SCR Special Trains: తిరుపతి, నాందేడ్, పానిపట్ కు స్పెషల్ ట్రైన్స్ - వివరాలివే-south central railway special trains to tirupati kachiguda nanded panipat ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  South Central Railway Special Trains To Tirupati Kachiguda Nanded Panipat

SCR Special Trains: తిరుపతి, నాందేడ్, పానిపట్ కు స్పెషల్ ట్రైన్స్ - వివరాలివే

HT Telugu Desk HT Telugu
Nov 04, 2022 08:05 PM IST

south central railway special trains: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా గుడ్ న్యూస్ చెప్పింది దక్షిణ మధ్య రైల్వే. పలు రూట్లలో స్పెషల్ ట్రైన్స్ ను ప్రకటించింది. ఈ మేరకు వివరాలను వెల్లడించింది.

దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు
దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు (HT)

South Central Railway Special Trains Latest: దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. తెలుగు రాష్ట్రాల్లోని ఇప్పటికే పలు ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు ప్రవేశపెట్టగా... ప్రయాణికుల కోసం మరికొన్ని ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.కాచిగూడ, తిరుపతి, నాందేడ్, పానిపట్ నగరాలకు స్పెషల్ ట్రైన్స్ ను నడపనుంది. టైమింగ్స్, తేదీలు, ఆగే స్టేషన్ల వివరాలు చూస్తే……

ట్రెండింగ్ వార్తలు

Tirupati Kachiguda Special Trains: కాచిగూడ - తిరుపతి మధ్య స్పెషల్ ట్రైన్స్ ప్రకటించారు దక్షిణ మధ్య రైల్వే అధికారులు. నవంబర్ 6వ తేదీన కాచిగూడ నుంచి రాత్రి 07.25 నిమిషాలకు బయల్దేరుతుంది. మరునాడు ఉదయం 09.30 నిమిషాలకు తిరుపతి చేరుతుంది.

ఈ స్పెషల్ ట్రైన్... మల్కాజ్ గిరి, నల్గొండ, మిర్యాలగూడ, నడికుడ, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గుడూరు, రేణిగుంట స్టేషన్లలో ఆగుతుంది.

Nanded - Panipat Special Trains : నాందేడ్- పానిపట్ మధ్య ప్రత్యేక రైళ్లను ప్రకటించారు. నవంబర్, 15, 22వ తేదీల్లో నాందేడ్ నుంచి ఉదయం 8 గంటలకు ట్రైన్ బయల్దేరుతుంది. మరునాడు సాయంత్రం 5 గంటలకు పానిపట్ కు చేరుతుంది.

మరోవైపు పానిపట్ నుంచి నాందేడ్ కూడా ప్రత్యేక రైలును నడపనున్నారు. ఈ ట్రైన్ నవంబర్ 16,23వ తేదీల్లో అందుబాటులో ఉంటాయి. ఆయా తేదీల్లో రాత్రి 11 గంటలకు బయల్దేరితే... రెండోరోజు తెల్లవారుజామున 04.15 నిమిషాలకు నాందేడ్ చేరుతుంది.

ఈ ప్రత్యేక రైళ్లు...పూర్ణ, పర్బాణీ, సేలూ, జల్నా, ఔరంగబాద్, కన్వాడా, రాణికమల్ పాటీ, లక్ష్మీబాయి, గ్వాలియల్, అగ్నా, మథురా, న్యూఢిల్లీ స్టేషన్లలో ఆగుతుందని అధికారులు తెలిపారు.

ఈ ప్రత్యేక రైళ్లలో 2ఏసీ, 3ఏసీ, స్లీపర్ క్లాస్ జనరల్ సెకండ్ క్లాస్ కోచ్ లు ఉంటాయి. ఈ సేవలను ఉపయోగించుకోవాలని ప్రయాణికులను అధికారులు కోరారు.

IPL_Entry_Point