SCR Maha Kumbh Mela Special Trains : చర్లపల్లి నుంచి మహాకుంభమేళాకు ప్రత్యేక రైళ్లు - ఇవిగో వివరాలు-south central railway will run four special trains to maha kumbh mela 2025 between charlapalli and danapur ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Scr Maha Kumbh Mela Special Trains : చర్లపల్లి నుంచి మహాకుంభమేళాకు ప్రత్యేక రైళ్లు - ఇవిగో వివరాలు

SCR Maha Kumbh Mela Special Trains : చర్లపల్లి నుంచి మహాకుంభమేళాకు ప్రత్యేక రైళ్లు - ఇవిగో వివరాలు

Maheshwaram Mahendra Chary HT Telugu
Jan 29, 2025 12:31 PM IST

Maha Kumbh Mela Special Trains 2025 : కుంభమేళా వెళ్లే యాత్రికులకు దక్షిణ మధ్య రైల్వే మరో అప్డేట్ ఇచ్చింది. చర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఫిబ్రవరి 5 - 9 తేదీల్లో రాకపోకలు సాగిస్తాయని ఓ ప్రకటనలో పేర్కొంది.

మ‌హాకుంభ మేళాకు ప్రత్యేక రైళ్లు
మ‌హాకుంభ మేళాకు ప్రత్యేక రైళ్లు

మహా కుంభమేళాకు వెళ్లే భ‌క్తుల‌కు దక్షిణ మధ్య రైల్వే మరో గుడ్‌న్యూస్ చెప్పింది. యాత్రికుల డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని నాలుగు ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. హైదరాబాద్ లోని చర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి ఈ రైళ్లను ఆపరేట్ చేయనుంది.ఈ మేరకు అధికారులు వివరాలను వెల్లడించారు.

yearly horoscope entry point

చర్లపల్లి నుంచి ప్రత్యేక రైళ్లు - వివరాలు

చర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి ధన్ పూర్ కు దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైలును ప్రకటించింది. ఈ ట్రైన్ (నెంబర్ 07079)ఫిబ్రవరి 5వ తేదీన చర్లపల్లి నుంచి మధ్యాహ్నం 3 గంటలకు బయల్దేరుతుంది. రెండో రోజు రాత్రి 11. 55 గంటలకు ధన్ పుర్ కు చేరుకుంటుంది. ఇక ధన్ పుర్ నుంచి చర్లపల్లి మధ్య మరో సర్వీస్(07080) అందుబాటులో ఉంటుంది. ఈ ట్రైన్ ఫిబ్రవరి 7వ తేదీన ధన్ పుర్ నుంచి మధ్యాహ్నం 3 గంటలకు బయల్దేరుతుంది. రెండో రోజు రాత్రి 11. 45 గంటలకు చర్లపల్లి రైల్వే స్టేషన్ కు చేరుతుంది.

ఇక ఫిబ్రవరి 7వ తేదీన కూడా చర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి ధన్ పుర్ మధ్య మరో రైలు(ట్రైన్ నెంబర్ 07077) అందుబాటులో ఉంటుంది. ఈ ట్రైన్... మధ్యాహ్నం 3 గంటలకు బయల్దేరుతుంది. రెండో రోజు రాత్రి 11.55 గంటలకు ధన్ పుర్ చేరుతుంది. ఇక ధన్ పుర్ నుంచి కూడా చర్లపల్లి మరో ట్రైన్ (07078)అందబాటులో ఉంటుంది. ఈ రైలు ఫిబ్రవరి 9వ తేదీన బయల్దేరి... రెండు రోజు రాత్రి 11. 45 గంటలకు చర్లపల్లి రైల్వే స్టేషన్ కు చేరుతుంది.

ఆగే స్టేషన్లు ఇవే…

మొత్తంగా చర్లపల్లి నుంచి రెండు సర్వీసులు, ధన్ పుర్ నుంచి మరో రెండు సర్వీసులు అందుబాటులో ఉంటాయని దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. ఈ ప్రత్యేక రైళ్లు తెలంగాణలోని జనగాం, కాజీపేట, పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాల, బెల్లంపల్లి, సిర్పూర్, కాగజ్ నగర్ స్టేషన్లో ఆగుతాయి. అంతేకాకుండా ఇతర రాష్ట్రాల్లోని మరికొన్ని స్టేషన్లలో ఆగుతాయని అధికారులు పేర్కొన్నారు. ఈ స్పెషల్ ట్రెన్స్ వలో 2ఏ, 3ఏ, స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్ లు అందుబాటులో ఉంటాయని వివరించారు. కుంభమేళకు ఈ సేవలను వినియోగించుకోవాలని కోరారు.

Whats_app_banner

సంబంధిత కథనం