SCR Sabarimala Special Trains : ఏపీ, తెలంగాణ నుంచి శబరిమలకు 28 ప్రత్యేక రైళ్లు - ఇవాళ్టి నుంచే బుకింగ్స్ !
South Central Railway Sabarimala Trains : శబరిమల భక్తులకు దక్షిణ మధ్య రైల్వే మరో అప్డేట్ ఇచ్చింది. హైదరాబాద్ లోని మౌలాలి, కాచిగూడ నుంచి ప్రత్యేక రైళ్లను నడపనుంది. భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో వేర్వేరు స్టేషన్ల నుంచి 28 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్టు ప్రకటించింది.
అయ్యప్ప భక్తుల రద్దీ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లపై మరో ప్రకటన చేసింది. వేర్వేరు స్టేషన్ల నుంచి శమరిమల 28 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు ప్రకటించింది. ఇందులో కొన్ని మౌలాలి నుంచి, మరికొన్ని కాచిగూడ, నర్సాపూర్ నుంచి ఉన్నాయి. ఈ ప్రత్యేక రైళ్లకు సంబంధించిన బుకింగ్స్ ఇవాళ్టి నుంచే అందుబాటులోకి రానున్నట్లు ఓ ప్రకటనలో పేర్కొంది.
మౌలాలి నుంచి స్పెషల్ ట్రైన్స్…
మౌలాలి రైల్వే స్టేషన్ నుంచి - కొల్లాంకు డిసెంబరు 11,18,25 తేదీల్లో ప్రత్యేక రైలు (ట్రైన్ నెంబర్ 07193) బయల్దేరుతుంది. ఇక కొల్లంనుంచి మౌలాలికి(ట్రైన్ నెంబర్ 07194) కూడా ప్రత్యేక రైలు ఉంటుంది. ఇది డిసెంబర్ 13,20,27 తేదీల్లో రాకపోకలు సాగిస్తుంది.
అంతేకాకుండా మాలౌలి నుంచి కొల్లాంకు (07149) డిసెంబర్ 14,21,28 తేదీల్లో ట్రైన్ ఉంటుంది. ఇక కొల్లం నుంచి మౌలాలికి (07150) కూడా ట్రైన్ బయల్దేరుతుంది. ఇది డిసెంబర్ 16,23,30 తేదీల్లో అందుబాటులో ఉంటుంది. ఆయా తేదీల్లో ఈ ట్రైన్ కొల్లాం నుంచి మధ్యాహ్నం 02,.30 గంటలకు బయల్దేరి... మరునాడు ఉదయం 09. 50 గంటలకు మౌలాలి చేరుకుంటుంది.
ఇక కాచిగూడ నుంచి కొట్టాయంకు ప్రత్యేక రైలను ప్రకటించింది దక్షిణ మధ్య రైల్వే. ఈ ట్రైన్ జనవరి 2,9,16,23 తేదీల్లో రాకపోకలు సాగిస్తుంది. ఇక కొట్టాయం నుంచి కాచిగూడకు కూడా ట్రైన్ ఉంటుంది. ఇది జనవరి 3,10,17,24 తేదీల్లో అందుబాటులో ఉంటుంది.
మరోవైపు ఏపీలోని కాకినాడ టౌన్ నుంచి కొల్లాంకు స్పెషల్ ట్రైన్ ను ప్రకటించారు. ఈ ట్రైన్ జనవరి 6, 13 తేదీల్లో అందుబాటులో ఉంటుంది. కొల్లాం నుంచి కాకినాడ టౌన్ కు జనవరి 8,15 తేదీల్లో మరో ట్రైన్ అందుబాటులో ఉంటుంది. ఇక నర్సాపూర్ నుంచి కొల్లంకు కూడా స్పెషల్ ట్రైన్స్ నడవనున్నాయి. జనవరి 20, 27 తేదీల్లో రాకపోకలు సాగిస్తాయి. అంతేకాకుండా కొల్లాం నుంచి నర్సాపూర్ కు జనవరి 22, 29 తేదీల్లో ట్రైన్ ఉంటుందని దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటనలో పేర్కొంది.
పండగ ప్రత్యేక రైళ్లు:
మరోవైపు క్రిస్మస్ పండగ వచ్చేస్తోంది.. అంతేకాకుండా వచ్చే నెలలో సంక్రాంతి పండగ రాబోతుంది. ఇంకేముంది చాలా మంది సొంత ఊర్లలోకి వెళ్లేందుకు సిద్ధమవుతుంటారు. అయితే ఇప్పుడిప్పుడే ప్రయాణికుల రద్దీ క్రమంగా పెరుగుతుండటంతో దక్షిణ మధ్య రైల్వే చర్యలు చేపట్టింది. రద్దీని తగ్గించటంతో పాటు ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేలా ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకువస్తోంది.
ఇందులో భాగంగా సికింద్రాబాద్ నుంచి దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. విశాఖపట్నం, బ్రహ్మపురకు ఈ సర్వీసులు అందుబాటులో ఉండనున్నాయి. డిసెంబర్ 6వ తేదీ నుంచి డిసెంబర్ 30వ తేదీ వరకు ఈ ట్రైన్స్ రాకపోకలు సాగించనున్నాయి.
సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం( ట్రైన్ 07097) డిసెంబర్ 8, 15, 22, 29 తేదీల్లో ట్రైన్ బయల్దేరుతుంది. సాయంత్రం 4.35 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6.30 గంటలకు విశాఖపట్నంకు చేరుకుంటుంది. అంతేకాకుండా విశాఖ నుంచి సికింద్రాబాద్(ట్రైన్ నెం. 07098) కు డిసెంబర్ 9, 16, 23, 30 తేదీలలో రాత్రి 7.50 గంటలకు మరో ట్రైన్ బయల్దేరుతుంది. ఇది మరుసటి రోజు ఉదయం 11.15 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది.
సంబంధిత కథనం