UNESCO Awards: గోల్కొండ మెట్లబావి, దోమకొండ కోటకు యునెస్కో పురస్కారాలు-stepwells of golconda and domakonda fort has received the award of distinction in this years unesco ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Stepwells Of Golconda And Domakonda Fort Has Received The Award Of Distinction In This Years Unesco

UNESCO Awards: గోల్కొండ మెట్లబావి, దోమకొండ కోటకు యునెస్కో పురస్కారాలు

HT Telugu Desk HT Telugu
Nov 27, 2022 07:41 AM IST

Award for Stepwells of Golconda: హైదరాబాద్ లోని గోల్కొండ మెట్లబావి, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని దోమకొండ కోట ప్రతిష్టాత్మకమైన యొనెస్కో పురస్కారానికి ఎంపికయ్యాయి.

గోల్కొండ మెట్లబావి
గోల్కొండ మెట్లబావి (twitter)

UNESCO Asia-Pacific Awards: గోల్కొండ మెట్లబావి ప్రతిష్టాత్మకమైన యొనెస్కో పురస్కారానికి ఎంపికైంది. ప్రజలు, పౌర సంస్థలు, వ్యక్తుల ఆధ్వర్యంలో సాంస్కృతిక వారసత్వ కట్టడాల పునరుద్ధరణలో మంచి ప్రతిభ కనబరిచిన పనులకు యునె­స్కో పురస్కారాలు ప్రకటించింది. ఆసియా–పసిఫిక్‌ విభాగానికి మన దేశం నుంచి మూడు నిర్మాణాలు ఎంపిక కాగా, అందులో రెండు తెలంగాణకు చెందినవే ఉన్నాయి. ఇందులో కుతుబ్‌షాహీ టూంబ్స్‌ పరిధిలోని గోల్కొండ మెట్ల బావి ‘అవార్డ్‌ ఆఫ్‌ డిస్టింక్షన్‌’కు, కామారెడ్డి జిల్లా దోమకొండ కోట ‘అవార్డ్‌ ఆఫ్‌ మెరిట్‌’కు ఎంపికయ్యాయి.

ట్రెండింగ్ వార్తలు

గోల్కోండ మెట్లబావి ఆగాఖాన్‌ ట్రస్ట్‌ సొంత నిధుల తో పునరుద్ధరించింది. కుతుబ్‌షాహీల కాలంలో అద్భుత నిర్మాణ కౌశలంతో ఈ బావి రూపుదిద్దుకుంది. భారీ వర్షాలతో బావి కొంతభాగం కూలి పూడుకుపోయింది. ఆగాఖాన్‌ ట్రస్టు దాన్ని పూర్తిస్థాయిలో పునరుద్ధరించడంతో మళ్లీ అందులో నీటి ఊట ఏర్పడి ఇప్పుడు పూర్వపు రూపాన్ని సంతరించుకుంది. ఈ పునరుద్ధరణ పనులు అద్భుతంగా సాగిన తీరును యునెస్కో గుర్తించింది.

దోమకొండ కోటను నాటి సంస్థానాధీశుల వారసులు పునరుద్ధరించుకుంటూ వచ్చారు. కోటలో రాతితో మహదేవుని ఆలయాన్ని అద్భుతంగా నిర్మించారు. కోటలో అద్దాల మేడ ప్రత్యేకం. 40 ఎకరాల విస్తీర్ణంలో చుట్టూ ఎత్తైన రాతి కట్టడంతో ప్రహరీ నిర్మించారు. ప్రముఖ సినీ హీరో చిరంజీవి తనయుడు రాంచరణ్, ఉపాసనల వివాహం ఇక్కడే జరిగిన సంగతి తెలిసిందే

IPL_Entry_Point

టాపిక్