ప్రయాణికులకు అలర్ట్... ఈ ప్రత్యేక రైళ్ల గడువు పొడిగింపు, వివరాలివే-south central railway updates six special trains extended for some more time ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  ప్రయాణికులకు అలర్ట్... ఈ ప్రత్యేక రైళ్ల గడువు పొడిగింపు, వివరాలివే

ప్రయాణికులకు అలర్ట్... ఈ ప్రత్యేక రైళ్ల గడువు పొడిగింపు, వివరాలివే

రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే అలర్ట్ ఇచ్చింది. వేసవి నేపథ్యంలో ప్రయాణికుల రద్దీ పెరిగింది. ఈ నేపథ్యంలో కొన్ని ప్రత్యేక రైళ్లను మరికొంత కాలం పొడిగించింది. వీటిలో హైదరాబాద్ సిటీ నుంచి నడిచే రైళ్లు ఎక్కువగా ఉన్నాయి.

రైల్వే ప్రయాణికులకు అలర్ట్ - ప్రత్యేక రైళ్లు పొడిగింపు

వేసవి నేపథ్యంలో ప్రయాణికుల రద్దీ కొనసాగుతోంది. రైల్వే ప్రయాణాల సంఖ్య పెరగటంతో స్టేషన్లలో రద్దీగా ఉంటోంది. ఈ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. పలు ప్రత్యేక రైళ్ల గడువును పొడిగించింది. ఈ మేరకు వివరాలను పేర్కొంది.

ఆరు ప్రత్యేక రైళ్లు పొడిగింపు - వివరాలు:

  • బుధవారం తిరుగు ప్రయాణమయ్యే మధురై - కాచిగూడ(07192) రైలు జులై 30 వరకు పొడిగింపు.
  • ప్రతి శనివారం నడిచే చర్లపల్లి - దానాపుర్​ ఎక్స్​ప్రెస్​(07419) రైలు జూన్​ 28 వరకు పొడిగింపు.
  • ప్రతి శుక్రవారం నడిచే కాచిగూడ - నాగర్​కోయిల్(07435) రైలును జులై 11 వరకు పొడిగించారు.
  • ప్రతి ఆదివారం నడిచే నాగర్​కోయిల్​ - కాచిగూడ(07436) రైలు జులై 13 వరకు పొడిగింపు.
  • ప్రతి సోమవారం నడిచే కాచిగూడ - మధురై(07191) రైలు జులై 28 వరకు పొడిగింపు.
  • దానాపూర్​ - చర్లపల్లి(07420) రైలు జూన్​ 30 వరకు పొడిగిస్తూ దక్షిణ మధ్య రైల్వే నిర్ణయం తీసుకుంది.

మరికొన్ని ప్రత్యేక రైళ్లు….

మరోవైపు తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ ప్రాంతాలకు వీక్లీ స్పెషల్‌ రైళ్లను నడిపించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని 44 ప్రత్యేక రైళ్లను నడపనుంది.

విశాఖ – బెంగళూరు (08581) మధ్య జూన్‌ ఒకటి నుంచి జూన్ 29వ తేదీ వరకు ప్రతి ఆదివారం రైలు రాకపోకలు సాగిస్తుంది . మరోవైపు బెంగళూరు - విశాఖ మధ్య జూన్‌ 2 నుంచి 30 వరకు ప్రతి సోమవారం రైలు అందుబాటులో ఉంటుంది.

విశాఖ -తిరుపతి రైలు జూన్‌ 5 నుంచి జులై 31 వరకు ప్రతి గురువారం అందుబాటులో ఉంటుంది. ఇక ప్రతి బుధవారం విశాఖ – తిరుపతి (08547) మధ్య మరో స్పెషల్ ట్రైన్ నడవనుంది. ఈ ట్రైన్ జూన్‌ 4 నుంచి జులై 30 వరకు రాకపోక సాగించనుంది.

మరోవైపు ప్రతి శుక్రవారం విశాఖ -చర్లపల్లి (08579) రైలు జూన్‌ 6 నుంచి జులై 27 వరకు నడుస్తుందని దక్షిణ మధ్య రైల్వే వివరించింది. ఇక ప్రతి శనివారం చర్లపల్లి నుంచి – విశాఖపట్నం (08580) మధ్య జూన్‌ 7 నుంచి జులై 26 వరకు స్పెషల్ ట్రైన్ నడవనుంది.

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.