Indian Railways : భారతీయ రైల్వే మొదటి పార్శిల్ స్కానింగ్ మన దగ్గరే-south central railway installs first parcel scanner in hyderabad ,తెలంగాణ న్యూస్
Telugu News  /  Telangana  /  South Central Railway Installs First Parcel Scanner In Hyderabad

Indian Railways : భారతీయ రైల్వే మొదటి పార్శిల్ స్కానింగ్ మన దగ్గరే

దక్షిణ మధ్య రైల్వే పార్శిల్ సౌకర్యం
దక్షిణ మధ్య రైల్వే పార్శిల్ సౌకర్యం

దక్షిణ మధ్య రైల్వే (SCR) ఆధ్వర్యంలో భారతీయ రైల్వే మొట్టమొదటి పార్శిల్ స్కానింగ్ సదుపాయాన్ని ప్రవేశపెట్టింది. హైదరాబాద్ పార్శిల్ కార్యాలయంలో పార్శిల్ స్కానర్‌ను ఏర్పాటు చేశారు.

రైల్వే భద్రతా విషయంలో దక్షిణ మధ్య రైల్వే (SCR) మరో అడుగు ముందుకు వేసింది. రైల్వేలో తొలిసారిగా పార్శిల్ సౌకర్యాన్ని సికింద్రాబాద్ డివిజన్ లో ప్రారంభించారు. భారతీయ రైల్వే మొట్టమొదటి పార్శిల్ స్కానింగ్ సౌకర్యాన్ని ప్రవేశపెట్టారు. హైదరాబాద్ స్టేషన్ పార్శిల్ కార్యాలయంలో పార్శిల్ స్కానర్‌ను ఏర్పాటు చేశారు. పార్శిల్ సరుకులు సాధారణంగా ప్రత్యేక పార్శిల్ వ్యాన్‌లు లేదా ప్యాసింజర్ రైలు ద్వారా రవాణా చేస్తారు. పార్శిల్ సదుపాయం మరింత సురక్షిత ప్రయాణం చేసేందుకు ఉపయోగపడుతుంది.

ట్రెండింగ్ వార్తలు

ఇటీవలి కాలంలో రైల్వేలకు పార్శిల్ రవాణా చేసందుకు దక్షిణ మధ్య రైల్వే అనేక కార్యక్రమాలను చేపడుతోంది. తాజాగా మరింతగా ఆకర్శించేందుకు పార్శిల్ స్కానర్ ను తీసుకొచ్చింది. ఈ మధ్య కాలంలో దక్షిణ మధ్య రైల్వేలో పార్శిల్ రవాణా అభివృద్ధి చెందింది. ఈ నేపథ్యంలో ప్రయాణికుల భద్రత కోసం.. రైల్వేలో పార్శిల్ స్కానర్ ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రయాణీకులు మరియు వినియోగదారుల కోసం రైల్వే ద్వారా పార్శిల్స్ సురక్షితంగా ఉండేందుకు దక్షిణ మధ్య రైల్వే ఈ నిర్ణయం తీసుకుంది.

భారతీయ రైల్వే యొక్క కొత్త ఇన్నోవేటివ్ నాన్-ఫేర్ రెవెన్యూ ఐడియాస్ స్కీమ్ (NINFRIS) కింద స్కానర్‌లను ప్రారంభించినట్లు SCR సీనియర్ అధికారి తెలిపారు. రైల్వేలకు ఎటువంటి ఖర్చు లేకుండా పార్శిల్ స్కానర్‌లను ఏర్పాటు చేశారు. స్టేషన్ నుండి రవాణా కోసం బుక్ చేసిన అన్ని ప్యాకేజీలను ప్రయాణీకుల భద్రతను కోసం తప్పనిసరిగా స్కాన్ చేయాలి. స్కానింగ్ పూర్తయిన తర్వాత, స్కానింగ్ గుర్తుగా స్టిక్కర్లు/స్టాంపులు అతికిస్తారు. లీజు లేని పార్శిల్ వ్యాన్‌లలో బుక్ చేసిన పార్శిళ్లకు ఒక్కో ప్యాకేజీకి రూ.10 నామమాత్రపు రుసుం తీసుకుంటారు. లీజుకు తీసుకున్న వ్యాన్‌లలోని పార్శిళ్లకు ఒక్కో ప్యాకేజీకి రూ.5 చొప్పున వసూలు చేస్తారు.

జనరల్ మేనేజర్ (ఇన్ ఛార్జీ) అరుణ్ కుమార్ జైన్ మాట్లాడుతూరైల్ ప్రయాణికుల భద్రతకు దక్షిణ మధ్య రైల్వే ఎల్లప్పుడూ కట్టుబడి ఉందన్నారు. ప్రస్తుత కాలంలో ఈ రకమైన చొరవ చాలా అవసరమని అభిప్రాయపడ్డారు. ఇతర ప్రధాన పార్శిల్‌లకు ఈ రకమైన భద్రతను విస్తరించే సాధ్యాసాధ్యాలు రాబోయే రోజుల్లో పరిశీలిస్తామని చెప్పారు.

WhatsApp channel

సంబంధిత కథనం