Sri Ram Navami 2022 | రాములోరి పెళ్లికి తలంబ్రాలను గోటితోనే ఎందుకు ఒలుస్తారు.. వాటికి సీమంతం దేనికి?-sri ram navami 2022 history of goti talambralu for bhadrachalam lord rama ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Sri Ram Navami 2022 History Of Goti Talambralu For Bhadrachalam Lord Rama

Sri Ram Navami 2022 | రాములోరి పెళ్లికి తలంబ్రాలను గోటితోనే ఎందుకు ఒలుస్తారు.. వాటికి సీమంతం దేనికి?

HT Telugu Desk HT Telugu
Apr 08, 2022 02:37 PM IST

భద్రాచలం సీతారాముల కల్యాణానికి అంతా సిద్ధమైంది. రాములోరి కల్యాణాన్ని చూసి.. భక్తులు తరించిపోతుంటారు. స్వామి వారి కల్యాణ ఘట్టాన్ని చూసి పులకించిపోతారు. అయితే రాములోరి పెళ్లిలో తలంబ్రాలది ప్రత్యేక స్థానం. ఇంతకీ వీటిని ఎలా తయారు చేస్తారు? ఎక్కడి నుంచి తెస్తారు.

శ్రీరామ నవమి 2022
శ్రీరామ నవమి 2022

శ్రీరామ నవమి వచ్చిందంటే.. భద్రాద్రి మెుత్తం రామనామస్మరణతో మారుమోగిపోతుంది. ఏటా.. ఏటా శ్రీరామ నవమిని చైత్ర శుద్ధ నవమి నాడు చేసుకుంటాం. అదే రోజున శ్రీరాముడు జన్మించాడని చరిత్ర చెబుతోంది. ఆ రోజునే.. శ్రీరాముల వారు.. అరణ్య వాసం వీడి అయోధ్యకు చేరుకుని పట్టాభిశుక్తుడు అయినట్టు చెబుతారు. అంతేకాదు.. సీతారాముల కల్యాణం జరిగింది కూడా ఇదే రోజున. ఇక ఇన్ని విశేషాలు ఉన్న శ్రీరామనవమి రోజు అంటే.. భక్తులకు ఎంతో ప్రత్యేకం. ఈ ఏడాది మార్చి 10న శ్రీరామ నవమి జరగనుంది. అయితే రాములోరి కల్యాణంలో తలంబ్రాల గురించి.. ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అవి తయారు చేయడం దగ్గర నుంచి.. భద్రాచలం చేరుకునేవరకు ఎంతో భక్తితో ఉంటారు. వాటిని తయారు చేయడం వెనక ఓ పెద్ద చరిత్రే ఉంది.

ట్రెండింగ్ వార్తలు

జానకి దోసిట కెంపుల బ్రోవై.. రాముని దోసిట నీలపు రాశై.. ఆణిముత్యలే తలంబ్రాలుగా.. అని శ్రీరామనవమి రోజున.. రాములోరి కల్యాణంలో తలంబ్రాల ప్రత్యేక గురించి వివరిస్తుంటారు. అయితే అలాంటి కోటి తలంబ్రాలను గోటితోనే ఒలుస్తారు భక్తులు. కొన్నేళ్లుగా ఇదే ఆనవాయితీగా వస్తుంది. ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ నుంచి ఈ తలంబ్రాలు తెలంగాణలోని భద్రాచలానికి చేరుకుంటాయి. సీతారాముల కల్యాణానికి.. శచీదేవి, అహల్య.. ఇలా కొంతమంది.. శ్రీరామ ధ్యానం చేస్తూ గోటితో వడ్లను ఒలిచారని చెబుతుంటారు.

ఇదే స్ఫూర్తిగా తూర్పు గోదావరి జిల్లా కోరుకొండకు చెందిన అప్పారావు ప్రారంభించారు. ఈ ఏడాది రాములోరికి గోటితో ఒలిచిన తలంబ్రాలను పంపాడం 11వసారి. అయితే అంతకుముందు కూడా తూర్పు గోదావరి జిల్లా వాసుల నుంచి భద్రాద్రికి కోటి తలంబ్రాలు వచ్చేవి అని చెబుతుంటారు. మధ్యలో కొన్నేళ్లుగా ఆగిపోయిన తర్వాత.. అప్పారావు ప్రారంభించినట్టు తెలుస్తోంది. ఈ తలంబ్రాలకు కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు.

శ్రీకృష్ణ చైతన్య సంఘం ఏర్పాటు చేసి... రామ భక్తులందరినీ ఏకం చేశారు అప్పారావు. తలంబ్రాల కోసం.. దాదాపు ఎకరం పోలాన్ని ఉపయోగిస్తున్నారు. నారు పోసే ముందు విత్తనాలను.. రాములోరి పాదాల చెంత ఉంచుతారు. నారు పోసిన తర్వాత.. ఎకరం పొలంలో ఆంజనేయస్వామి, వానరుల వేషధారణలో పొలం దున్ని నాట్లు వేస్తారు. అప్పటి నుంచి ఎంతో ప్రత్యేకంగా పంటను చూసుకుంటారు. పొట్ట దశకు చేరుకున్నాక భక్తిశ్రద్ధలతో సీమంతం చేస్తారు. ఎంతో భక్తితో ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. అంతేకాదు.. వరి కోసేప్పుడు.. రాముడి వేషధారణలో ఉన్న భక్తుడికే.. మెుదట అందజేస్తారు.

వరి చేతికి వచ్చాక.. గోటితో కోటి వడ్లను ఒలిచే కార్యక్రమం చేపడతారు. ఎంతో మంది రాముడి భక్తులు ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఈ మహాకార్యంలో పాల్గొంటారు. గోదావరి పుష్కర ఘాట్ దగ్గరలో తలంబ్రాలకు ప్రత్యేక పూజలు చేసి.. భద్రాచలానికి తీసుకొస్తారు. అయితే కోరుకొండ నుంచి కొన్నేళ్లుగా.. ఒంటిమిట్ట కల్యాణానికి కూడా.. తలంబ్రాలను తీసుకెళ్తున్నారు.

IPL_Entry_Point

సంబంధిత కథనం

టాపిక్