పండుగల కోసం ప్రత్యేక రైళ్లు.. ఈ రూట్‌లలో మీరు వెళ్తున్నారో లెదో చూసుకోండి!-speical trains for dasara and diwali vizag to cherlapalli and hyderabad to kanyakumari check your root ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  పండుగల కోసం ప్రత్యేక రైళ్లు.. ఈ రూట్‌లలో మీరు వెళ్తున్నారో లెదో చూసుకోండి!

పండుగల కోసం ప్రత్యేక రైళ్లు.. ఈ రూట్‌లలో మీరు వెళ్తున్నారో లెదో చూసుకోండి!

Anand Sai HT Telugu

దసరా పండుగకు ఊర్లకు వెళ్లినవారి కోసం రైల్వే గుడ్‌న్యూస్ చెప్పింది. వైజాగ్ టూ చర్లపల్లికి ప్రత్యేక రైలు సేవలను ప్రకటించింది.

పండుగలకు ప్రత్యేక రైళ్లు

దసరా పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, ఈస్ట్ కోస్ట్ రైల్వే.. విశాఖపట్నం నుంచి చర్లపల్లికి ప్రత్యేక రైలు సేవలను ప్రకటించింది. విశాఖపట్నం-చర్లపల్లి దసరా స్పెషల్ రైలు (08589) అక్టోబర్ 3న సాయంత్రం 7:30 గంటలకు విశాఖపట్నం నుండి బయలుదేరుతుంది. మరుసటి రోజు ఉదయం 10:00 గంటలకు చర్లపల్లి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో రైలు నంబర్ 08590 అక్టోబర్ 4న రాత్రి 8:00 గంటలకు చర్లపల్లి నుండి బయలుదేరి విశాఖపట్నం చేరుకుని ఉదయం 11:45 గంటలకు చేరుకుంటుంది.

రెండు రైళ్లు అనకాపల్లి, తుని, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు వంటి ప్రధాన జంక్షన్‌లతో పాటు ఎలమంచిలి, అన్నవరం, నిడదవోలు, నల్గొండ చిన్న స్టేషన్‌లతో సహా 20 ఇంటర్మీడియట్ స్టేషన్‌లలో ఆగుతాయి.

దసరా, దీపావళి పండుగల దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వేతోపాటుగా మరికొన్ని రైల్వే డివిజన్లు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశాయి. అవి ఏంటో చూద్దాం.. చెన్నై-షాలిమార్‌(02842) నవంబరు 26వ తేదీ వరకు బుధవారాల్లో చెన్నైలో ఉదయం 4.30కు బయలుదేరుతుంది. మరుసటి ఉదయం 11.20కి షాలిమార్‌ చేరుకుంటుంది. ఇక షాలిమార్‌- చెన్నై (02841) నవంబరు 24 వరకు సోమవారాల్లో షాలిమార్‌లో సాయంత్రం 6:30కి బయలుదేరుతుంది. మరుసటి రోజు నైట్ 11:30కి చెన్నైలో ఉంటుంది.

కన్యాకుమారి- హైదరాబాద్‌(07229) స్పెషల్ ట్రైన్.. ప్రతి శుక్రవారం ఉదయం 5.15 గంటలకు కన్యాకుమారిలో బయలుదేరుతుంది. మరుసటి రోజు మధ్యాహ్నం 2:30 గంటలకు హైదరాబాద్‌కు చేరుకుంటుంది. హైదరాబాద్‌- కన్యాకుమారి (07230) రైలు ప్రతి బుధవారం సాయంత్రం 5:20కి హైదరాబాద్‌లో బయలుదేరుతుంది. శుక్రవారం ఉదయం 2:30 గంటలకు కన్యాకుమారిలో ఉంటుంది.

తిరుపతి-సాయినగర్‌ షిర్డీ (07637) స్పెషల్ రైలు.. ప్రతి ఆదివారం ఉదయం 4 గంటలకు తిరుపతిలో మూవ్ అవుతుంది. మరుసటి రోజున ఉదయం 10.45కు షిర్డీకి చేరుతుంది. సాయినగర్‌ షిర్డీ-తిరుపతి (07638) ప్రతి సోమవారం రాత్రి 7:35కి షిర్డీలో బయలుదేరి.., బుధవారం మధ్యాహ్నం 1:30కి తిరుపతిలో ఉంటుంది. తిరుపతి-జల్న (07610) రైలు ప్రతి మంగళవారం మధ్యాహ్నం 3:15కి ప్రారంభమై.. మరుసటి రోజున మధ్యాహ్నం 3:50 గంటలకు జల్నలో ఉంటుంది. జల్న- తిరుపతి (07609) రైలు ప్రతి సోమవారం ఉదయం 7 గంటలకు జల్న నుంచి బయలుదేరుతుంది. మరుసటి ఉదయం 10:45గంటలకు తిరుపతి చేరుకోనుంది.

ఆనంద్ సాయి హెచ్.టి తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. నేషనల్, బిజినెస్ వార్తలు రాస్తారు. గతంలో ఎంటర్‌టైన్మెంట్, లైఫ్‌స్టైల్ రాసేవారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. గతంలో నవతెలంగాణ, ఈనాడు, ఈటీవీ భారత్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. 2022లో హెచ్.టి తెలుగులో చేరారు.