AP TG Sankranti Special Trains : ప్రయాణికులకు అలర్ట్ - మరికొన్ని సంక్రాంతి ప్రత్యేక రైళ్లు ప్రకటన, నేటి నుంచే బుకింగ్స్
SCR Sankranti Special Trains 2025 : సంక్రాంతి వేళ ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండనుంది. ఈ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే మరికొన్ని ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. తాజాగా ఆరు సర్వీసులను ప్రకటించింది. హైదరాబాద్ - కాకినాడ మధ్య ఈ రైళ్లు రాకపోకలు సాగించనున్నాయి. తాజా అప్డేట్స్ ఇక్కడ చూడండి…
సంక్రాంతి వేళ ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. తాజాగా మరో 6 ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఈ ట్రైన్స్ హైదరాబాద్ - కాకినాడ మధ్య రాకపోకలు సాగించనున్నాయి. జనవరి 9వ తేదీ నుంచి 11 తేదీల్లో ఈ ట్రైన్స్ అందుబాటులో ఉంటాయని అధికారులు పేర్కొన్నారు.
కాచిగూడ - కాకినాడ టౌన్ మధ్య ప్రత్యేక రైలు అందుబాటులో ఉండనుంది. జనవరి 9,11 తేదీల్లో కాచిగూడ నుంచి ఈ ట్రైన్ రాత్రి 08.30 గంటలకు బయల్దేరుతుంది. మరునాడు ఉదయం 8 గంటలకు కాకినాడ టౌన్ కు చేరుతుంది.
ఈ నాలుగు రైళ్లు... మల్కాజ్ గిరి, చర్లపల్లి, నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల,సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, నిడవోలు, రాజమండ్రి, సామల్ కోట జంక్షన్లలో ఆగుతాయని అధికారులు తెలిపారు. ఈ రైళ్లలో 2ఏసీ, 3ఏసీ, స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ సిటింగ్ కోచ్ లు ఉంటాయి.
హైదరాబాద్ - కాకినాడ మధ్య స్పెషల్ ట్రైన్స్:
మరోవైపు హైదరాబాద్ నుంచి కాకినాడ టౌన మధ్య జనవరి 10వ తేదీన ఒక స్పెషల్ ట్రైన్ నడవనుంది. ఇది సాయంత్రం 06.30 గంటలకు బయల్దేరి మరునాడు ఉదయం 07.10 గంటలకు కాకినాడకు చేరుతుంది. ఇక కాకినాడ టౌన్ నుంచి జనవరి 11వ తేదీన మరో ట్రైన్ హైదరాబాద్ కు బయల్దేరుతుంది. రాత్రి 08 గంటలకు బయల్దేరే ఈ ట్రైన్ మరునాడు ఉదయం 08.30 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది.
ఈ స్పెషల్ ట్రైన్స్... సికింద్రాబాద్, నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల,సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, నిడవోలు, రాజమండ్రి, సామల్ కోట జంక్షన్లలో ఆగుతాయి . ఈ రైళ్లలో 2ఏసీ, 3ఏసీ, స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ సిటింగ్ కోచ్ లు ఉంటాయని అధికారులు తెలిపారు. ఈ ట్రైన్స్ కు సంబంధించిన బుకింగ్ ఇవాళ(జనవరి 02-01-2025) ఉదయం 8 గంటల నుంచే ప్రారంభం కానున్నాయి.
సంబంధిత కథనం