SCR Special Trains Latest: ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది దక్షిణ మధ్య రైల్వే. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని మరికొన్ని స్పెషల్ ట్రైన్లను ప్రకటించింది. ఇప్పటికే సంక్రాంతికి పలు ప్రత్యేక రైళ్లను ప్రకటించగా.. తాజాగా పలు రూట్లలో నడుస్తున్న 18 ప్రత్యేక రైళ్లను పొడిగించింది. ఈ మేరకు వివరాలను వెల్లడించింది.,రద్దీని దృష్టిలో పెట్టుకొని జనవరి, ఫిబ్రవరి నెలల్లో 18 ప్రత్యేక రైళ్లను పొడిగిస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది. తిరుపతి నుంచి అకోలా రూట్‌లో ప్రతీ శుక్రవారం ప్రత్యేక రైలు అందుబాటులో ఉంటుంది. ఈ రైలును 2023 జనవరి 20 నుంచి 2023 ఫిబ్రవరి 24 వరకు పొడిగించింది. రైలు నెంబర్ 07606 అకోలా నుంచి తిరుపతి రూట్‌లో ప్రతీ ఆదివారం అందుబాటులో ఉంటుంది. ఈ రైలును 2023 జనవరి 22 నుంచి 2023 ఫిబ్రవరి 26 వరకు పొడిగించింది.,హైదరాబాద్ నుంచి నర్సాపూర్ రూట్‌లో(రైలు నెంబర్ 07631 ) ప్రతీ శనివారం అందుబాటులో ఉంటుంది. ఈ రైలును 2023 జనవరి 21 నుంచి 2023 ఫిబ్రవరి 25 వరకు పొడిగించింది. నర్సాపూర్ నుంచి హైదరాబాద్ రూట్‌లో ప్రతీ ఆదివారం ట్రైన్ (రైలు నెంబర్ 07632 ) అందుబాటులో ఉంటుంది. ఈ రైలును 2023 జనవరి 22 నుంచి 2023 ఫిబ్రవరి 26 వరకు పొడిగించింది. ఇక హైదరాబాద్ నుంచి తిరుపతి రూట్‌లో ప్రతీ సోమవారం ప్రత్యేక రైలు అందుబాటులో ఉంటుంది. ఈ రైలును 2023 జనవరి 23 నుంచి 2023 ఫిబ్రవరి 27 వరకు పొడిగించింది రైల్వే శాఖ. తిరుపతి నుంచి హైదరాబాద్ రూట్(రైలు నెంబర్ 07644)లో ప్రతీ మంగళవారం అందుబాటులో ఉంటుంది. ఈ రైలును 2023 జనవరి 24 నుంచి 2023 ఫిబ్రవరి 28 వరకు పొడిగించింది.,మరోవైపు విజయవాడ నుంచి నాగర్‌సోల్ రూట్‌లో ప్రతీ శుక్రవారం అందుబాటులో స్పెషల్ ట్రైన్ ఉంటుంది. ఈ రైలును 2023 జనవరి 20 నుంచి 2023 ఫిబ్రవరి 24 వరకు పొడిగించింది. నాగర్‌సోల్ నుంచి విజయవాడ రూట్‌లో ప్రతీ శనివారం అందుబాటులో ఉంటుంది. ఈ రైలును 2023 జనవరి 21 నుంచి 2023 ఫిబ్రవరి 25 వరకు పొడిగించినట్లు వెల్లడించింది. ఇక కాకినాడ నుంచి లింగంపల్లి మార్గంలో ప్రతీ సోమవారం, బుధవారం, శుక్రవారం స్పెషల్ ట్రైన్ అందుబాటులో ఉంటుంది. ఈ రైలును 2023 జనవరి 20 నుంచి 2023 ఫిబ్రవరి 27 వరకు పొడిగించింది. లింగంపల్లి నుంచి కాకినాడ టౌన్ రూట్‌లో ప్రతీ మంగళవారం, గురువారం, శనివారం అందుబాటులో ఉంటుంది. ఈ రైలును 2023 జనవరి 21 నుంచి 2023 ఫిబ్రవరి 28 వరకు పొడిగించింది.,మచిలీపట్నం నుంచి సికింద్రాబాద్ మార్గంలో ప్రతీ ఆదివారం ప్రత్యేక ట్రైన్ అందుబాటులో ఉంటుంది. ఈ రైలును 2023 జనవరి 22 నుంచి 2023 ఫిబ్రవరి 26 వరకు పొడిగించారు. సికింద్రాబాద్ నుంచి మచిలీపట్నం రూట్‌లో ప్రతీ ఆదివారం అందుబాటులో ఉండగా... ఈ ట్రైన్ ను 2023 జనవరి 22 నుంచి 2023 ఫిబ్రవరి 26 వరకు పొడిగించారు.తిరుపతి నుంచి సికింద్రాబాద్ రూట్‌లో ప్రతీ ఆదివారం స్పెషల్ ట్రైన్ అందుబాటులో ఉండగా... ఈ రైలును ఫిబ్రవరి 5 నుంచి 2023 ఫిబ్రవరి 26 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. సికింద్రాబాద్ నుంచి తిరుపతి రూట్‌లో ప్రతీ సోమవారం అందుబాటులో స్పెషల్ ట్రైన్ ఉండగా... ఈ రైలును 2023 ఫిబ్రవరి 6 నుంచి 2023 ఫిబ్రవరి 27 వరకు పొడిగించింది. ఇవే గాకుండా ఇతర మార్గాల్లో నడిచే రైళ్ల వివరాలను కింద ఇచ్చిన జాబితాలో చెక్ చేసుకోవచ్చు.,