Medak Drugs: స్టాఫ్ట్‌ వేర్‌ ఇంజనీర్‌ డ్రగ్స్‌ వ్యాపారం..120 మిల్లీ గ్రాముల ఎండిఎంఎ క్రిస్టల్స్‌ స్వాధీనం-staff wear engineer drug business 120 milligrams of mdma crystals seized ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Medak Drugs: స్టాఫ్ట్‌ వేర్‌ ఇంజనీర్‌ డ్రగ్స్‌ వ్యాపారం..120 మిల్లీ గ్రాముల ఎండిఎంఎ క్రిస్టల్స్‌ స్వాధీనం

Medak Drugs: స్టాఫ్ట్‌ వేర్‌ ఇంజనీర్‌ డ్రగ్స్‌ వ్యాపారం..120 మిల్లీ గ్రాముల ఎండిఎంఎ క్రిస్టల్స్‌ స్వాధీనం

HT Telugu Desk HT Telugu
Jan 22, 2025 09:18 AM IST

Medak Drugs: సాఫ్ట్ వేర్‌ ఉద్యోగం చేస్తూ రూ. లక్షలకు లక్షల జీతాలు సంపాదిస్తున్నాడు. సంఘంలో ఐటీఉద్యోగిగా గౌరవం పొందుతున్నాడు. నెలనెల వస్తున్న లక్షల జీతాలు, సంఘంలో లభించే గౌరవాన్ని కాదని, డ్రగ్స్‌ వ్యాపారం చేసి మరింతగా సంపాదించాలనే దురాలోచనతో డ్రగ్స్‌ అమ్మకాలు చేస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు.

మెదక్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ నుంచి ఎండిఎంఏ డ్రగ్ స్వాధీనం
మెదక్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ నుంచి ఎండిఎంఏ డ్రగ్ స్వాధీనం

Medak Drugs: తోటి సాఫ్ట్ వేర్‌ ఉద్యోగులకు డ్రగ్స్‌ సరపరా చేయడానికి పూణే నుంచి హైదరాబాద్‌కు వాహనంలో ఎండిఎంఎ క్రిస్టల్‌ డ్రగ్స్‌ను తీసుకువస్తూ పట్టుబడ్డాడు ఒక సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ సంగారెడ్డి డిటిఎఫ్ , ఎక్సైజ్‌ పోలీసులకు పట్టుబడ్డాడు.

yearly horoscope entry point

డబ్బులు సరిపోక డ్రగ్స్ వ్యాపారంలోకి...

జమ్ము కాశ్మీర్‌కు చెందిన హర్జత్‌ సింగ్‌ (35) అనే వ్యక్తి హైదరాబాద్‌లో గత కొంత కాలంగా సాఫ్ట్‌వేర్‌ ఇంజనీరుగా పని చేస్తున్నాడు. తొలుత తాను డ్రగ్స్‌కు అలవాటు పడ్డాడు. సాఫ్ట్వేర్ ఉద్యోగంలో వస్తున్న జీతామంతా డ్రగ్స్‌కే ఖర్చువుతుండడంతో తానే డ్రగ్స్‌ వ్యాపారీగామారి తోటి సాఫ్ట్వేర్ ఉద్యోగులకు, ఇతరులకు డ్రగ్స్‌ను సరఫరా చేసే స్థాయికి ఎదిగాడు.

పూణే నుండి హైదరాబాద్ కు....

డ్రగ్స్‌ కోసం మహారాష్ట్ర పూణే ప్రాంతానికి టాటా కారులో వెళ్లి అక్కడి నుంచి 120 మీల్లీ గ్రాముల ఎండిఎంఎ క్రిస్టల్స్‌ డ్రగ్స్‌ను తీసుకొని హౖదరాబాద్‌కు వస్తున్న క్రమంలో సంగారెడ్డి డీటీఎప్‌, ఎక్సైజ్‌ పోలీసులు కలిసి సంగారెడ్డి మల్కాపూర్‌ ప్లైఓవర్‌ తనిఖీలు నిర్వహించి వాహనాన్ని పట్టుకున్నారు. హర్జత్ సింగ్, కార్యకలాపాల పైన తీవ్ర నిఘా పెట్టిన ఎక్సైజ్‌ పోలీసులు, తమకు ముందుగా ఉన్న సమాచారంతో హర్జత్ సింగ్ ని అదుపులోకి తీసుకున్నారు.

తాను ఎక్కడి నుండి డ్రగ్స్ కొన్నాడు, ఎవరికీ తాను రెగ్యులర్ గ అమ్ముతున్నాడు అనే కార్యకలాపాల పైన కూడా అధికారులు పూర్తి స్థాయి విచారణ చేస్తున్నారు. తనకు డ్రగ్స్ సరఫరా చేసే కింగ్‌ పిన్‌లను కూడా త్వరలోనే అరెస్ట్ చేసే అవకాశమున్నట్టు తెలుస్తుంది.

యువత దూరంగా ఉండాలి....

నిందితుడి వద్ద స్వాధీనం చేసుకున్న డ్రగ్స్‌ విలువ రూ. 21.06 లక్షలు ఉంటుందని అసిస్టేంట్‌ ఎక్సైజ్‌ సూపరిండెంట్‌ కె.శ్రీనివాసరావు తెలిపారు. ఈ సందర్బంగా, శ్రీనివాస్ రావు మాట్లాడుతూ,డ్రగ్స్, గంజాయి, ఇతర అసాంఘిక కార్యకలాపలపై ఎటువంటి సమాచారం ఉన్నా తమకు తెలపాలని ప్రజలను కోరారు. ఇట్టి కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని యువతకు సూచించారు. తల్లితండ్రులు కూడా ఎప్పటికప్పడు తమ పిల్ల ప్రవర్తనను గమనించాలని అవగాహన కల్పించారు.డ్రగ్స్‌ పట్టుకున్న టీమ్‌లో సీఐ సిహెచ్‌. చంద్రశేఖర్‌, ఎస్సైలు బి.యాదయ్య, జి .హన్మంత్‌, పి.శ్రీనివాసరెడ్డి, కానిస్టేబుల్‌ ప్రభాకర్‌రెడ్డి ఉన్నారు. డ్రగ్స్‌ను పట్టుకున్న డీటీఎఫ్, ఎక్సైజ్‌ పోలీసులను ఎక్సైజ్‌ ఎన్‌ ఫోర్స్‌మెంట్‌డైరెక్టర్‌ వి.బి.కమలాసన్‌రెడ్డి, మెదక్‌ డిప్యూటి కమిషనర్‌ హరికిషన్‌, అసిస్టేంట్‌ కమిషనర్‌ జి .శ్రీనివాసరెడ్డిలు అభినందించారు.

Whats_app_banner