపూర్‌-సికింద్రాబాద్‌ మధ్య రైలు నంబరు 07420 మే 15, 22, 29 తేదీల్లో బయలు దేరుతుంది. ప్రతి సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు బయల్దేరే రైలు మంగళవారం రాత్రి 11.50కి సికింద్రాబాద్‌ చేరుకుంటుంది. ఈ రైళ్లు రెండు వైపుల కాజీపేట, పెద్దపల్లి, బెల్లంపల్లి, సిర్పూర్‌కాగజ్‌నగర్‌, బల్లార్ష, నాగ్‌పుర్‌, ఇటార్సి, పిపారియా, జబల్‌పూర్‌, కట్ని, సత్నా, ప్రయాగ్‌రాజ్‌, పండిట్‌ దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ, బక్సర్‌ రైల్వే స్టేషన్లలో ఆగుతాయి. సికింద్రాబాద్‌-దిబ్రూగఢ్‌ మధ్య రైలు నంబరు 07046 మే 15, 22, 29 తేదీల్లో.. ప్రతి సోమవారం ఉదయం 11 గంటలకు బయల్దేరుతుంది. ఈ రైలు బుధవారం రాత్రి 8.50కి దిబ్రూగఢ్‌ చేరుకుంటుంది. దిబ్రూగఢ్‌-సికింద్రాబాద్‌ మధ్య రైలు నంబర్ .07047 మే 18, 25, జూన్‌ 1 తేదీల్లో.. ప్రతి గురువారం ఉదయం 9.20 గంటలకు బయల్దేరుతుంది. రైలు శనివారం సాయంత్రం 4.30 గంటలకు సికింద్రాబాద్‌ చేరుకుంటుంది.

రెండు వైపులా ప్రయాణాల్లో రైళ్లు తెలుగు రాష్ట్రాల్లోని నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు, విజయవాడ, ఏలూరు, రాజమహేంద్రవరం, సామర్లకోట, దువ్వాడ, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, పలాస స్టేషన్లలో ఆగుతాయి. భువనేశ్వర్‌, కటక్‌, న్యూజల్పాయ్‌గురి, గుహవాటి మీదుగా సికింద్రాబాద్‌-దిబ్రూగఢ్‌ల మధ్య రాకపోకలు సాగిస్తాయని అధికారులు తెలిపారు.

IPL_Entry_Point