SCR Festival Special Trains : ప్రయాణికులకు గుడ్ న్యూస్... సికింద్రాబాద్ - విశాఖ మధ్య ప్రత్యేక రైళ్లు, ఇవిగో వివరాలు
SCR Festival Special Trains : ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే మరో అప్డేట్ ఇచ్చింది. ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండటంతో సికింద్రాబాద్ నుంచి ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఇక్కడ్నుంచి విశాఖ, బ్రహ్మపురకు సర్వీసులు అందుబాటులో ఉండనున్నాయి. రూట్ల వివరాలతో పాటు తేదీలను ఇక్కడ చూడండి…
క్రిస్మస్ పండగ వచ్చేస్తోంది.. అంతేకాకుండా వచ్చే నెలలో సంక్రాంతి పండగ రాబోతుంది. ఇంకేముంది చాలా మంది సొంత ఊర్లలోకి వెళ్లేందుకు సిద్ధమవుతుంటారు. అయితే ఇప్పుడిప్పుడే ప్రయాణికుల రద్దీ క్రమంగా పెరుగుతుండటంతో దక్షిణ మధ్య రైల్వే చర్యలు చేపట్టింది. రద్దీని తగ్గించటంతో పాటు ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేలా ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకువస్తోంది.
ఇందులో భాగంగా సికింద్రాబాద్ నుంచి దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. విశాఖపట్నం, బ్రహ్మపురకు ఈ సర్వీసులు అందుబాటులో ఉండనున్నాయి. డిసెంబర్ 6వ తేదీ నుంచి డిసెంబర్ 30వ తేదీ వరకు ఈ ట్రైన్స్ రాకపోకలు సాగించనున్నాయి.
సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం( ట్రైన్ 07097) డిసెంబర్ 8, 15, 22, 29 తేదీల్లో ట్రైన్ బయల్దేరుతుంది. సాయంత్రం 4.35 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6.30 గంటలకు విశాఖపట్నంకు చేరుకుంటుంది. అంతేకాకుండా విశాఖ నుంచి సికింద్రాబాద్(ట్రైన్ నెం. 07098) కు డిసెంబర్ 9, 16, 23, 30 తేదీలలో రాత్రి 7.50 గంటలకు మరో ట్రైన్ బయల్దేరుతుంది. ఇది మరుసటి రోజు ఉదయం 11.15 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది.
సికింద్రాబాద్ - విశాఖపట్నం మధ్య నడిచే ఈ స్పెషల్ ట్రైన్స్ నల్గొండ, మిర్యాలగూడ, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట, అన్నవరం, ఎలమంచిలి, అనకాపల్లి, దువ్వాడ స్టేషన్లలో ఆగుతాయి.వీటిల్లో 2 ఏసీ, 3 ఏసీ, స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు ఉంటాయని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.
మరోవైపు సికింద్రాబాద్ నుంచి ఒడిశాలోని బ్రహ్మపురకు ప్రత్యేక రైలు నడపనున్నారు. డిసెంబర్ 6, 13, 20, 27 తేదీల్లో శుక్రవారం రాత్రి 8.15 గంటలకు బయలుదేరుతుంది. మరునాడు మధ్యాహ్నం 2.45 గంటలకు బ్రహ్మపురకు రైలు చేరుకుంటుంది. ఇక బ్రహ్మపుర నుంచి సికింద్రాబాద్ కు మరో ట్రైన్ ఉంటుంది. ఇది డిసెంబర్ 7, 14, 21, 28 తేదీలలో శనివారం సాయంత్రం 4.45 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 11.35 గంటలకు సికింద్రాబాద్ చేరుతుంది.
ఈ ప్రత్యేక రైళ్లు నల్గొండ, మిర్యాలగూడ, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట, అన్నవరం, ఎలమంచిలి, అనకాపల్లి, దువ్వాడ, పెందుర్తి, కొత్తవలస, విజయనగరం, చీపురుపల్లి, శ్రీకాకుళం రోడ్, నౌపడ, పలాస, సొంపేట, ఇచ్ఛాపురంలో స్టేషన్లలో ఆగుతాయి. వీటిల్లో 2 ఏసీ, 3 ఏసీ, స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు ఉంటాయని దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది.
సంబంధిత కథనం