తెలుగు న్యూస్ / తెలంగాణ /
SCR Mahakumbh Mela Special Trains 2025 : ప్రయాగ్‌రాజ్ మహా కుంభమేళా... ఏపీ, తెలంగాణ నుంచి 26 ప్రత్యేక రైళ్లు, వివరాలివే
SCR Maha Kumbh Mela Trains 2025: ప్రయాగ్‌రాజ్ మహా కుంభమేళాకు వెళ్లే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శాఖ మరో అప్డేట్ ఇచ్చింది. ఏపీ, తెలంగాణ నుంచి మరో 26 స్పెషల్ ట్రైన్స్ ను ప్రకటించింది. ఈ రైళ్లు… పలు స్టేషన్లలో ఆగుతాయి.
మహా కుంభమేళకు 26 ప్రత్యేక రైళ్లు
రూట్ల వివరాలు:
- గుంటూరు - అజంఘర్ (ఫిబ్రవరి 14, 2025 నుంచి)
- అజంఘర్ - విజయవాడ -(ఫిబ్రవరి 16, 2024 నుంచి)
- అజంఘర్ - మచిలీపట్నం(ఫిబ్రవరి 5 నుంచి)
- కాకినాడ - అజంఘర్
- అజంఘర్ - విజయవాడ
- మౌలాలి - బనారస్
- బనారస్ - మౌలాలి
- మౌలాలి - గయా
- వికారాబాద్ - గయా
- విజయవాడ - గయా
- గయా - వికారాబాద్
- కాకినాడ - గయా
- గయా - విజయవాడ
- నాందేడ్ - పట్నా
- పట్నా - నాందేడ్
- ఔరంగబాద్ - పాట్నా
- పాట్నా - కాచిగూడ
- సికింద్రాబాద్ - పాట్నా
- పాట్నా - సికింద్రాబాద్ (ఫిబ్రవరి 9, 2025).
ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ, మచిలీపట్నం, విజయవాడ, కాకినాడ టౌన్ తో పాటు… తెలంగాణలోని మౌలాలి జంక్షన్, వికారాబాద్, సికింద్రాబాద్ స్టేషన్ల మీదుగా ఈ ట్రైన్స్ నడవనున్నాయి. ఈ జంక్షన్ల మధ్యలో ఉండే స్టేషన్లలో కూడా ఈ ట్రైన్స్ ఆగుతాయి.
మరో 12 ప్రత్యేక రైళ్లు - వివరాలు:
మహా కుంభమేళకు వెళ్లే భక్తుల రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే ఇటీవలే 12 ప్రత్యేక రైళ్లను కూడా ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ, తిరుపతి, నర్సాపూర్ నుంచి ప్రత్యేక రైళ్లను నడపనుంది. మొత్తం 12 స్పెషల్ ట్రైన్స్ నడపనున్నట్లు తెలిపింది.
- తిరుపతి - బనారస్ మధ్య నాలుగు ప్రత్యేక రైళ్లను ప్రకటించారు. ఈ రైళ్లు జనవరి 18, ఫిబ్రవరి 2, 25, 15, 22 తేదీల్లో ఈ ట్రైన్స్ రాకపోకలు ఉంటాయి. ఈ రైళ్లు నెల్లూరు, ఒంగోలు, చీరాల, తెాలి, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, రాజమండ్రి, సామల్ కోట, అన్నవరం, ఎలమంచలి, అనకాపల్లి, రాయగడ, మునిగుడతో పాటు మరికొన్ని స్టేషన్లలో ఆగుతాయి.
- బనారస్ - విజయవాడ మధ్య నాలుగు ప్రత్యేక రైళ్లను ప్రకటించారు. జనవరి 20, ఫిబ్రవరి 2, 25, 17, 24 తేదీల్లో అందుబాటులో ఉంటాయి. ఈ ట్రైన్ మంగళవారం సాయంత్రం 5.30 గంటలకు బయల్దేరి.. బుధవారం ఉదయం 5.30 గంటలకు విజయవాడ చేరుకుంటుంది.
- ఇక నర్సాపూర్ నుంచి బనారస్ కు 2 ప్రత్యేక రైళ్లు ఉన్నాయి. జనవరి 26, ఫిబ్రవరి 2 తేదీల్లో అందుబాటులో ఉంటాయి. ఈ ట్రైన్ ఉదయం 6 గంటలకు బయల్దేరి... మధ్యాహ్నం 3.45 గంటలకు బనాసర్ చేరుతుంది.
- బనారస్ నుంచి నర్సాపూర్ మధ్య మరో 2 ప్రత్యేక రైళ్లను ప్రకటించారు. ఈ ట్రైన్ జనవరి 27, ఫిబ్రవరి 3వ తేదీన ఉంటుంది. ఈ ట్రైన్ సాయంత్రం 5.30 గంటలకు ప్రారంభమై... ఉదయం 5 గంటలకు నర్సాపూర్ చేరుతుంది.
సంబంధిత కథనం