Social Media Post : 'సోది క్లాస్' అంటూ స్టూడెంట్ పోస్ట్.. లెక్చరర్ కు తెలిసి..-student upload teacher class room photo in social media and teacher gets angry in telangana ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Student Upload Teacher Class Room Photo In Social Media And Teacher Gets Angry In Telangana

Social Media Post : 'సోది క్లాస్' అంటూ స్టూడెంట్ పోస్ట్.. లెక్చరర్ కు తెలిసి..

HT Telugu Desk HT Telugu
Nov 30, 2022 02:29 PM IST

Telangana Student : ఓ అమ్మాయి కాలేజీకి వచ్చింది. లెక్చరర్ పాఠాలు చెబుతుండగా ఫొటో తీసి బోరింగ్ క్లాస్ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ విషయం కాస్త లెక్చరర్ కు తెలిసింది. ఆమె రియాక్షన్ తో కథ రివర్స్ అయింది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (unsplash)

లెక్చరర్ పాఠాలు చెబుతుండగా.. ఫొటో తీసి ఓ విద్యార్థి సోషల్ మీడియా(Social Meida)లో పెట్టింది. పోస్టుకు బోరింగ్ క్లాస్ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఈ విషయం తెలిసిన లెక్చరర్ క్లాస్ అందరినీ చితకబాదింది. ఈ ఘటన కామారెడ్డి(Kamareddy) జిల్లా మద్నూర్ మండలం మేనూర్ ఆదర్శ (మోడల్)స్కూల్ లో జరిగింది. దీనిపై తల్లిదండ్రులు నిరసన తెలిపారు. ఈ విషయంపై పోలీసులకు(Police) ఫిర్యాదు వెళ్లింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే..

ట్రెండింగ్ వార్తలు

ఇంటర్ ఫస్ట్ ఇయర్(Inter First Year) విద్యార్థులకు లెక్చరర్ మహేశ్వరి పాఠం చెబుతోంది. వింటున్నట్టుగానే ఉన్నారు స్టూడెంట్స్. అందులో ఒక అమ్మాయి.. లెక్చరర్ పాఠం చెబుతుండగా.. ఫోన్లో ఫొటో తీసింది. బోరింగ్ క్లాస్ అంటూ సోషల్ మీడియా(Social Media)లో పోస్ట్ చేసింది. ఈ విషయం ఎలాగోలా లెక్చరర్ కు తెలిసింది. వెళ్లి నేరుగా విద్యార్థినిని అడిగింది. నా ఫొటో సోషల్ మీడియాలో ఎందుకు పెట్టావని ప్రశ్నించింది. అసలు క్లాస్ రూమ్ కు ఫోన్ తీసుకురావడమే తప్పని చెప్పింది

దీంతో భయపడిని స్టూడెంట్ తప్పును ఒప్పుకుంది. క్షమించమని అడిగింది. తన ఫొటోను సోషల్ మీడియాలో పెట్టడమే కాకుండా.. బోరింగ్ క్లాస్ అని క్యాప్షన్(Caption) ఇవ్వడంపై టీచర్ కోపంతో ఉంది. గది తలుపు పెట్టేసి.. అమ్మాయిలను ఒక చోట నెలబెట్టి.. కర్రతో చికతబాదింది. లెక్చరర్ అమ్మాయిలను కొడుతున్నప్పుడు కొంతమంది బాయ్స్ వీడియో తీశారు. అదికాస్త వైరల్ అయింది.

మరోవైపు బాలికలు తమను లెక్చరర్ ఎలా కొట్టిందో ఇంట్లో తల్లిదండ్రులకు చెప్పేశారు. తల్లిదండ్రులు పాఠశాలకు వచ్చారు. లెక్చరర్ తో గొడవకు దిగారు. తమ పిల్లలను ఎందుకు కొట్టారని ప్రశ్నించారు. తన ఫొటోను సోషల్ మీడియాలో ఎందుకు పెట్టారని.. ఆ అవసరం ఏంటని.. అందుకే కొట్టానని లెక్చరర్ మహేశ్వరి ఒప్పుకుంది. ఈ ఘటన ఉన్నతాధితారుల వరకూ వెళ్లింది.

ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని ప్రన్సిపల్ లావణ్య చెప్పారు. లెక్చరర్ మీద ఓ విద్యార్థిని మద్నూర్ స్టేషన్ లో కంప్లైంట్ కూడా చేశారు. మాట్లాడుకుని.. సెటిల్ చేసుకుంటే అయిపోయేదానికి ఇంత దూరం ఎందుకు తెచ్చుకున్నారని స్థానికులు అంటున్నారు.

WhatsApp channel