Sankranti Trains: సంక్రాంతి రద్దీ వేళ దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్-మరిన్ని ప్రత్యేక రైళ్లు, వందే భారత్ కోచ్ లు పెంపు-south central railway special trains vande bharat coaches hike on sankranti rush ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Sankranti Trains: సంక్రాంతి రద్దీ వేళ దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్-మరిన్ని ప్రత్యేక రైళ్లు, వందే భారత్ కోచ్ లు పెంపు

Sankranti Trains: సంక్రాంతి రద్దీ వేళ దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్-మరిన్ని ప్రత్యేక రైళ్లు, వందే భారత్ కోచ్ లు పెంపు

Bandaru Satyaprasad HT Telugu
Jan 12, 2025 07:00 PM IST

Sankranti Special Trains : సంక్రాంతి రద్దీ దృష్ట్యా తెలుగు రాష్ట్రాల మధ్య దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు నడుపుతోంది. తాజాగా సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య నడిచే వందే భారత్ ఎక్స్ ప్రెస్ కోచ్ లను 16కు పెంచారు. 1128 ప్యాసింజర్ కెపాసిటీతో రేపటి నుంచి ఈ ట్రైన్ అందుబాటులోకి రానుంది.

సంక్రాంతి రద్దీ వేళ దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్-మరిన్ని ప్రత్యేక రైళ్లు, వందే భారత్ కోచ్ లు పెంపు
సంక్రాంతి రద్దీ వేళ దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్-మరిన్ని ప్రత్యేక రైళ్లు, వందే భారత్ కోచ్ లు పెంపు

Sankranti Special Trains : సంక్రాంతి రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు నడుపుతోంది. సికింద్రాబాద్-విశాఖపట్నం-సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్ ప్రెస్( రైలు నంబర్ 20707 / 20708) జనవరి 13 నుంచి 16 కోచ్‌లతో నడుస్తుందని రైల్వే అధికారులు ప్రకటించారు. ప్రస్తుతం 8 కోచ్‌లతో (530 ప్యాసింజర్ కెపాసిటీ) నడుస్తున్న ఈ రైలు 16 కోచ్‌ల (1,128 ప్యాసింజర్ కెపాసిటీ)తో రేపటి నుంచి ప్రయాణికులకు అందుబాటులో వస్తుందని వెల్లడించారు. గతంలో ఒక ఎగ్జిక్యూటివ్ క్లాస్, 07 చైర్ కార్లు ఉన్నాయి. కొత్త కంపోజిషన్‌లో 1,024 కెపాసిటీతో 14 చైర్ కార్లు ఉంటాయి.02 ఎగ్జిక్యూటివ్ క్లాస్ 104 కెపాసిటీతో నడపనున్నారు.

yearly horoscope entry point

కోచ్‌ల రెట్టింపుతో ఎక్కువ సంఖ్యలో ప్రయాణికులు వందే భారత్ రైలు సేవలను వినియోగించుకుంటారని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ తెలిపారు. కోచ్‌లను రెట్టింపుతో పండుగ సీజన్‌లో ఎక్కువ సంఖ్యలో ప్రయాణికులు తమ స్వస్థలాలకు వెళ్లి సంక్రాంతి పండుగను జరుపుకోగలుగుతారని ఆయన అన్నారు.

ప్రత్యేక రైళ్లు

పండగ రద్దీ దృష్ట్యా మరో 36 ప్రత్యేక రైళ్లను నడపాలని దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది. వీటిలో సికింద్రాబాద్ నుంచి కాకినాడ టౌన్ మధ్య రెండు ప్రత్యేక రైళ్లు, హైదరాబాద్ నుంచి కాకినాడ టౌన్ మధ్య మరో రెండు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. దీంతో పాటు చర్లపల్లి-విశాఖపట్నం మధ్య జన సాధారణ్​ రైళ్లను నడపనున్నారు. ఈ అన్​రిజర్వ్​డ్​స్పెషల్​రైళ్లు చర్లపల్లి-విశాఖ స్టేషన్ల మధ్య జనవరి 10 నుంచి 17 మధ్య అందుబాటులో ఉంటాయి. మొత్తం 16 జన్ సాధారణ్ రైళ్లు రాకపోకలు సాగించనున్నాయి. ముందస్తు రిజర్వేషన్లు లేని వారికోసం, సాధారణ ప్రయాణికులు ఇబ్బంది పడకుండా అన్ రిజర్వ్ డ్ రైళ్లు నడుపుతున్నారు.

  • రైలు నెంబర్ 08541-విశాఖపట్నం నుంచి కర్నూలు సిటీ - జనవరి 10, 17, 24వ తేదీల్లో
  • రైలు నెంబర్ 08542- కర్నూలు సిటీ నుంచి విశాఖపట్నం-జనవరి 11, 18, 25 తేదీల్లో
  • రైలు నెంబరు 08547 - శ్రీకాకుళం నుంచి వికారాబాద్-జనవరి 12,19, 26వ తేదీల్లో
  • రైలు నెంబర్ 08548- వికారాబాద్ నుంచి శ్రీకాకుళం -జనవరి 13, 20, 27వ తేదీల్లో
  • రైలు నెంబర్ 02764- సికింద్రాబాద్ నుంచి తిరుపతి-జనవరి 10, 17 తేదీల్లో
  • రైలు నెంబర్ 02763 -తిరుపతి నుంచి సికింద్రాబాద్ -జనవరి 11, 18వ తేదీల్లో
  • రైలు నెంబర్ 07271-సికింద్రాబాద్ నుంచి కాకినాడ -జనవరి 12
  • రైలు నెంబర్ 07272 -కాకినాడ నుంచి సికింద్రాబాద్ - జనవరి 13

Whats_app_banner

సంబంధిత కథనం